S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సాహస యాత్ర

మహిళలు వివిధ రంగాలలో ఎలా దూసుకు వెళుతున్నారో ‘సాగర కన్యలు’ వ్యాసం మరింతగా ప్రస్ఫుటింపజేసింది. ఈ వ్యాసాన్ని ఆడపిల్లలందరూ చదివి జీవితంలో వారు కూడా అలా ఉన్నత విద్యార్జనలోని లోతుపాతులను గ్రహించి అత్యున్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నాం. విజయవాడ ఆకాశవాణిలో దాదాపు యాభై ఏళ్ల క్రితం ప్రసారమయిన రాగరంజిత, రసరమ్యమైన గేయాలు ఎప్పుడూ గుర్తుంచుకోదగ్గవి. నిత్యం వినదగ్గవి. బాలమురళీకృష్ణ, శ్రీరంగం, వోలేటి, నేదునూరి మొదలగువారు భక్తిరంజనికి చేసిన సేవా, పరిశ్రమ ఎల్లప్పుడూ స్మరణీయం. అక్షరాలోచనలలోని కవితలన్నీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటున్నాయి. ‘సండే గీత’లోని పెంపకం- ఆకట్టుకొంది. ఇక ‘లోకాభిరామమ్’ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎనె్నన్నో విశేషాలను అందిస్తున్నందుకు గోపాలంగారికి కృతజ్ఞతలు.
-డా.శివభూషణం (కర్నూలు)
అలరించాయి
మీకు తెలుసా? అంటూ డ్రాగనెట్ కుటుంబానికి చెందిన రంగురంగుల చేపలు, విషపూరిత స్టోన్ ఫిష్, విరుగుడే లేని విషం కలిగిన నత్తల గురించి చెప్పిన విషయాలు విశేషంగా అలరించాయి. 200 డిగ్రీల ఉష్ణోగ్రత తట్టుకునే శరీరంతో సలసల కాగే నూనెలో వేగుతున్న చేపముక్కల్ని వట్టి చేతులతో బైటకు తీసే కరోల్‌బాగ్ అగ్నిపుత్రుడు ఉదంతం చదివి ఆశ్చర్యపోయాం. విజ్ఞానం శీర్షికలో పక్షుల రంగుల వెనుక రహస్యాల్ని చక్కగా వివరించారు. పెరుగు, మజ్జిగ అన్నం తిన్నాక పాల పదార్థాలు తినరాదని, సాంబార్ ఇడ్లీ తిన్నాక కాఫీ, టీలు తాగరాదని తెలుసుకొని ఆశ్చర్యపోయాం.
-ఆర్.సత్య (కరప)
నడిచే మనిషి
‘లోకాభిరామమ్’లోకి మళ్లీ నడిచే మనిషి వచ్చాడు! ఫిర్ సే ఖయాలోమేఁ! గోపాలం గారికి నడిచే మనిషి గురించి ఎన్నిసార్లు రాసినా తనివి తీరనట్టే ఎన్నిసార్లు చదివినా మాకూ తనివి తీరదు! ఒక ముసల్మాన్ ‘నా తెలుగు’ అంటూ రాసిన కవిత ఆశ్చర్యమే గాక పరమానందం కలిగించింది. కవర్‌స్టోరీ ‘సాగర కన్యల సాహస యాత్ర’ ఆసక్తికరంగా ఉంది. ఈ మధ్య మహిళలు క్రికెట్, బాడ్మింటన్‌లలోనూ అద్భుతాలు చేస్తున్నారు. లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం అని సినీ కవి ఏనాడో రాసినవన్నీ ఇప్పుడు నిజం అవుతున్నాయి.
-హెచ్.పవనపుత్ర (రామారావుపేట)
నమ్మలేని నిజాలే!
మార్నింగ్ స్టార్ దినపత్రిక విలేకరి హెన్రీ అర్ధరాత్రి నాలుగు పేలుళ్లు వినడం, తనకు తెలియకుండానే రెండు వేల మైళ్ల దూరంలోని అగ్ని పర్వతం బద్దలైందని రిపోర్టు రాసి ముద్రణకు పత్రికకు ఇవ్వడం, ఆ పత్రిక ఆ వార్తను ప్రచురించినా మరెక్కడా ఆ వార్త రాకపోవడం, ఆ వార్తని, హెన్రీని సంపాదకుడు అనుమానించడం తర్వాత అన్ని పత్రికలు నిజంగానే అగ్నిపర్వతం బద్దలైనట్లు ప్రచురించడం అంతా అయోమయంగా ఉన్నప్పటికీ ఇది నమ్మలేని నిజం. మరోసారి అమెరికా అధ్యక్షుడు హత్యకు గురి కాబోతున్నట్లు హెన్రీ రాసి కూడా ముద్రణకు పంపకపోయినా అధ్యక్షుడు నిజంగా హత్యకు గురి కావడం నమ్మలేని నిజాలే.
