S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా ఉందీ వారం? (అక్టోబర్ 15 నుండి 21 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
సమయానికి పైకం అందుతుంది. ఖర్చులు ఉన్నప్పటికీ సర్దుబాటు అవుతాయి. ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. శ్రమానుకూల ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంప్రదింపులు, సలహాలు తీసుకోండి. గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన పరిచయాలు, నిర్ణయాలు అనుకూలం. ఆత్మబలం వృద్ధి. చేసే వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాదులు పూర్తవుతాయి. పెట్టుబడులు ఆలోచింపచేస్తాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం. శుభకార్యాలు జయప్రదం.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

అర్థ వృద్ధి. ఉత్సాహంతో కూడిన నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆలస్యంగానైనా కొన్ని పనులు పూర్తవుతాయి. అన్నింటా విజయం తథ్యం. ధనం అనుకోకుండా అందే అవకాశం ఉంది. చిరాకులూ పరాకలూ వద్దు. నైపుణ్యంతో కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు. సకాల భోజనం మేలు. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి. స్ర్తిలు చేసే లావాదేవీలలో వృద్ధి కానవస్తుంది. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. అనుకోని పరిచయాలు లాభదాయకం. ఎంచుకున్న రంగాలు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయ రంగంలో సాయమందుతుంది. ఆందోళన పడకండి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

విజయప్రాప్తి. సంయమనం పాటించండి. అన్నింటా అప్రమత్తంగా ఉండండి. చేసే పనులలో విశ్వాసముంచండి. ఫలితం దానంతట అదే వస్తుంది. నిరుత్సాహ పడకండి. ఎంచుకున్న వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహారాలు గతం కంటె మేలు. ఆధ్యాత్మిక మార్గం ప్రశాంతత నిస్తుంది. శత్రుత్వం మిత్రుత్వంగా మారుతుంది. స్పెక్యులేషన్ స్వల్ప లబ్ధి. నిరుద్యోగులకు శ్రమానుకూలం. విలువైనవి ఖరీదు చేస్తారు. లాభనష్టాలను సరిచూసుకోవలసి వస్తుంది. తొందరపాటు వద్దు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి కాన వస్తుంది. చేసే పనులలో అభివృద్ధి. మీ కోసం ఎదురుచూసే వారుంటారు. అధికంగా ఆలోచించకండి. ప్రయాణాలందు మెళకువలు పాటించాలి. విద్య, వైద్య, వ్యాపార, ఉద్యోగ, సాంకేతిక రంగాలు ఫలవంతం. పంతాలకు పట్టింపులకు వెళ్లకండి. కొన్నింటిలో ఇది పరీక్షా కాలం. అవకాశాలను సావకాశంగా మలచుకోండి. ఒత్తిడి అధికంగా ఉంటుంది. జాగ్రత్త వహించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

ఆత్మబలంతో పనులు పూర్తి చేస్తారు. విజయం పలు రకాలుగా ప్రాప్తిస్తుంది. సామాజిక కార్యాలు గుర్తింపును తెచ్చిపెడతాయి. శుభవార్తలు వింటారు. సంతోషాలను పంచుకుంటారు. ఇష్టాలను పెంచుకుంటారు. అన్నింటా అవగాహన మేలు. ఇతరుల విషయాలు మీకు తంటాలు తెచ్చిపెట్టేట్లున్నాయి. స్పెక్యులేషన్ ఫలప్రదం. అనుకున్నవి సగం పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఒక వార్త ఇబ్బంది పెడుతుంది. విలువైన వాటిపట్ల జాగ్రత్త వహించండి. సమిష్టి కార్య విజయాలు.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

అన్నింటా జయం. సంకల్ప సిద్ధి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహారాలందు నైపుణ్యంతో ముందుకు అడుగు వేస్తారు. స్వగతాలు వద్దు. గతాన్ని పరిశీలించుకుని ముందుకు వెళ్లండి. వాహన ప్రయాణాలందు మెళకువలు పాటించాలి. గందరగోళ వాతావరణం లేకుండా చూసుకోవాలి. అన్నింటా స్వీయ పరిశీలన మంచిది. స్ర్తిల వ్యవహారాలు వారే చూసుకోవడం మంచిది. అనవసర సలహాలు వద్దు.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

