S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆలోచన

మనసులో ఓ ఆలోచన రాగానే, దాన్ని సాగదీసి అనేక సమస్యలను, సంఘటనలను గుదికూర్చి సమాజానికి అందించాలంటే, తక్షణమే జేబులోనున్న ఓ చిన్న నోట్‌బుక్‌లో చిన్న మాటగా రాసుకుంటే అదే ఓ వ్యాసం రాయడానికో, కథ రాయడానికో మార్గదర్శకం అవుతుంది. గరికిపాటి నరసింహారావు గారు ఈ మాటే పదేపదే చెబుతూంటారు. ఇలా ఎన్నో ఆలోచనలు పేపర్లు, పుస్తకాలు చదువుకున్నప్పుడో, ఉపన్యాసాలు శ్రద్ధగా వింటున్నప్పుడో, బయట అనేక పనుల మీద తిరుగుతున్నప్పుడో తట్టిన మనో భావాలను అప్పటికప్పుడు కనీసం పొడి అక్షరాలలో రాసుకోకపోతే, ఇంట్లో తీరుబడిగా కూర్చుని నెమరు వేసుకుందామంటే గుర్తుకు రావు ఇలాంటి చిన్న మాటలు గ్రంథాలు రాయటానికి అంకురార్పణ చేస్తాయన్న వాస్తవాన్ని రచయితలలు చెబుతూంటారు. అమృతవర్షిణి అమృతమే ప్రతీవారం స్రవిస్తూ చదువరులకు ఆనందాన్నిస్తోంది.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
అవకాశం
ఎంతో శ్రమపడి నేర్చుకున్న విద్య అయినా, అప్పుడప్పుడు పొరపాట్లు రాక, చేయక తప్పదు. ఇటువంటివి మనకే తెలిసినప్పుడో, ఎవరయినా తెలియజేసినప్పుడో, నిరాశా నిస్పృహలకు లోనుకాకుండా ఎక్కడ లోపాలున్నాయో తెలుసుకుని సరిదిద్దుకుంటే ఎదురులేని మనిషిగా ఎంతకాలమయినా మనుగడ సాగించవచ్చు. పాట పాడడానికి పనికిరాడని అన్నవారే మరల అటువంటి పాటగాడు దొరకగలడా, అది ఆ బ్రహ్మకే అసంభవమని తేల్చేశారు మన మధుర అమర గాయకుడు ఘంటసాల గురించి మాట్లాడుతూ. ఆయన కూడా ఎన్నో లోపాలను ఎత్తిచూపినా వాటిని సరిదిద్దుకునే అవకాశంగా మలచుకున్నారే గాని నొచ్చుకోలేదు. ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని అబ్దుల్ కలాంగారు విద్యార్థులను ఉత్తేజపరిచేవారు.
-లక్ష్మీరామం (హైదరాబాద్)
విచిత్ర పరిస్థితి
ఎలెన్‌కి భర్త మర్నాడు బ్యాంక్‌లో చనిపోతాడని గట్టిగా అనిపించింది. అలాగే తను మర్నాడు చనిపోతాడని అలెక్స్ గట్టిగా నమ్మాడు. విచిత్రమైన పరిస్థితిలో ఇద్దరూ ఒకేసారి బ్యాంక్‌లో మరణించడం ఆశ్చర్యం కలిగించింది. క్లైర్‌వాయన్స్ మీద నమ్మకం లేనివారు కూడా నమ్మవలసిందే అనిపించింది. కలలు గుర్తుండవు. కాని వేకువ జామున వచ్చిన కలలు జరుగుతాయని భారతీయుల నమ్మకం. కాని అలా చెప్పడానికి సాక్ష్యం లేదు. కలలు కొన్ని రిపీట్ అవుతూ చాలామందికి చాలాకాలం జ్ఞాపకం ఉండడం కూడా జరుగుతుంది. అదో విచిత్రం. కలలు గురించి గోపాలంగారు ఆసక్తికరంగా చెప్పారు. మాకు కూడా కలల్లో నీట మునిగిపోతున్న భావన రిపీట్ అవుతూ చాలాకాలం భయపెట్టింది.
