S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రగ్బీ కూడా మనదే (లోకం పోకడ)

క్రికెట్ ప్రపంచ ప్రఖ్యాత క్రీడ. ఇది తొలుత ఇంగ్లండ్‌లో పుట్టిందని అంటారు. కానీ అంత కంటే ముందే ఇది మన దేశంలో విశేషమైన ప్రాచుర్యం పొందిందని, మన దేశాన్ని ఏలిన బ్రిటిష్ వారు ఆ క్రీడను చూసే కొద్ది మార్పులతో క్రికెట్ ఆడేవారని అంటారు. సరిగ్గా అలాంటి దాఖలాలే యూరప్‌తో పాటు అర్జెంటీనా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, ఇంగ్లండ్, స్పెయిన్, వేల్స్, జపాన్, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రగ్బీ గురించి కూడా కనిపిస్తున్నాయి. యూరప్ దేశాల్లో క్రీడాకారులు, క్రీడా ప్రేమికుల మన్ననలు పొందిన రగ్బీ మన దేశంలోని మణిపురిలో అనాదిగా ప్రాచుర్యం పొందిన క్రీడగా చెబుతున్నారు. యుబి లక్పీగా స్థానికులు పిలుచుకునే ఈ క్రీడ అచ్చం నేటి రగ్బీలానే ఉంటుంది. ఒక బంతిని ఇరు జట్ల క్రీడాకారులు తరలిస్తూ రెండు పోల్స్ మధ్యగా బలంగా నెట్టి గోల్ చేయడమే లక్ష్యంగా సాగుతుంది. ఆధునిక రగ్బీ కూడా ఇలాగే ఆడతారు. మణిపురి క్రీడాకారులు కూడా ఈ మాటే చెబుతున్నారు. శతాబ్దాల క్రితం ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న తమ యుబి లక్పీ క్రీడనే యూరప్ జాతీయులు రగ్బీగా నామకరణం చేసి ఆడుతున్నారని అంటున్నారు. యుబి అంటే మణిపురిలో కొబ్బరికాయ. ఇక లక్పీ అంటే దానిని నెట్టడం. అందుకే ఈ క్రీడను యుబి లక్పీ అనే కాకుండా కోకోనట్ రగ్బీ అని కూడా స్థానికంగా పిలుస్తుంటారు. ఒక్కో జట్టులో ఏడుగురు క్రీడాకారులు ఉంటారు. వారంతా వంటికి నూనె రాసుకుంటారు. అలాగే వారు ఆడే కొబ్బరి బొండానికి కూడా నూనె రాస్తారు. యోషాంగ్ ఫెస్టివల్‌గా పిలవబడే మణిపురిలోని ఒక వేడుక సమయంలో ఈక్రీడను సాంప్రదాయరీతిలో ఆడతారు. మైదానంలో 45 ఇంటూ 18 మీటర్ల చుట్టుకొలత కలిగిన పరిధిలో ఈ క్రీడను ఆటగాళ్లు ఆడతారు. అలా ఆడుతూ 4.5 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తు కలిగిన రెండు పోల్స్ మధ్యలోకి బంతిని ఆటగాళ్లు ఎదుటి జట్టు ఆటగాళ్ల నుండి ఎలాంటి ప్రతిబంధకం లేకుండా నెట్టగలిగితే గోల్ పడి పాయింట్ వచ్చినట్లు. ఏ జట్టుకు ఎక్కువ పాయింట్లు వస్తే ఆ జట్టు ఆటలో నెగ్టినట్లు. ఈ క్రీడను చూసేందుకు వచ్చే అతిథులకు సమీపంలో వారి ఎదుట తొలుత కొబ్బరి బొండాం ఉంచబడుతుంది. అంపైర్ విజిల్ వేయగానే ఆ కొబ్బరి బొండం కోసం ఆటగాళ్లు పోరు మొదలుపెట్టడంతో ఆట ప్రారంభం అవుతుంది. ఈ విధంగా మన దేశపు రగ్బీ స్వరూపం ఉంటుంది. దీనినే యూరప్ వాళ్లు కొంచెం మార్పులు చేర్పులు చేసి ఆడుతూ ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.

- దుర్గాప్రసాద్ సర్కార్