S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విశ్వసనీయత( సండేగీత)

నాయకత్వం వహించే వ్యక్తుల హృదయాల వైశాల్యం పెద్దగా వుండాలి. అందరినీ కలుపుకొని పొయ్యే మనస్తత్వం ఉండాలి. తప్పులని, ఒప్పులని సమాన స్థాయిలో స్వీకరించే మనస్తత్వం ఉండాలి. విజయాలకి, వైఫల్యాలకి బాధ్యత వహించాలి. అప్పుడే ఆ నాయకుడికి మంచి పేరు వస్తుంది. అలా కాకుండా విజయాలని తన ఖాతాలో, వైఫల్యాలని ఇతరుల ఖాతాలో వేస్తే అతని పట్ల ఎవరికీ గౌరవం వుండదు. కాలక్రమంలో అతను వైఫల్యాలను ఎక్కువగా ఎదుర్కొంటాడు.
ఈ మధ్య ఓ చిన్న కథ చదివాను. అది అద్దం - కిటికీ. ఈ కథ నాయకత్వం వహించే వ్యక్తులకి బాగా పనికి వస్తుంది. అందులోని నాయకుడికి అద్దం - కిటికీలంటే బాగా ఇష్టం. ఏదైనా విజయం సాధించినప్పుడు అతను అద్దంలో తన ముఖం చూసుకుంటాడు. ఆ విజయం తన వల్లే సాధ్యమైందని అతని భావన. అద్దంలో చూసుకుంటూ ఆనందంలో వెలిగి పోతాడు.
అదే విధంగా వైఫల్యం ఎదురైనప్పుడు అద్దం వైపు చూడడు. ఎందుకంటే అప్పుడు అతను కన్పిస్తాడు. అలా కాకుండా కిటికీ నుంచి బయటకు చూస్తాడు. ఆ వైఫల్యానికి ఇతరులని బాధ్యులని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తన టీమ్‌లోని ఇతరులని బాధ్యులని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిందిస్తూ ఉంటాడు.
ఇలా చేయడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది తప్ప చిరకాలం ఉండదు.
అతని విశ్వసనీయత పోతుంది.
కాలక్రమంలో ఆ నాయకుడు పలుచన అవుతాడు.
ఆ కథలో జరిగింది అదే!
అతని పై వ్యక్తులు చివరికి అతన్ని నాయకత్వం నుంచి తొలగిస్తారు.
మంచి నాయకులు మరో రకంగా ఉంటారు.
విజయం లభించినప్పుడు కిటికీ నుండి బయటకు చూస్తారు. విజయానికి కారణమైన వ్యక్తులని గుర్తించడానికి ప్రశంసించడానికి ప్రయత్నం చేస్తాడు.
అదే విధంగా వైఫల్యం ఎదురైనప్పుడు అద్దంలోకి చూస్తాడు. వైఫల్యం ఎదురవడానికి కారణం ఏమిటి?
కారణాలు వెతుకుతాడు.
బాధ్యత తీసుకుంటాడు.
మంచి నాయకుడిగా ఎదగాలంటే కిటికీ - అద్దాలని గుర్తు పెట్టుకోవాలి. వాటిని ఉపయోగించుకునే పద్ధతి తెలియాలి.
అప్పుడే విశ్వసనీయత పెరుగుతుంది.

- జింబో 94404 83001