-ఆర్.మరుదకాశి (కరప)
చెలిమె
చెలిమెలో నీరు ఊరుతుంది. వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటుంది. వాడకపోతే చెలిమె ఎండిపోతుంది. అలాగే రచయిత కూడా తన ఆలోచనల్ని రాస్తూ ఉంటే కొత్తకొత్త ఆలోచనలు వస్తూ వుంటాయి. ఆలోచనల్ని ఎప్పటికప్పుడు రాయకుండా ఉంటే తలలో ఆలోచనలు ఎండిపోతాయి అన్న నగ్నసత్యాన్ని ఓ చిన్న మాటలో చెప్పడం బాగుంది. అందాల తార మెర్లిన్ మన్రోని మెప్పించిన అతి చిన్న శునకాలు, ధృవాల్ని చుట్టివచ్చే పక్షి విశేషాలు మమ్మల్ని రంజింపజేశాయి. లోకం పోకడలో అపర కర్ణుని కథ మా మనసు దోచింది. ‘విజ్ఞానం’లో ప్లూటో గ్రహానికి ఆ పేరు పెట్టిన పదకొండేళ్ల బాలిక అదృష్టవంతురాలు. ప్లూటో అనగానే ఆ అమ్మాయి జ్ఞాపకం వస్తుంది అందరికీ.
-డి.అభిలాష (సాంబమూర్తినగర్)
నిజమే
అడవి సింహం, జూ సింహం జీవితాల్లో తేడాను వివరించి మనం అడవి సింహం లాగా జీవించాలన్న ‘సండే గీత’ ఆలోచింపజేసింది. నిజమే. అడవి సింహం పట్ల గౌరవం, భయం, భక్తి ఉంటాయి. జూ సింహం అంటే చిన్న చూపే. అత్యంత పొడగరిగా గిన్నిస్ రికార్డు సాధించిన మహిళ విశేషాలు ఆకట్టుకున్నాయి. ప్రపంచ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పోటీలో సెలెక్ట్ అయిన ఫొటోలు అద్భుతంగా ఉన్నాయి. శ్రీనివాసాచారి హైకూలు చాలా నచ్చాయి. వాటిలో ‘అక్షరాలతో కలం పోటీ పొలాలతో హలం పోటీ’ అన్నది బహు బాగు. రానిది రాదు, పోనిది పోదు అంటూ అమృతవర్షిణిలో రామకృష్ణయ్య పంతులు, పినాకపాణి గార్ల గురించి చెప్పిన విశేషాలు మమ్మల్ని ఎంతగానో అలరించాయి.
-కె.సుభాష్ (శ్రీనగర్)
ధన్యజీవి
తనకేమీ కాని వారి కోసం తన యావదాస్తిని తృణప్రాయంగా దానం చేసిన మానవతా మూర్తి పాలం కళ్యాణ సుందరం ధన్యజీవి. ఆదర్శప్రాయుడు. నిజంగా ఆయన కలియుగ దానకర్ణుడే. ట్రైనింగ్ తర్వాత రైల్వే ఉన్నతాధికారిగా ఉద్యోగంలో చేరబోయే కుమారునితో జనరల్ బోగీలో ప్రయాణం చేసి ఆ కుమారుడు ఎవరి కోసం ఎలా పని చేయాలో ఎవరి సమస్యలు ముందుగా తీర్చాలో సున్నితంగా చెప్పిన కథ ‘ప్రయాణం’ బాగుంది. అయితే సాధారణ బోగీ ప్రయాణీకుల సౌకర్యాలు మెరుగుపరచాలని ఒకరిద్దరు అధికారులు ప్రయత్నిస్తే సరిపోదు. మొత్తం వ్యవస్థ బాగుపడాలి. బాగుపరచడం సంగతలా ఉంచి ఆ ఒకరిద్దరు కూడా మందలో చేరిపోయే అవకాశాలే ఎక్కువ.
-పి.ఎస్.లక్ష్మి (బృందావనం)
విభజన
అనాదిగా ఇవి మగ పనులు, ఇవి ఆడ పనులు అంటూ పని విభజన ఉండేది. విద్య, వైద్యం, రాజకీయాల్లో క్రమక్రమంగా స్ర్తిల సంఖ్య పెరిగి వారు కూడా మగవారితో సాటిగా రాణిస్తుండగా, వాహన చోదనం, రక్షణ, పోలీసు శాఖలు ఇంతవరకు మగవారికే కేటాయించబడేవి. ఇప్పుడిప్పుడే ఈ రంగాల్లో ప్రవేశిస్తూ మహిళలు కూడా రాణించటం ముదావహం. ‘వీరనారికి వందనం’ శీర్షికన కవర్‌స్టోరీలో మిలిటరీలో స్ర్తిలు సాధిస్తున్న ప్రగతిని చక్కగా వివరించారు. ఆకర్షణీయమైన రంగుల్లో కనిపించే ఆఫ్రికా కోతుల విశేషాలు అలరించాయి. కన్నీటి కసి కవిత బాగుంది.
-బి.చంద్రిక (రాజేంద్రనగర్)