S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తపాలా సేవలు

ఒకప్పుడు పల్లె - పట్నం అంతటా పోస్ట్ఫాస్‌తో అనుబంధం ఉండేది. ఒకరి నుండి మరొకరు క్షేమ సమాచారాలను తెలుసుకోవడానికీ, వివిధ ఉపయోగాలకు పోస్టుకార్డులు, ఇన్‌లాండ్ కవర్లు, ఎన్‌వలప్ కవర్లు ఉండేవి. మనియార్డర్ వచ్చిందంటే ఎక్కడలేని ఆనందం. టెలిగ్రాం వచ్చిందంటే టెన్షన్. నేటి సెల్‌ఫోన్లు తదితరాల మూలంగా మనిషికీ పోస్ట్ఫాసుకీ అనుబంధం తగ్గిపోయింది. అక్టోబర్ 9న పోస్టల్ డే సందర్భంగా పోస్టల్ డే జరుపుకోవడం వెనుక నేపథ్యం, పూర్వం నుంచీ నేటి వరకూ తపాలా శాఖ వారు మనకు చేస్తున్న సేవలను, ప్రపంచంలోనూ, మన దేశంలోనూ తపాలా శాఖ విశేషాలను ఎన్నింటినో తెలుసుకున్నాం. ఆపరేషన్ యూరో పేరిట తపాలా శాఖలో ప్రవేశపెట్టిన ఆధునిక సేవలను విన్నాం. కశ్మీర్‌లోని దాల్ సరస్సులో హౌస్‌బోట్‌లో తపాలా కార్యాలయం, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎతె్తైన ప్రాంతంలో ఉన్న పోస్ట్ఫాసు మమ్మల్ని ఆశ్చర్యపరిచాయి.
-సరికొండ శ్రీనివాసరాజు (వనస్థలిపురం)
ఉత్కంఠ
క్రైం కథ ‘పసికందు హత్య’ ఉత్కంఠభరితంగా సాగింది. క్లూస్ లేకపోయినా అక్కడి పోలీసులు రహస్యాన్ని ఛేదించడం మెచ్చదగింది. దుఃఖం నిరాశల్లో ఉన్న తల్లి కూతురు ఏడుపుని సహించలేక చంపేయడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అనిపించింది. నాయకుడంటే సృజనశీలి. సృష్టికర్త. విశ్వాస ప్రతీక. అతడు అనుచరుల అంతర్వాణి వినగలగాలి అని చక్కగా వివరించారు వాసిలి గారు. చిన్న పనికే అలసిపోవడం అనే లక్షణం నుంచి బయటపడటానికి ఉసిరి పచ్చడి బాగా పని చేస్తుందని తెలిసి ఆశ్చర్యపోయాం. డా.పూర్ణచంద్ గారు ఇస్తున్న సలహాలు ఉపయుక్తంగా ఉంటున్నాయి.
-సదాప్రసాద్ (గొడారిగుంట)
గమ్యం
మనిషి తిండి యావ నుంచి గమ్యం లేని పథికుని నడక వరకు అనేక విషయాలు అలవోకగా ఆసక్తికరంగా గుదిగుచ్చారు గోపాలంగారు ‘లోకాభిరామమ్’లో. యుద్ధానికి కారణం అయిన జర్మనీకి చెందిన సైనికుడు గాయపడి తన గదిలో పడి ఉన్నాడని అతడిని చంపడానికి రివాల్వర్ తీసుకొచ్చిన రూత్‌కి సైనికుడు కనిపించలేదు గాని అతని స్వరం వినిపించింది. దయచేసి నా భార్యకు నేనెక్కడున్నానో చెప్తూ ఉత్తరం రాయమని అడిగిందా స్వరం. రూత్ ఉత్తరం రాసి పోస్ట్ చేసి వచ్చి సైనికుని రివాల్వర్‌తో కాల్చి చంపింది. కాని శవం కనిపించక పోవడంతో ఆమె మాటలెవరూ నమ్మలేదు. అయితే చనిపోయిన వ్యక్తి అనే్నళ్ల తర్వాత ఒకరికి సజీవంగా కనిపించడం నమ్మలేని నిజమే.
