S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సూక్ష్మ రహస్యం!

జీవజాతుల్లో అతి చిన్నవి ఉంటాయి. వాటిని ఎంత దగ్గర నుంచి చూసినా మనం గమనించలేని అంశాలు చాలానే ఉంటాయి. వాటిని మైక్రోస్కోపులో చూస్తే వాటి విశ్వరూపం కనిపిస్తుంది. ఇలా మైక్రో ఫొటోగ్రఫీతో అతి చిన్నజీవుల నిగూఢ రూపాన్ని ఆవిష్కరించారు చాలామంది. నికాన్ సంస్థ నిర్వహించే వార్షిక మైక్రో ఫోటోగ్రఫీ పోటీల్లో బహుమతులు గెలుచుకున్న కొన్ని చిత్రాలు ఇవి. న్యూయార్క్‌కు చెందిన తెలీనా జ్గోడ తీసిన ఈ బద్దెపురుగు ముఖం ఎలా భయపెడుతోందో చూడండి. నోరు తెరిచిన దాని ముఖం చూడటానికి అతి పెద్దదిగా ఉంది కదూ. కానీ మనం మన కళ్లతో దీనిని ఇలా చూడలేం. అసలు బద్దెపురుగు పల్చటి తెల్లని దారంలా ఉంటుంది. దాని నోరును మనం ఎప్పుడు చూడాలి గనుక. దీనికి నాలుగో బహుమతి వచ్చింది. ఇక స్విట్జర్లాండ్‌కు చెందిన డాక్టర్ మైఖేల్ పెర్ని తీసిన ఈ చిత్రం చూస్తే ముచ్చటపడతారు. అప్పుడే పుట్టిన ఎలుక చెవుల లోపలి నరాలకు సంబంధించిన చిత్రం ఇది. స్పర్శను గుర్తించే వెంట్రుకలు (ఆకుపచ్చని అంచు), స్పైరల్ గాంగ్లియన్ న్యూరాన్ వలయాలు (ఎరుపు)తో కనిపిస్తున్నది కేవలం ఎలుక చెవి లోపలిభాగం అసలు రూపం అన్నమాట.