S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కథలని ప్రేమిద్దాం

ప్రపంచంలోని మిగతా జాతులకి మనుషులకి ఉన్న భేదం భాష. చెట్లకి, జంతువులకి కూడా భాష ఉందని కూడా చెబుతారు. వాటికి భాష ఉందో లేదో తెలియదు కానీ కొన్ని విషయాలని అవి గ్రహించగలవు. భాష వల్ల మనిషకి మిగతా జాతులకి భేదం ఏర్పడింది. భాష వల్ల మనిషికి మనిషికి మధ్యనే విషయాలు తెలియపరచుకునే పరిస్థితి ఏర్పడింది. భాష ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది మనకు తెలియకపోవచ్చు. కానీ భాష వల్ల మనిషి ప్రత్యేకంగా మారినాడు.
భాష వల్ల మనుషుల మధ్యన సాంఘీక సంబంధాలు పెరిగాయి. ఒకరి అనుభవాలని మరొకరికి చెప్పే వెసులుబాటు కలిగింది. ఆ అనుభవాలు కథల రూపందాల్చి ఆకర్షించాయి. మనం తెలుపుకున్న విషయాలను ఇతరులకు చెప్పడం తొలుత కథల రూపంలో జరిగేది. విజేతలు, తత్త్వవేత్తలు, ప్రవక్తల, యోధుల, నాయకుల కథలు మనందరికి ఉత్తేజం కలిగించే విధంగా మారాయి. మన ఆలోచనల్ని అవి కలియతిప్పే విధంగా మార్పు చెందాయి. మనలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, బలాన్ని నింపే ఔషధాలుగా కథలు పని చేయడం మొదలు పెట్టాయి.
మంచి కథల ద్వారా మంచి ఆలోచనలు, కొత్త తోవలు, కొత్త అలవాట్లు ఏర్పడుతాయి. కష్ట సమయంలో వున్న వ్యక్తిని కొన్ని కథలు పైకెత్తుతాయి. వాళ్లలో ధైర్యాన్ని నింపుతాయి. కొన్ని గంటల ఉపన్యాసం చేసే పని ఓ చిన్న కథ అలవోకగా చేస్తుంది. మనం గంటసేపు చెప్పి స్వాంతన పరిచే అంశం ఓ చిన్న కథ ద్వారా ఐదు నిమిషాల్లో సాంత్వన పరచవచ్చు. మనం చూపించే దారిని కథ ద్వారా సులువుగా తెలియపరచవచ్చు.
మన అనుభవాన్ని ఓ మంచి కథగా మనం చెప్పినప్పుడు అందులో మనం చెప్పదలచుకున్న విషయాన్ని, అభిప్రాయాన్ని విడమరిచి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆ విషయాన్ని పాఠకుడు గ్రహిస్తాడు. అదే కథకు వున్న ఆకర్షణ. కథలోని గొప్పతనం.
మనం నేర్చుకున్న విషయాలని ఇతరులకి కథల రూపంలో చెబుతాం. ప్రపంచం గురించి మన అవగాహనని, మనం చూసిన కోణాన్ని ఇతరులకి తెలియజెబుతాం. మీ గురించి నాకు తెలిసిన విషయాలని, నా గురించి మీకు తెలిసిన విషయాలని కథల రూపంలో చెప్పినప్పుడు అవి హృదయానికి హత్తుకుంటాయి.
మంచి కథలు మనల్ని ఉల్లాసపరుస్తాయి. ఉత్తేజపరుస్తాయి. మంచి మార్గం వైపు నడిపిస్తాయి. మనలో నిద్రిస్తున్న మానవత్వాన్ని తట్టి లేపుతాయి. పనిలేని ముచ్చట్లు కూడా కథలుగా మార్పు చెందుతాయి. అయితే అవి హాని కలిగించే కథలు.
అందుకే మంచి కథల్ని చెపుకుందాం. మంచి కథల్ని విందాం.