S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా ఉందీ వారం? (అక్టోబర్ 8 నుండి 14 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
పరిశీలనాత్మక ధోరణితో ఈ వారం గడుస్తుంది. విజయానికి తోడ్పాటు ఉంది. ఉపశమనం, ప్రశాంతత ఉంటాయి. ఆర్థిక బలం వున్నా ఖర్చును నియంత్రించడం మేలు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. విలువైన వస్తువులు ఖరీదు చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం కల్గించుకోకండి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దైవశక్తి మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటుంది. తలవని తలంపుగా పెట్టుబడులు లాభిస్తాయి. నిరుద్యోగులకు అవకాశాలు మెండు. ఒత్తిడి తగ్గుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకుని లాభపడతారు. తొందరపాటు పనికిరాదు. ఎదుటి వారిని కనిపెట్టి ఉండండి. పొదుపు చేసిన పైకం మంచి కార్యాలకు వినియోగిస్తారు. శుభకార్యాలకు ప్రయత్నాలు చేస్తారు. దంపతులు అన్ని విషయాల్లోనూ ఉత్సాహంతో ముందుకెళతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలు అపార శుభాలను అందిస్తాయి. ఒక వార్త మీకు ప్రతిష్టను తెచ్చి పెడుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అనవసర విషయాలలో జోక్యం తగ్గించుకోండి. మిత్రుల సాయం అందుతుంది. ఆచితూచి వ్యవహరించండి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

మనోబలం వెన్నంటి ఉంటుంది. మీ వాక్చాతుర్యంతో అన్నింటా ముందుకు దూసుకెళతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం తృప్తికరం. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు గతం కంటె మేలు. పెట్టుబడులు లాభిస్తాయి. స్ర్తిలకు ఉద్యోగావకాశాలు. విదేశీ ప్రయాణ యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శ్రమానుకూలం. పరిచయస్తులతో సంతోషాన్ని పంచుకోండి. ఆర్థిక మార్గాలు ఉంటాయి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

ఆర్థిక తృప్తి. విజయ అదృష్టాలు మీ సొంతం. కృషి సఫలీకృతమవుతుంది. అనుకున్నవి పూర్తి చేస్తారు. అభివృద్ధిని అడ్డుకునే వాళ్లు ఉంటారు గమనించండి. సంయమనం పాటించండి. మనసుతో ఆలోచించి నైపుణ్యతను ప్రదర్శించండి. చేపట్టే వృత్తి వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు ఫలప్రదం. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు లాభిస్తాయి. అన్నింటా ప్రశంసలు పొందుతారు. స్పెక్యులేషన్ మిశ్రమం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

చేసే కార్యాలు అందర్నీ ఆకట్టుకొంటాయి. ఉత్సాహంతో అన్ని కార్యాలు పూర్తి చేస్తారు. ఆదాయం కన్నా ఖర్చులు అధికమవుతాయి. పైకం సర్దుబాటు అవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఫలిస్తాయి. పొదుపు అదుపు తప్పకుండా చూడండి. కుటుంబానికి కొంత సమయం కేటాయించవలసి వస్తుంది. కొత్త వ్యవహారాలు శుభాలను పంచుతాయి. శుభ కార్య ప్రయత్నాలు కొనసాగిస్తారు. సమిష్టి వ్యవహారాలందు మెళకువ పాటించండి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

ఆర్థిక బలం. పాడి పంటలు, వ్యాపారాలు శ్రమానుకూలం. మీరు అనుకున్న విధంగా అభివృద్ధి ఉంటుంది. మిత్రుల సాయంతో పనులు పూర్తి చేస్తారు. సున్నితమైన అంశాల్లో నేర్పు మేలు చేస్తుంది. అదృష్టం వరిస్తుంది. ఎంచుకున్న రంగాలు లాభిస్తాయి. స్పెక్యులేషన్ లాభాలను తెచ్చిపెడుతుంది. బ్యాంకు వ్యవహారాలందు గోప్యత పాటించండి. శుభప్రదంగా ఈ వారం గడుస్తుంది.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

