S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘వి’హారం!

చూడాలని ఉంటుంది!
వెళ్లలేని సుందర ప్రదేశాల్నీ...
చూపుండీ చూడలేని సందర్శనా స్థలాల్నీ...

చూడాలని ఉంటుంది!
సుదూర తీరాల్నీ...
ఆ తీరాల్లో భిన్న రూపాల
కొన్ని సుందర సుకుమార దేహాల్నీ..!!

చూడాలని ఉంటుంది!
స్వప్నంలో సంచరించే పరిసరాల్నీ,
విహరించే అనుభూతుల జాడల్ని తడిమి తడిమి
కట్టగట్టి తీసుకురావాలనీ...!!

చూడాలని ఉంటుంది!
పోయినోళ్ల పాద ‘ముద్ర’ల్ని
నలుపు తెలుపు చిత్రాల్లో భద్రించుకున్న
జ్ఞాపకాల్నీ..
వారితో గడిపిన దుర్మఖ కాలాల్నీ
తరచి తరచి మధుర క్షణాలుగా తీర్చిదిద్దుకున్న
భావనల్నీ...

చూడాలని ఉంటుంది!
పక్కింటి, ఎదురింటి వాళ్లనీ..
వారితో కరువారా సంభాషిస్తూ
గడిపే కలగొలుపు మాటల పలకరింపుల్నీ...
కాని-
వాళ్లిప్పుడు ఎవరింట్లో వాళ్లున్నా
మనసులు ఫేస్‌బుక్కుల్లోనూ
వాట్సాప్ గ్రూపుల్లోనో కలగలిసిపోయి
ఎవరికి వారు ‘తప్పిపోయి’
విశాలపర్చుకున్న కొంగ్రొత్త ప్రపంచంలో
గుర్తుపట్టలేని ఆనవాళ్లల్లో...
చేతిలో బిగించేసుకున్న ‘వి’హారం?!
*

-చలపాక ప్రకాష్ 9247475975