S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్లూటో గ్రహానికి పేరు పెట్టిందెవరో తెలుసా?

నెప్ట్యూన్ గ్రహం చుట్టూ ఉండే రింగుల నేపథ్యంలో కనిపించే అతి చిన్న గ్రహం ప్లూటో. దీనిని 1930లో క్లైడ్ టొమ్‌బాగ్ అనే ఖగోళ శాస్తవ్రేత్త కనిపెట్టారు. అయితే దీనికి ఏం పేరుపెట్టాలన్నదానిపై ఆలోచన చేస్తున్న సమయం అది. వెనెటియా బర్న్‌లీ అనే పదకొండేళ్ల బాలిక ప్లూటో పేరును పెడితే బాగుంటుందని తన తాత ఫాల్కన్ మదన్‌తో చెప్పింది. ఇతను బాడ్‌లియాన్‌లోని ఆక్స్‌ఫర్డ్ లైబ్రరీలో ఉద్యోగి. గడ్డకట్టిన ఈ సరికొత్త గ్రహానికి ఇంకా పేరుపెట్టలేదని ఓ దినపత్రికలో చదివినప్పుడు ఆమె ప్లూటో పేరును పెడితే బాగుంటుంది కదా తాతా అనడంతో ఆయన పరమానందభరితుడయ్యాడు. ప్లూటో రోమన్ల పురాణాల్లో అధోజగత్తుకు అధిదేవత. నిజానికి ఈ కొత్తగ్రహం కూడా భూమికి సుదూరంగా, చీకటిమాటున, గడ్డకట్టి ఉండటం వల్ల ప్లూటో పేరు సరిగ్గా సరిపోతుందని ఫాల్కన్ భావించారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఖగోళ శాస్తవ్రేత్త ప్రొఫెసర్ హెర్బర్ట్ హాల్ టర్నర్‌కు ఈ విషయాన్ని ఫాల్కన్ చెప్పారు. ఇదే విషయాన్ని అరిజోనా లోవెల్ అబ్జర్వేటరీలో పరిశోధనల్లో మునిగితేలుతున్న టొమ్‌బాగ్‌కు టెలిగ్రామ్ ద్వారా చేరవేశారు. అది నచ్చి ఆ గ్రహానికి ప్లూటో అని పేరు పెట్టేందుకు టొమ్‌బాగ్ అంగీకరించారు. ఆ ప్లూటో గ్రహంపై ఉండే అతిపెద్ద బిలానికి ఇప్పుడు అలనాటి పదకొండేళ్ల ఇంగ్లీష్ బాలిక బర్న్‌లీ పేరు పెట్టారు. అదీ విశేషం. ఆమె 2009లో కన్నుమూశారు. ఈ మరుగుజ్జు గ్రహాన్ని తొలిసారిగా నాసా వ్యోమనౌక 2015లో స్పష్టమైన చిత్రాలను తీయగలిగింది. ఆ గ్రహం భౌగోళిక స్వరూపం తొలిసారిగా ప్రపంచానికి తెలిసింది అప్పుడే. 14 పెద్దబిలాలు, కొండలు, లోయలు ఆ గ్రహంలో ఉన్నట్లు తేలింది. లేత నారింజ రంగులో కనిపించే ఈ గ్రహంపై ఉన్న బిలాలకు వివిధ శాస్తవ్రేత్తల పేర్లు పెట్టారు. వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ప్లానిటరీ సిస్టమ్ నోమెన్‌క్లేచర్ (డబ్ల్యుజిపిఎస్‌ఎన్) ఈ పేర్లను ప్రతిపాదించింది. అంతరిక్షరంగంలో సేవలందించినవారు, పురాణాల్లో ప్రముఖులు, శాస్తవ్రేత్తలు, ఇంజనీర్లు, ప్లూటో, కూపెర్‌బెల్ట్ వ్యవహారాల్లో పాలుపంచుకున్నవారి పేర్లను ఈ బిలాలకు, పర్వతాలకు పెట్టారు. ప్లూటోలో ఉండే విస్తారమైన ప్రాంతానికి ఈ గ్రహాన్ని కనిపెట్టిన క్లైడ్ పేరును పెట్టారు.