జయ విజయాలు మీకు అనుకూలం. కావలసిన ధనం సమయానికి అందుతుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. దైవ బలంతో సంకల్ప సిద్ధి. పరామర్శలకు వెళ్లవలసి వస్తుంది. విలువైనవి అందుకుంటారు. ఉద్యోగాలందు వృద్ధి. వ్యాపార, వృత్తి, నైపుణ్యాలకు అవకాశం. స్పెక్యులేషన్ ఒడిదుడుకులు లేకుండా ప్రయత్నించండి. శ్రమానుకూలంగా ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. బయట విందులు తగ్గించుకోండి. ముఖ్యుల సాయం అందుకుంటారు. శుభాలను అందుకుంటారు.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

మీరు అనుకున్నట్లు చేయటానికే ఓటు వేయండి. నిర్ణయాత్మకంగా అన్ని పనులు చేయగలుగుతారు. ఒకేసారి రెండు మూడు కార్యాల జోలికి వెళ్లకండి. స్ర్తిల వ్యవహారాలు, కుటుంబ సన్యుల విషయాలు తలనొప్పి తెచ్చేట్లున్నాయి. అవివేకం ప్రదర్శించకండి. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. ప్రయాణాలందు ఎక్కువ పైకంతో ఇబ్బందులు లేకుండా చూసుకోండి. అవసరమైనవి అందుకుంటారు. వ్యవసాయ రంగంలో సాయమందుతుంది. ఆందోళన పడకండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

ఇబ్బందులు తొలగుతాయి. మంచి ఆర్థిక కార్యాలు మీచే నిర్వహించబడతాయి. పైకం వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనవసర విషయాలలో తలదూర్చకండి. సున్నితత్వం, కచ్చితత్వం, లౌక్యం అన్నింటా మీకు యోగపడుతుంది. స్పెక్యులేషన్ లాభప్రదం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. అన్నింటా గోప్యత పాటించండి. అన్యోన్యత కుటుంబ సభ్యులతో మేలు. దైవ దర్శనాలున్నాయి. లాభాలు అందుకుంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

విజయావకాశాలు కలసి వస్తాయి. మీ పద్ధతి, పనులందు నైపుణ్యం అందర్నీ ఆకర్షిస్తాయి. ప్రోత్సాహాకాలు ఉంటాయి. ఉత్సాహం ఇనుమడిస్తుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగాలందు అనుకూల మార్పులు. వ్యాపార రంగంలో అపార పోటీ, వృత్తి విషయాలందు నిరుత్సాహం లేకుండా చూసుకోండి. హితులు సాయపడతారు. ఎదురుదెబ్బలు తగలకుండా అన్నింటా జాగ్రత్త వహించండి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

సరైన నిర్ణయాలు ధైర్యంతో తీసుకోండి. ధనప్రాప్తి వల్ల ఈ వారం అర్థవంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, విద్య, వైద్య, సాంకేతిక రంగాలందు అభివృద్ధి. ఆశయాలను, ఆకాంక్షలను సున్నితంగా వ్యక్తీకరించండి. సమాజ కార్యాల్లో ప్రశంసలు అందుకుంటారు. సలహాలను పాటించండి. ఆరోగ్యం కాపాడుకోవాలి. పనులు నత్తనడకన వున్నప్పటికీ పూర్తి చేస్తారు. మీదైన పద్ధతుల్లో విలువైనవి అందుకుంటారు.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్నది ఆలస్యం కాకుండా చేయటం అవశ్యం. విందులు వినోదాలందు మీ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. ఆలోచనలకు ఎదురొడ్డి ప్రగతి పథంలో దూసుకువెళతారు. మీ వృత్తి, వ్యాపార, వైద్య, విద్యా రంగాలందు మీ ప్రమేయం ప్రమోదభరితంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకోని శుభాలున్నాయి. ఓ వార్త సంతోషాన్ని కలిగిస్తుంది.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855