-కె.ప్రవీణ్ (కాకినాడ)
ప్రేరణ
ఈ మధ్యనే ఒక కేరళ నటిని రౌడీలు కారులో అల్లరి పెట్టారన్న వార్త గుప్పుమంది. ఆమె పోలీసులకు రిపోర్టు చేయడంతో కేరళ అగ్రనటుడే ఆమెను బద్నామ్ చేయడానికి రౌడీలను పురమాయించాడని తేలింది. అతడిని అరెస్టు చేశారు. బహుశా ఈ ఘటన ‘ఉప్పెన’ కథకు ప్రేరణ కావచ్చు. కథనం బాగుంది. మర్యాద మంటగలుస్తుందనీ, కెరీర్ నాశనం అవుతుందనీ పెద్దలు పిరికిమందు నూరిపోసినా నిర్భయంగా ముందడుగు వేసినందుకు కథానాయకి కీర్తిని, ఆ కేరళ నటిని మెచ్చుకోవలసిందే. క్రైం కథ చాలా బాగుంది. ఎవరూ ఊహించని విధంగా నేరస్తులు పట్టుబడ్డారు. నిజమే. క్రైం నెవ్వర్ పేస్. ఎంత తెలివైన వాడైనా నేరం చేసి తప్పించుకోలేడు.
-కె.సుభాష్ (శ్రీనగర్)
మిణుగురులు
‘సండే గీత’లో పెంపకం గూర్చి చక్కగా వివరించారు. పిల్లలకు కావలసిన దానికంటె ఎక్కువగా అందించటం వలన, వాళ్లకి కష్టమంటే ఏమిటో తెలియకుండానే పెరుగుతున్నారు. పూర్తి సహకారాన్ని అందించకుండగ, వారిని కొంత వదిలిపెట్టినట్లయితే వారి బాధ్యతలను గూర్చి వారు తెలుసుకుంటారని చక్కగా తెలిపారు. ఓ చిన్న మాటలో ‘మిణుగురులు’ చక్కటి నీతిని తెలిపింది. మిణుగురులను చూసి మనం నేర్చుకోవలసింది చాలా వుంది.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)
సంతకం
‘అక్షరాలోచనలు’ శీర్షికన ప్రచురించిన ‘సినారె సంతకం’ కవిత బాగుంది. సింహ ప్రసాద్‌గారి ‘ఉప్పెన’ కథ ఆలోచింపజేసేదిగా ఉంది. సమాజంలో తాను ఎదుర్కొన్న ప్రతి సవాలునీ తిప్పికొట్టి, ఆయా సంఘటనలకు కారణమైన వ్యక్తులకు బుద్ధి చెప్పిన కీర్తి పాత్ర ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. నేను పాదాలను కడిగి వెనక్కి వెళ్లిపోయే సముద్ర కెరటాన్ని కాదు. ఉప్పెనని. ఆగ్రహిస్తే నిలువునా ముంచెత్తిగాని వదలను.. అన్న మాటలు బాగున్నాయి. ‘సాగర కన్యలు’ కథనం ఆలోచింపజేసేదిగానూ.. స్ఫూర్తిదాయకంగానూ ఉంది.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)
చక్కగా ఉంది
మొక్కలకు అవసరాన్ని మించి ఎరువు, నీళ్లు ఇవ్వడం వల్ల అవి సోలిపోతాయి. అలాగే పిల్లలకూ అవసరానికి మించి ఇవ్వడం వల్ల వాళ్లు సోమరులుగా, ఆధారపడేవారిగా తయారవుతారు -అన్న ‘సండే గీత’ బహు చక్కగా ఉంది. ‘అవీ ఇవీ’లోని అంశాలన్నీ అలరించాయి. అక్షరాలోచనల్లో ‘గళం విప్పండి’ కవిత చాలా బాగుంది. మా చిన్నప్పుడు ఆకాశవాణి ‘్భక్తిరంజని’ వింటూ పనులు చేసుకునేవాళ్లం. మనసెంతో ప్రశాంతంగా ఉండేది. అమృతవర్షిణి చదువుతుంటే బాల్యం జ్ఞాపకం వచ్చింది.
-పి.చంద్ర (తూ.గో.జిల్లా)