-పి.చంపక్ (మాధవనగర్)
సహజంగా ఉంది
‘వాయస న్యాయం’ కథ సహజంగా ఉంది. ఇంట్లో దుర్మార్గంగా ఉంటూ బయట దయగల తల్లి అన్న ఇమేజ్ కోసం నటించే సుందరమ్మలుంటారు. దశదిన కర్మనాడు శ్రాద్ధ భోజనం తృప్తిగా తిని తప్పుడు సంకేతమిచ్చినందుకు కాకుల్ని నిందించనేల? రాఘవయ్య ఎందుకు చనిపోయాడో తెలిసిన గ్రామ పెద్ద, ‘అతడూ’ నోరు మూసుకుని చోద్యం చూస్తూ ఊరుకోవడం న్యాయమా? వృద్ధాప్య నైరాశ్యాన్ని ఒంటరితనాన్ని అధిగమించడానికి వృద్ధులు డిజిటల్ భాష నేర్చుకోవడం మంచిదని చెప్పడం బాగుంది. వృద్ధులు డిజిటల్ భాష నేర్చుకోవడం అవసరమే. యువకులు వారికా భాష నేర్పాలి.
-సి.మైథిలి (సర్పవరం)
స్ఫూర్తిదాయకం
ఏవేవో కారణాల వల్ల చేద్దామనుకున్న పనులు చేయలేక పోతాం. అయితే ఏదైనా అనుకుంటే వెంటనే ప్రారంభించాలి. పొరపాట్లు, అవాంతరాలూ వస్తే మళ్లీమళ్లీ ప్రారంభించాలి అన్న ‘సండే గీత’ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. పదహారు అడుగుల పొడవుండి భయంకరమైన మొసళ్ల మధ్య పారదర్శకమైన ప్లాస్టిక్ గదిలో సంచరించడం అద్భుతమైన ప్రయోగం. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ నిర్వహించిన నేచర్ ఫొటోల పోటీలో పాల్గొన్న స్నో మంకీ ఫొటో భలేగా ఉంది. ‘అక్షరాలోచనలు’లో నానీలు మాకు బాగా నచ్చాయి. నీతిగల ప్రభుత్వాలు కావాలంటే నీతిగల ప్రజలు కావాలనడం భేష్!
-కె.గునే్నశ్ (కొవ్వాడ)
అదృష్టవంతులం
మనం మనుకున్న వాటి గురించి ఆలోచించం. లేని వాటి గురించి చింతిస్తాం. అయితే కాళ్లు గాని చేతులు గాని లేని వాళ్లని చూసినప్పుడు మనం ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంది అని చెప్పిన ‘ఓ చిన్న మాట’ సమంజసంగా ఉంది. ఇతరుల కష్టములు ఎవ్వడెరుగునో అతడే వైష్ణవుడు అంటూ అమృతవర్షిణిలో వివరించిన ఓలేటి వెంకటేశ్వర్లు గురించి చెప్పిన విషయాలు ఆకట్టుకున్నాయి. మీకు తెలుసా-లో వెయ్యి పదాలు పలికే చిలుకలు, నీలికళ్ల కప్పల గురించిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
-ఆర్.శాంతిచంద్రిక (సామర్లకోట)
సమర్థత
కవర్‌స్టోరీలో భారతీయ తపాలా శాఖ గురించి ఘనంగా చెప్పారు. నిజమే. అవినీతి లేని సమర్థ నిర్వహణగల ఏకైక సంస్థగా పేరు పొందింది. అయితే ఇప్పుడు దానిలోనూ అవినీతి, అలసత్వం ప్రవేశించడం బాధాకరం. డబ్బాలో వేసిన ఉత్తరం ఎప్పుడు తీస్తారో, ఎప్పుడు బట్వాడా చేస్తారో తెలియని పరిస్థితి. పోస్ట్‌లో పంపిన మేగజైన్స్ మిస్ అవుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని ముఖేశ్ థాపా ఒకే ఒక్క సన్నని వెంట్రుకని రంగులలో ముంచి దానినే కుంచెగా చేసుకొని అద్భుతమైన వర్ణ చిత్రాలు సృష్టించడం నిజంగా అద్భుతం.
-పి.శాండిల్య (కాకినాడ)