తులనాత్మక పరిశీలన, పర్యవేక్షణ మీకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడతాయి. ప్రత్యేక శ్రద్ధ లక్ష్య సాధనలకై యోగిస్తుంది. అభివృద్ధికై చేసే మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులు అన్నింటా సాయపడతారు. ఆర్థిక ప్రశాంతత. ఇతరుల మాట విన్నప్పటికీ, మీ ఆలోచనలకు అనుగుణంగా నడచుకోండి. ఉద్యోగ వృద్ధి, వ్యాపార లాభాలు, వృత్తియందు నైపుణ్యతలు మెరుగవుతాయి. అనుకోని ప్రయాణాలు. వాహన సౌకర్యం. మెట్లు ఎక్కాలి. దిగాలి. ఇక్కట్లు రాకుండా చూసుకోండి. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

కష్టే ఫలి ఈ వారం. అలజడితో వడివడిగా పనులు చేయకండి. సృజనాత్మకత ముఖ్యం. ధైర్యంగా ముందుకెళ్లండి. ఇతరుల నిర్ణయాలను మీరు అమలు చేయకండి. మీ శక్తియుక్తులు ఉపయోగించండి. ఆర్థిక ప్రగతి. మీ కార్యాలు పునః సమీక్షించుకోవడం మంచిది. పెట్టుబడులకై ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇబ్బందుల నుండి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. భవిష్యత్ ప్రణాళికలు సానుకూల పడతాయి. అధికారుల సాయం అందుతుంది. శుభప్రదం. ఆహ్వానాలు అందుతాయి. ఏకాగ్రత అన్నింటా మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

మానవతా విలువలకు పెద్దపీట వేయండి. ఓర్పు అన్నింటా యోగిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత మంచిది. సంఘంలో జరిగే కొన్ని సంఘటనలు మీ కీర్తిని ఇనుమడింపజేస్తాయి. నిరుత్సాహాన్ని వీడండి. పనులందు సృష్టత చూపండి. కలసి ఉంటే కలదు సుఖం అన్నట్లు ఈ వారం ఉంటుంది. కొత్త కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. స్ర్తిలు వ్యవహారాలందు నైపుణ్యత ప్రదర్శిస్తారు. ఎదుటి వారిని తక్కువగా అంచనా వేయకండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ఆర్థిక నైపుణ్యతను ప్రదర్శిస్తారు. అనుకోని ఘటనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేట్టు ఉంటాయి. సంతాన సౌఖ్యం.ఉద్యోగ ప్రయోజనాలు ఆలోచనలకు పదును పెట్టండి. గడ్డు సమస్యలున్నా తెలివితో పరిష్కరించుకొంటారు. నిబద్ధతతో వ్యవహరించాలి. కొన్ని కార్యాలు అనుకోకుండా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలందు శుభప్రదం. శ్రమానుకూలం.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

కష్టపడితేనే ఫలితం. మిత్రుల సలహాలు పాటించండి. నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి. మనసులోని మాటను స్పష్టంగా వెలిబుచ్చండి. నిరుత్సాహాన్ని దరికి రానీయకండి. కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. ముఖ్య వ్యవహారాలు ఈ వారం పూర్తవుతాయి. విలువైన వస్తువులు ఖరీదు చేస్తారు. వాహన సౌఖ్యం. మార్పులు ఉన్నాయి. స్పెక్యులేషన్ ఫలప్రదం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

వాయిదా మనస్తత్వాన్ని విడనాడండి. గాబరా పడకండి. మాటలందు నేర్పు ప్రదర్శించండి. అతి సర్వత్ర వర్జయేత్ అని గుర్తిస్తారు. చేపట్టే వృత్తి, వ్యాపార, ఉద్యోగ, సాంఘిక రంగాలు లాభిస్తాయి. మీ వర్తన ప్రవర్తనతో ముఖ్యులను ఆకట్టుకుంటారు. స్వంత వ్యవహారాలను పక్కన పెట్టండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. అవగాహనతో మెలగండి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855