S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తాజా చిత్రం ఏమిటో..?

అనుష్క తాజా చిత్రం ‘్భగమతి’ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. జి.అశోక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా అనుష్క కొత్త చిత్రానికి సంబంధించిన ప్రకటన మరేదీ ఇంతవరకు రాలేదు. అయితే ‘సాహు’ చిత్రంలో ఆమె నటించాల్సి వుండగా శ్రద్దాకపూర్ తెరపైకి వచ్చింది. దీంతో అనుష్క తాజా చిత్రం ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అంటే టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆమె గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతోందని వినిపిస్తున్న వార్త. ప్రస్తుతం గౌతమ్ మీనన్ హీరో విక్రమ్‌తో ‘్ధృవ నక్షత్రం’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత గౌతమ్ మీనన్ రూపొందించబోయే బైలింగ్వల్ చిత్రంలో అనుష్క ప్రాధాన్యత వున్న పాత్రలో నటించడానికి సిద్ధమవుతోందట. అనుష్కతోపాటు పలు భాషల్లో అగ్రనటీనటులు ఈ చిత్రంలో నటించడానికి వేదిక సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ఈచిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది. ఆది పినిశెట్టి, జయరామ్, ఉన్ని ముకుందన్, ఆశాశరత్ తదితరులు నటించిన ‘్భగమతి’ చిత్రానికి సంబంధించిన పస్ట్‌లుక్ వచ్చేనెలలో విడుదల కానుంది. వచ్చే సంవత్సరంలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.