S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ధ్రువాలను చుట్టివచ్చే పక్షి

ఏడాదిలో భూగోళాన్ని చుట్టివచ్చే వలసపక్షి ఇది. దీని పేరు ఆర్కిటిక్ టెర్న్. కేవలం వంద గ్రాముల బరువు, 40 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉండే ఈ పక్షి ఏటా కనీసం సగటున 70,900 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఆహార లభ్యత ఆధారంగా ఏటా వేసవిలో ఆర్కిటిక్ ప్రాంతం నుంచి అంటార్కిటికాకు వలస వెళతాయి. సంతానోత్పత్తి తరువాత మళ్లీ ఆర్కిటిక్‌కు వెళతాయి. వెళ్లేటపుడు అక్కడక్కడ ఆగుతూ మూడునెలల ప్రయాణం తరువాత గమ్యాన్ని చేరే ఈ పక్షులు తిరుగుప్రయాణాన్ని కేవలం 40 రోజుల్లో పూర్తి చేస్తాయి. గాలుల వేగం, దిశను బట్టి అడ్డదారుల్లో ఇవి ప్రయాణించడం విశేషం. ఐస్‌ల్యాండ్ గ్రీన్‌లాండ్‌లకు ఓ తడవ, నెదర్లాండ్‌కు మరో తడవ వెళ్లడం వీటికి అలవాటు. కొన్ని పక్షులు ఏడాదిలో ఒక ధ్రువం నుంచి మరో ధ్రువానికి, అక్కడి నుంచి మళ్లీ మొదటి ధ్రువానికి చేరడానికి దాదాపు 90 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు అధ్యయనాల్లో రుజువైంది. ఇంత చిన్నపక్షులు అంత దూరం ఎలాంటి అలుపూసొలుపూ లేకుండా ప్రయాణించడం విశేషం. ఇంత దూరం ప్రయాణించే మరో పక్షి లేదంటే నమ్మాల్సిందే. ఇవి ఏడాదిలో ప్రయాణించే దూరం ఎంత ఉంటుందంటే.. భూమి నుంచి చంద్రుడిని మూడుసార్లు చుట్టివచ్చినంత. పిట్టకొంచెం కూత ఘనం అంటే ఇదేకదా!

ఎస్.కె.కె. రవళి