S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిత్రం.. భళారే విచిత్రం!

చిత్రం... భళారే విచిత్రం!
యుగాలు మారినా
తరాలు మారినా
విజ్ఞాన శాస్త్రాలు వెల్లివిరుస్తున్నా
కంప్యూటర్ ఉద్యోగాలు దేశాలను కలిపినా
సెల్‌ఫోన్లు వాటి మధ్య దూరాలను తగ్గించినా
ఇంటర్నెట్ ప్రపంచాన్ని కుగ్రామం చేసినా
మనిషిలోని అజ్ఞానపు స్థాయి తగ్గలేదు
దురహంకారం దురాక్రమణాలోచన చెరగలేదు
అలెగ్జాండర్ దుర్మరణం గాని
హిట్లర్ నికృష్టపు చావుగాని
మనిషికి జ్ఞానోదయం కలిగించకపోవడం
చిత్రం... భళారే విచిత్రం!

ఓ దేశపు ఉత్పత్తి
మరో దేశపు అత్యవసరం
ఆ దేశపు అవసరం
ఈ దేశానికి ఆదాయం
ఏ దేశపు మేథావులైనా
ప్రపంచం మొత్తానికి అవసరం
ప్రపంచ శాంతికాముకుల
ఆలోచనలు గాని
ఆవేదనలు గాని
బోధనలు గాని
ఏ దేశానికీ అవసరం లేకపోవడం
చిత్రం... భళారే విచిత్రం!
మనిషి సంఘ జీవి
మనిషికి మనిషి అవసరం
దేశమంటే మట్టి కాదు మనుషులని
గురజాడకు మాత్రమే ఎరుకా?
తెలిసే,
మనుషులను మనుషులు చంపుకుంటున్నారా?
ప్రపంచ పటంలోని గీతలు
మనుషుల మధ్య అగాధాలా?
గీతకు ఇరువైపుల వాళ్లకు
ఆకలి దప్పికలు అన్నట్లే
ప్రేమానురాగాలూ ఉంటాయి కదా!
మనిషై పుట్టిన వానికి మానవత్వముండదా?
కుతంత్రాలు, కుయుక్తులు
వీర జవాన్ల ఊపిర్లు తీస్తుంటే
మానవత్వమనే ఆయుధంతో
వాటి మీద యుద్ధం చేయలేవా?
పొరుగు దేశం మీద దండెత్తించి
దేశభక్తుల ప్రాణాలు పొట్టన పెట్టుకోవడం
చిత్రం... భళారే విచిత్రం! *

-టి.వి.సుబ్రహ్మణ్యేశ్వరరావు 9908893669