S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భళారే

ఎన్నో ఏళ్ల క్రితం మనం చదువుకున్న కాలేజీ, మొదటిసారి ఉద్యోగంలో చేరిన ఊరు, ఇలాంటి వాటిని దర్శించినప్పుడు అంతా నిన్న మొన్న జరిగినట్లు అనిపించడం సహజం. తెలియకుండానే కాలం గడిచిపోతుంది. కాని మిగిలిన కాలం అయినా సద్వినియోగం చేసుకోవాలని చెప్పిన ‘ఓ చిన్నమాట’ ఎంతో బావుంది. ‘చిత్రం భళారే విచిత్రం’ కవిత బాగుంది. ముఖ్యంగా ‘అలెగ్జాండర్ దుర్మరణం, హిట్లర్ నికృష్టపు చావు గాని మనిషికి జ్ఞానోదయం కలిగించకపోవడం చిత్రం.. భళారే విచిత్రం’ అనడం బావుంది. పోతన పుట్టినది పద్యాల కోసం.. త్యాగయ్య పుట్టినది గేయాల కోసం’ అంటూ త్యాగయ్య యక్ష గానాల వివరణ భళి భళారే!
-ఎస్.కృష్ణ (కొండయ్యపాలెం)
పథకం
దొంగ చేసిన పొరపాటు వల్ల నైట్‌వాచ్‌మేన్ పేల్చిన తుపాకి గుండు అతని తలలోంచి దూసుకుపోవడం, పగపట్టిన దొంగ సోదరులు ముగ్గురూ నైట్‌వాచ్‌మేన్ చేతనే అతని మనవడ్ని చంపించాలని పథకం వేయడం, చీకటిలో నైట్‌వాచ్‌మేన్ పేల్చిన తుపాకి గుళ్లు సూటిగా దొంగ సోదరులనే చంపడం, వారి పథకం విఫలం అవడం క్రైం కథలో ఉత్కంఠభరితంగా వివరించడం బాగుంది. కాఫీ, టీలు ఆకలిని చంపుతాయి గాని ఆకలి తీర్చవు. అలాగే టిఫిన్లు కూడా. రోజూ తినే టిఫిన్ల వల్ల జీర్ణ వ్యవస్థ పాడవుతుందని డైటీషియన్ పూర్ణచంద్ గారు చెప్పిన విషయాలు వింటూంటే ఆశ్చర్యం వేసింది. టిఫిన్ల బదులు పెరుగన్నం తినడమే మేలని తెలిసింది.
-పి.ఎస్.లక్ష్మి (బృందావనం)
నిండుతనం
‘అక్షరాలోచనలు’ శీర్షికన అందిస్తున్న కవితలు మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. ‘నానీలు’ కవిత బాగుంది. గునపాలతో గోతులు త్రవ్వినా ఎదురుతిరగని తల్లి భూమాత... ఈ మాటలు కవిత్వానికి నిండుతనాన్నిచ్చాయి. ‘ఒక నిర్ణయం’ కథలో మాధవ్ మహేశ్వరి ఇరువురూ నిర్ణయం మెచ్చతగ్గది. మాధవ్‌కు ప్రభుత్వోద్యోగం సాధించడం ఒక కల. అదే అతని లక్ష్యం. అతనికి కాబోయే భార్యగా చేయూత నందించడం నా ధర్మం అంటూ మహేశ్వరి నిర్ణయించుకోవడం.. యువత ఇలా కనుక ఉంటే.. సమాజం.. కుటుంబ వ్యవస్థ ఎంతో బావుంటుంది.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)
ఎవరో చెప్పినట్టు..
మన జీవితం ఎవరో చెప్పినట్టు, మరెవరో డిక్టేవ్ చేసినట్టు ఉండరాదు. మన జీవిత పేజీలు మనమే రాసుకోవాలి. మన కలలు మనమే కనాలి - అని చెప్పిన ‘సండే గీత’ గొప్పగా ఉంది. ఎగిరే వస్తువుల్ని స్వయంగా తయారుచేసుకొని ప్రయోగాత్మకంగా నిరూపించే ఫ్లయింగ్ ఫన్ ఫెస్టివల్, ఆసక్తికరంగా ఉంది. పాశ్చాత్య మగువలు గిరిజన సంప్రదాయ ముస్తాబు చేసుకొని వేడుకల్లో పాల్గొనడం బావుంది. స్వాన్‌లేక్ వద్ద తెల్లగా అందంగా మెరిసిపోతూ బాతులను పోలిన దుస్తులు ధరించి నృత్యం చేసే అమ్మాయిల ఐడియా బాగుంది. రఫీ నానీలు బాగున్నాయి. ముఖ్యంగా ‘అమెరికాలో తెలుగు వెలుగు ఆంధ్రాలో చీకటిలో తెలుగు’ నానీ భేష్.
