S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా ఉందీ వారం? ( నవంబర్ 5 నుండి 11 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక ఉన్నత స్థితి. కార్యసిద్ధి. అన్నింటా జయం. అనుకున్న వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు గతంలాగ వుండవు. అనుకోని బహుమతులు అందుకుంటారు. కోరుకున్నవి ఆలస్యంగానైనా అందుకుంటారు. కుటుంబం కొరకు కాస్త సమయాన్ని తప్పక కేటాయించాల్సి ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మేలు. అనుకోకుండా లాభాలుంటాయి. వ్యవసాయ రంగం వారు, రియల్ ఎస్టేట్ అనుకూలం. ఆధ్యాత్మిక మెళకువలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. పెట్టుబడులలో లాభాలు. లౌక్యం చూపండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
ధన లావాదేవీలు ఇంధనంగా మెరుగవుతాయి. ఎంచుకున్నవి చేతికందుతాయి. మంచి మాటలు, సాధారణ నిర్ణయాలు యోగిస్తాయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. ఎదుటివారిని అంచనా వేయడం మరచిపోకండి. సన్నిహితులు, విద్య, వైద్య, వ్యవహార రంగాలు అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. విందులు వినోదాలలో పాల్గొంటారు. వివాహ శుభ వర్తమానాలు అందుతాయి. మీ సమస్యలు ఇతరుల సాయంతో పరిష్కరించుకుంటారు. విలువైన వాటి విషయంలో అప్రమత్తత అవసరం. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలాలను అందిస్తుంది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆరోగ్య విషయంలో అప్రమత్తత అవసరం. ఆర్థిక పరిస్థితి, వ్యయ వృద్ధి సమానం. దూరపు బంధువుల రాక మీకు ఆనందాన్నిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వ్యాపార, ఉద్యోగ రంగాలందు ఆశించిన మార్పులు, అనుకోని లాభాలుంటాయి. స్పెక్యులేషన్ స్వల్ప ఉన్నతి. ఆధ్యాత్మిక ఉన్నతులకు అవకాశాలు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. కొత్త పరిచయాలు ప్రయోజనకారి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. శుభాలు విస్తరిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

ఆర్థిక మార్గాలు శ్రమకు తగ్గ ఫలితాలనిస్తాయి. ఇతరులను అధికంగా విశ్వసించకండి. నిర్ణయాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయండి. సామాజిక కార్యాలందు చురుకుగా పాల్గొంటారు. వృత్తి, నైపుణ్య వృద్ధి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అన్నింటా శుభకరం. శ్రేయోదాయకం. ప్రయత్నాలు వేగవంతం చేయండి. అధికారుల అండదండలుంటాయి. న్యాయ వ్యవహారాలు ఒక కొలిక్కి రానున్నాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
సింహభాగం కలయికలతో కాలం గడుపుతారు. అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పటికీ పరిష్కరించుకొంటారు. ధన లభ్యత. అనుకోకుండా సంపద విస్తరణ ఉంది. నిరుద్యోగులకు, విద్యాధికులకు చక్కని అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. అవకాశాలను వినియోగించుకొని ప్రగతికై ప్రణాళికలు వేయండి. విలువైన సమాచారం అందుకుంటారు. స్ర్తిల సలహాలు వింటే వ్యాపారంలో అపార లాభాలనిస్తాయి. దుందుడుకు పనులు చేయకండి.
కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
ధన, సంతాన, ఉద్యోగ, కుటుంబ సమస్యలుంటే పరిష్కరిస్తారు. కొత్త ఆవిష్కరణలున్నాయి. ఆరోగ్యం జాగ్రత్త. బహుమతులు అందుకుంటారు. వ్యాపార విస్తరణ, ఉద్యోగ రంగంలో అనుకోని బాధ్యతలు అందుకుంటారు. విమర్శలు పట్టించుకోకండి. సద్వర్తనాలు సౌఖ్య, సంతోషాదులు ఉంటాయి. దూర ప్రయాణాలున్నాయి. స్పెక్యులేషన్ మిశ్రమం. మీ ప్రమేయం లేకుండానే కొన్ని మంచి పనులు జరుగుతాయి.
తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

సమయాన్ని వృధా చేయకండి. మిశ్రమ ఫలాలు శ్రమానుకూలంగా అందుతాయి. పెద్దలు, అధికారుల అండదండలు, ఆశీస్సులతో కార్యసిద్ధి. మనోధైర్యం అవసరం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు విస్తరిస్తాయి. పోటీ తత్వం అధికమవుతుంది. తరచూ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీ కదలికలను గమనించే వారు ఉన్నారని తెలుసుకోండి. కొత్త ప్రణాళికలు మెరుగవుతాయి. ప్రయత్నపూర్వకంగా ఇష్టపడే అన్ని రంగాల వారికి గుర్తింపు ఉంటుంది. వస్త్ర, వస్తు బహుమతులుంటాయి. దూరపు బంధువుల రాక.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థికాభివృద్ధికి అవకాశాలు మెరుగవుతాయి. ఇతరులకై అనవసరంగా శ్రమ పడకండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, కుటుంబ వ్యవహారాలందు ఆచితూచి మెలగాలి. అనారోగ్యంతో వున్నవారిని పరామర్శించవలసి వస్తుంది. లౌక్యం అన్నింటా మంచిది. ఎవరినీ తెలిసి ఇబ్బంది పెట్టకండి. రాజకీయాలకు అతీతంగా ఉంటూ సంతోషాన్ని అందుకోకండి. మాటకు విలువ పెరుగుతుంది. శుభాలున్నాయి. వాహన మార్పు. ఓర్పు నేర్పును ప్రదర్శించండి. కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
విజయాలు సంతృప్తి నిస్తాయి. అర్థ లాభాలు. కోర్టు వ్యవహారాలు నత్తనడకన ఉంటాయి. అన్నింటా స్వీయ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కలహాల జోలికి వెళ్లకండి. ప్రయాణాలు ఆలోచింపజేస్తాయి. మిత్రుల సాయం శ్రేయోదాయకం. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. వార్తలు సంతోషాన్నిస్తాయి. అవరోధాలు, విరోధాలను అధిగమించండి. పెట్టుబడులే రాబడికి మార్గం. బంధువుల రాకపోకలతో బిజీగా ఉంటారు. పొగడ్తలుంటాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ధనాదాయ వ్యయాలు, నిర్ణయాలు మారుతున్నాయి. అన్నింటా మీ గుర్తింపు అవసరమని తెలుసుకోండి. మిత్రులు, హితులతో ప్రయాణాలుంటాయి. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఒక పద్ధతిలో విస్తరిస్తాయి. అనవసర వ్యయాన్ని మదింపు చేసుకోండి. ఆస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. పెట్టుబడి రంగంలో మార్పులున్నాయి. దైవశక్తి, యుక్తి సంతోషాన్ని కలిగిస్తాయి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
పైకం సమయానుకూలంగా అందుతుంది. నిర్ణయాలలో తొందరపాటు పనికిరాదు. తెలియని పనులలో జోక్యం కూడదు. నైపుణ్య రంగాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. నూతన పరిచయాలు ఉపయోగకారి. వాహన సౌఖ్యం. కొన్ని మార్పులుంటాయి. ప్రియతముల స్పందన సంతోషాన్ని కలిగిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సమయానుకూలంగా వ్యవహరించండి. అనర్థాలు, నష్టాలకు దూరంగా ఉండండి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయ వృద్ధి. ఉన్నతి. ఓపికతో మెలగాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. అన్నింటా యోగదాయకం. భజనపరులను దూరంగా ఉంచండి. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు గతంలాగ ఉండవు. అనుకున్నట్లు కొన్ని పనులు విస్తరిస్తాయి. రాబడికి తగ్గట్టుగా పెట్టుబడులు పెట్టండి. పరిధులు దాటకండి. మంచిని పెంచండి. క్రోధాన్ని జయించండి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855