S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాయవ్యంలో సెప్టిక్ ట్యాంకు (వాస్తు)

బి.రావు (ఆముదాలవలస)
ప్రశ్న: ఉత్తరం ముఖద్వారం కలిగిన ఇళ్లకు పూజ గదిని హాలులో ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి?
జ: ఉత్తరం ముఖద్వారం కలిగిన ఇళ్లకు వంటగది తర్వాత తూర్పు మధ్యభాగంలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే దేవుని ఫొటోలు పడమర ముఖంగా, పూజ చేసేవారు తూర్పు ముఖంగా పూజను చేయాలి.
శ్రీకాంత్ (సిరిసిల్ల)
ప్రశ్న: మా ఇంటికి వాయవ్యంలో సెప్టిక్ ట్యాంకు వున్నది. అలా ఉండవచ్చునా?
జ: వాయవ్య మూలలో సెప్టిక్ ట్యాంకు ఉండరాదు. అలా వున్నట్లయితే దీనివల్ల పనులు వాయిదా పడటం, శుభకార్యాలు వాయిదా పడటం, అలాగే వ్యాపారంలో నష్టాలు రావడం జరుగుతాయి. సెప్టిక్ ట్యాంకును ఉత్తర మధ్యభాగంలోకి మార్చుకోండి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
శ్రీమణి (చీమకుర్తి)
ప్రశ్న: మేం ఒక ఫ్లాట్ కొన్నాం. ఆ ఫ్లాట్ కొన్నదగ్గర నుండి ఏదో ఒక సమస్య వస్తున్నది. దీనికి కారణం తెలియడం లేదు.
జ: మీ ఫ్లాట్‌కు సంబంధించి నైరుతిలో లిఫ్ట్ వున్నది. అందువల్లనే ఇలా జరుగుతోంది. దోష నివారణ చేయించుకోండి.
నాయుడు (నిజాంపట్నం)
ప్రశ్న: ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు. అలాగే చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక పోతున్నాం. ఇల్లు కట్టిన దగ్గర నుండి మాకు ఈ విధంగా అవుతున్నది.
జ: మీ ఇంటికి సంబంధించి నైరుతిలో గొయ్యి ఉన్నది. అందువల్లనే ఇలా అవుతున్నది. ముందుగా నైరుతిలోగల గొయ్యిని పూడ్చివేయండి. తర్వాత నైరుతి దోష నివారణ చేసుకోండి. సమస్యలు తీరుతాయి.
గోపి (వింజమూరు)
ప్రశ్న: ఇటీవల ఒక పాత ఇంటిని కొనుగోలు చేశాము. ఆ ఇంటిని తీసివేసి కొత్త ఇంటిని నిర్మిద్దామని అనుకున్నప్పటి నుండి ఏదో ఒక ఆటంకం వస్తున్నది. పాత ఇంటిని కూల్చడానికి ఏవైనా పద్ధతులు ఉంటాయా? అలాగే పాత ఇంటి దోషాలు కొత్త ఇంటి మీద ప్రభావం చూపకుండా ఉండాలి అంటే ఏం చేయాలి?
జ: పాత ఇంటికి సంబంధించి కొన్ని దోషాలు సాధారణంగా ఉంటాయి. ఒక పాత ఇంటిని అమ్ముతున్నారంటే అందులో వున్న వాళ్లు చాలా బాధలు పడిన తర్వాత మాత్రమే ఆ ఇంటిని అమ్మడం జరుగుతుంది. మీరు ఆ ఇంటిని కూల్చడానికి ముందు వాస్తుపరంగా కొన్ని పరిష్కారాలు చేయవలసి ఉంటుంది. అలాగే పాత ఇంటి చెడు ప్రభావం కొత్త ఇంటి మీద చూపకుండా ఉండటానికి కూడా స్థలదోష నివారణ చేయవలసి ఉంటుంది. *

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28