S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మళ్లీ జోలీ!

హాలీవుడ్ బ్యూటీ ఏంజెలీనా జోలీ ఏడాది విరామం తర్వాత మళ్లీ అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఏంజెలీనా చేసిన చిత్రాలు.. ఆయా చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు మరపురానివి. తన వైవాహిక జీవితంలో ఎదురైన సంఘటనలతో కొంతకాలం ఆమె నటనకు దూరమైంది. గత సంవత్సరం బ్రాడ్‌పిట్ నుంచి విడాకులు తీసుకుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన పిల్లలకు పూర్తి సమయాన్ని కేటాయించేందుకు కొంతకాలం విశ్రాంతి తీసుకోబోతున్నట్లు గతంలో పేర్కొంది జోలీ. అయితే ఇంతకాలం వెండితెరకు దూరమైనా దర్శకురాలిగా మాత్రం బిజీ బిజీగా గడిపింది. ఈ వ్యవధిలో ‘్ఫస్ట్ ది కిల్డ్ ఫాదర్’ అనే చిత్రాన్ని తెరకెక్కించింది. తాజాగా వెనిస్‌లో జరిగిన చిత్రోత్సవంలో ఆ సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జోలీ మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నట్లు తెలియజేసింది. గతంలో జోలీ నటించిన ‘మేల్ ఫిసియంట్’ సీక్వెల్ కోసం చర్చలు జరుగుతున్నాయట. మరో చిత్రంలో ఈజిప్టు రాణి క్లియోపాత్రలో నటించే ఆలోచనలలో వుందట. అదీ..సంగతీ!