S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రపంచ శాస్తవ్రేత్తలు.. సి.వి.రామన్

ప్రపంచ వ్యాప్తంగా భౌతిక శాస్తవ్రేత్తలందరూ గర్వించతగిన వ్యక్తిగా, స్ఫూర్తిదాతగా సి.వి.రామన్‌ని చెప్పుకుంటారు. రామన్ కంటే ముందు భౌతిక శాస్త్ర పరిశోధనలు గావించినవారు ఎక్కువమందే ఉన్నా రామన్ రాకతో కొత్త ఉత్సాహం, కొత్త ఆవిష్కరణలకు నాంది పలికినట్లయిందని చెప్పవచ్చు.
తిరుచునాపల్లిలో సి.వి.రామన్ జన్మించారు. 16 ఏళ్ల వయసులోనే భౌతిక శాస్త్రంలో డిగ్రీ పొందారు. 1917లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆయన భౌతిక శాస్త్రంలో పాలిట్ ప్రొఫెసర్‌గా నియమించబడటం విశేషం.
రామన్ ముఖ్యంగా కాంతిపై ప్రయోగాలు చేశారు. అనేక సంవత్సరాల పాటు ఆయన సాగించిన పరిశోధనల వల్ల ‘రామన్ ఎఫెక్ట్’ అనబడే అంశాన్ని భౌతిక శాస్త్రంలో ప్రతిపాదించడం జరిగింది. భారతదేశం లాంటి ఎదుగుతున్న దేశంలో ఆ మాత్రం పరిశోధనలు చేయడం, ప్రపంచంలోని శాస్తవ్రేత్తల దృష్టిని ఆకర్షించడం గొప్ప విషయం. నిద్రాహారాలు మాని ప్రతి నిమిషం నూతన ఆవిష్కరణల కోసం తపించిపోయే శాస్త్ర ఘనుడు అయిన సి.వి.రామన్ తపస్సు ఫలించింది. భౌతికశాస్త్ర ప్రపంచమే కాకుండా అత్యున్నత స్థాయి మేధావి వర్గం కూడా గుర్తించింది. అందుకు తార్కాణమే 1930 సం.లో రామన్‌కు నోబెల్ బహుమతి ప్రదానం చేయడం జరిగింది.
1948లో బెంగళూరులో ఆయన ‘రామన్ విజ్ఞానశాస్త్ర సంస్థ’ను స్థాపించారు. తెల్లని కాంతి కిరణం పదార్థం గుండా ప్రసరించినప్పుడు లోనయ్యే ప్రభావాన్ని ‘రామన్ ఎఫెక్ట్’ అంటారు. దీని ద్వారా పదార్థాల భౌతిక, రసాయనిక ధర్మాలను స్పష్టంగా తెలుసుకోవచ్చు. ‘రామన్ ఎఫెక్ట్’ వలన స్ఫటికాల నిర్మాణం, పదార్థాలలోని అణువుల నిర్మాణాన్ని తెలుసుకోవడం జరిగింది.
రామన్ అభిప్రాయం ప్రకారం, కంటిలో రంగుల రసాయనికాల ఉత్పత్తికి కారణం హిమగ్లోబిన్‌లోని ఇనుము. ఈ రసాయనికాల మూలంగానే మనం నిర్దుష్టంగా మూడు వర్ణాలను చూడగలుగుతున్నాము. ఇంతటి గొప్ప భౌతిక శాస్త్ర మేధావి 1970 సం.లో మరణించారు. ఇప్పటికీ సి.వి.రామన్ పేరున ఎన్నో అవార్డులు నెలకొల్పటం విశేషం.

-పి.వి.రమణకుమార్