S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అటు-ఇటు

ఎక్కడో ఒక అపనమ్మకం
నీలి పరదాలాగా
వివేకాన్ని కప్పేస్తుంది
ఎక్కడో ఒక దుస్సంఘటన
చెవులకు చేరి
మనస్సు నాక్రమించి బాధిస్తుంది

కలల్ని మోస్తున్న కళ్లు
బేలతనంతో ఒక్కసారిగా
రెపరెపలాడుతాయి
కోటి ఆశల ఊసులతో
కొత్త ప్రపంచంలోకి
అడుగుపెట్టిన నవవధువుకి
ఏ రాయి ఎటు నుంచి వచ్చి
తగులుతుందో తెలియక
మాట వౌనాన్ని దాలుస్తుంది

ఆసరా ఇవ్వాల్సిన చేయి
నిస్సహాయంగా వదిలివేయటమో
తానూ ఒక రాయిగా మారి
నుదుటిని బొప్పి కట్టించటమో జరుగుతుంది
నమ్మకానికి, అపనమ్మకానికి మధ్య
అటు-ఇటు ఊగుతూ
మనసు ఒక తులాదండం
ఇన్నీ దాటుకుని
నవరసభరితంగా
జీవితం గడిపేది
ఇంద్రధనస్సు రంగులు
అద్దుకునేది
ఆనంద మకరందాన్ని
జుర్రుకునేది
ఏ కొద్దిమందో.

-నూతలపాటి వెంకట రత్నశర్మ 9866376050