S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పవర్‌ఫుల్ లేడీ?

ప్రతి ఏటా ఫోర్బ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్స్ జాబితా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగానే 2017 జాబితా వెలువరించింది ఫోర్బ్స్. ఈ జాబితాలో టాప్-100లో చోటు దక్కించుకుంది పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా. అయితే తనని ప్రఖ్యాత ఫోర్బ్స్ ఆ రేంజ్‌లో అందలం ఎక్కించడానికి కారణం ఏమై వుంటుంది? ఇంకేం ఉంది.. హాలీవుడ్ సినిమాల్లో అరంగేట్రం.. ‘క్వాంటికో’ సిరీస్‌తో వచ్చిన ఐడెంటిటీ.. దాంతోపాటు దాన, సేవాగుణం.. పలు స్వచ్ఛంద కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకోవడం.. ఇవన్నీ పీసీని ఆ స్థాయిలో నిలబెట్టాయట. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ప్రపంచ శక్తివంతమైన మహిళల జాబితా 2017లో పీసి 97వ స్థానంలో నిలిచింది. పీసీకి అంతకంతకు ఆదరణ పెరిగిందని ఫోర్బ్స్ ఈ సందర్భంగా తెలిపింది. ఇక ఫోర్బ్స్ టాప్-100 జాబితాలో జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మర్కెల్ నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. బ్రిటన్ ప్రధాని థెరిసా మే, మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు మిలిందా గేట్స్ ఆ తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు. ఇండియా తరఫున చందా కొచ్చర్, రోషిణీ నడార్ మల్హోత్రా, కిరణ్ మజుందార్ షా, శోభనా భార్టియా టాప్-100 జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ జాబితాలో ఇతర బాలీవుడ్ నాయికలెవరూ లేకపోవడం విశేషం.

-సమీర్