-జె.్ధర్మతేజ (గొడారిగుంట)
ఊహాతీతం
క్రైం కథ ‘కిరాయి హంతకుడు’ చాలా సస్పెన్స్‌తో సాగి ఊహాతీతంగా ముగిసింది. నిజానికిది ‘టిట్ ఫర్ టాట్’ కథ. ఎవరూ ఊహించలేని ముగింపు. అందుకే అలరించింది. స్వార్థం, అనుమానం కలిస్తే అంతే మరి! మెదడులోని ఒక కేంద్రకం ఇచ్ఛ, రుచి, ఆకలి, ఆహార సంతృప్తి లాంటి వాటిని నియంత్రిస్తుందనీ, మనసును దిటవు చేసుకొని వాటిని మన అధీనంలోనికి తెచ్చుకోవాలన్న నూతన విషయం మాకు తెలిపిందీ వ్యాసం. అలా నియంత్రించుకోలేకపోతే మనం రుచికి బానిసలమై అనారోగ్యం కొని తెచ్చుకుంటామన్నది నిజమే. జూలీ-2లో రాయ్ లక్ష్మి అన్ని హద్దుల్నీ మీరిందని చెప్తూ ఆమె సాదా ఫొటో వేశారు గాని హద్దులు మీరిన ఫొటో వేస్తే మనోరంజకంగా ఉండేది కదా!
-ఎస్.ఎం. (పాలెం)
భక్తి-మాధుర్యం
త్యాగరాజు, పోతన లాంటి కవిరాజులు రాజభోగాలను అనుభవించక పోయినా, తమ కీర్తనలు, కవితల రూపంలో ఆ భగవంతుడినే భోగింపజేసిన ఈ భూలోక దైవ స్వరూపులు. ఈ భూమి రుణం తీర్చుకున్న భాగ్యవంతులు. వీరు భౌతికంగా మన మధ్య లేకపోయినా, మనం పాడుకునే కీర్తనలలో, పద్యాలలో వారు నిత్యం జీవిస్తూనే ఉన్నారు. పలికెడిది భాగవతమట పలికించెడు వాడు రామభద్రుండని కృతజ్ఞతలు కురిపించిన పోతనామాత్యుడు, ఆ రాముడినే నమ్ముకుని తిని తినక అహర్నిశలు ఆయన స్మరణలోనే తరించిన గాయత్రోపాసకుడు మన వాగ్గేయకారుడు త్యాగయ్య. వీరిద్దరు రామభక్తులు కావడం విశేషం.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
పిట్‌మన్
ఓ ముప్పై ఏళ్ల క్రితం కంప్యూటర్ టెక్నాలజీ అంతగా విస్తరించనపుడు స్టెనోగ్రఫీ నేర్చిన వారికి ఉద్యోగాలు తప్పనిసరిగా వచ్చేవి. రెండు రకాల షార్ట్‌హ్యాండ్ విద్యలున్నా అందులో పిట్‌మన్ సిస్టమ్‌ను అత్యధిక విద్యార్థులు నేర్చుకునేవారు. న్యూస్ పేపర్లను చదివించుకుని, రేడియోలో వచ్చే ఆంగ్ల వార్తలను శ్రద్ధగా, నిశ్శబ్దంగా వింటూ షార్ట్‌హ్యాండ్‌ను ప్రాక్టీస్ చేసేవారు. ఈ గీతల విద్య నేర్చిన వారికి ఆంగ్ల భాష మీద బలమైన పట్టును పొందగలరని అనేవారు. ఇప్పుడీ ప్రశస్తమైన విద్య కంప్యూటర్ల రాకతో అంతరించిపోయింది. ఇంకా దీన్ని నేర్చుకునే వారుంటే ఆశ్చర్యమే. కోర్టుల్లో, కార్యాలయాల్లో ఆఫీసర్లు డిక్టేట్ చేయగా స్టెనోలు టైప్‌రైటర్ మీద టైప్ చేసేవారు. కాలం మారింది. పాత విద్యలు కనుమరుగవుతున్నాయి. ఇది సండే గీత సందేశం. ఇక ఓ చిన్న మాట చక్కని మాటను చెప్పింది. దశాబ్దాలు గడపిన తరువాత అప్పుడే ఇనే్నళ్లు చూస్తూండగానే ఎలా గడిచిపోయాయా అన్న ఆశ్చర్యం అందరికీ కలిగే వాస్తవం. వయసైన వారు గత స్మృతులతో మిగిలిన కాలాన్ని గడుపుతుండటం చూస్తున్నాం.
-ఎన్.లక్ష్మీరామం (సికిందరాబాద్)