S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అతి చిన్న శునకాలు ఇవే!

చిహువాహువా జాతి శునకాలు డాగ్ ఫ్యామిలీలో అతి చిన్నవి. మెక్సికోలోని అతిపెద్ద రాష్టమ్రైన చిహువాహువా ప్రాంతంలో మొదటిసారిగా వీటిని కనిపెట్టినందున ఆ ప్రాంతం పేరే వాటికి పెట్టారు. మూడున్నర నుంచి 4.5 అంగుళాల ఎత్తు మాత్రమే పెరిగే ఈ శునకాలు పెద్ద చెవులు, గుండ్రని పెద్దకళ్లు, వెడల్పైన పెద్ద చెవులతో చూడముచ్చటగా ఉంటాయి. శునకాలన్నింటిలోకి ఇవి కాస్త ఆరోగ్యమైనవిగా చెప్పుకోవచ్చు. పెంపుడు శునకాల్లో వీటిదే అగ్రస్థానం. ముఖ్యంగా యుకె, యుఎస్, కెనడాల్లో వీటికి ఆదరణ ఎక్కువ. కుటుంబంలో ఎవరో ఒకరిని ఎక్కువగా అంటిపెట్టుకుని ఉండటం వీటికి ఇష్టం. ఒంటరిగా ఉంటే కుంగిపోతాయి. రోజుకు కనీసం రెండుసార్లయినా ‘వాకింగ్’కు తీసుకువెళ్లడం వాటి ఆరోగ్యానికి అవసరం. శునకాల జాతుల్లో మిగతావాటికన్నా వీటి జీవనకాలం అధికం. ప్రపంచంలో అతి చిన్న చిహువాహువా జాతి శునకంగా ‘మిరకిల్ మిల్లి 3.8 అంగుళాల ఎత్తుతో గిన్నిస్ రికార్డు సాధించింది. అలనాటి హాలీవుడ్ అందాల తార మార్లిన్‌మన్రోకు ఈ జాతి శునకాలంటే మహాఇష్టం.

ఎస్.కె.కె. రవళి