S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా ఉందీ వారం? (నవంబర్ 5 నుండి 11 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆర్థిక ప్రోత్సాహంతో ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న క్లెయిములు పరిష్కారమవుతాయి. శ్రమకు తగ్గ ఫలితాలను అందుకుంటారు. బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. మిత్రులు సాయపడతారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా మారుతాయి. బాధ్యతలు విస్తరిస్తాయి. సంఘ వ్యవహారాల్లో పాల్గొంటరా. స్పెక్యులేషన్ ఫలప్రదం. కొన్నింటి యందు కీలక పాత్ర పోషిస్తారు. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. అనుకున్నవి ఆలస్యంగానైనా పూర్తి చేస్తారు. ఓ ఆలోచన ఆందోళన కలిగించనుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఇష్టులతో శిష్టులతో చర్చలు సఫలమవుతాయి. కుటుంబ వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. గౌరవ మన్ననలు అందుకుంటారు. జన సంబంధాలు ప్రయోజనకారి. ప్రయాణాలకు అనుకూలం. మీ పరిశీలన అన్నింటా ఫలప్రదం. ఆశించిన రంగాలు తృప్తినిస్తాయి. విద్యార్థులకు అనుకూల తరుణం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. పెట్టుబడులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై ధ్యాస ఉంచండి. పరధ్యానం కూడదు. పెట్టుబడులతో ఇతరులను ఆకర్షిస్తారు. పరిచయాలు విస్తరిస్తాయి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఆర్థిక స్థితిని సమీక్షించుకోండి. వృత్తి, వ్యాపార వ్యవహార రంగాలందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రావలసినవి అందుకుంటారు. అనుకోని ధనప్రాప్తి. అనుకోకుండా బకాయిలు అందుకుంటారు. ఇతరులను తక్కువగా అంచనా వేయకండి. మనసులోని మాట బహిర్గతం కానీయకండి. శత్రుత్వాన్ని మిత్రుత్వంగా మార్చుకోవాలి. స్పెక్యులేషన్ మిశ్రమం. ఆధ్యాత్మికం, యోగా ఉపకరిస్తాయి. అన్నింటా జయం. ఎంచుకున్న రంగాలు గతంకంటె అనుకూలంగా ఉంటాయి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

పోటీల్లో విజయాన్ని అందుకుంటారు. కోర్టు విషయాలు పరిష్కార దిశగా ఉంటాయి. బంధాలు అనుబంధాలు విస్తరిస్తాయి. కొత్త పరిచయాలు యోగిస్తాయి. ఇతరులతో ప్రయాణాలు ఆలోచింపజేస్తాయి. ఎంచుకున్న వృత్తి, వ్యవహార, వైద్య, ఐ.టి. రంగాలు బలపడతాయి. ఉద్యోగ రంగమందు ఉన్నతి. బదిలీలు ఉంటాయి. ఆర్థిక స్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రణాళికలు మేలు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

పట్టుదలతో పనులు పూర్తి చేయటం మంచిది. అనుకున్నవి ఫలిస్తాయి. ఎంచుకున్న రంగాలు అనుకున్నట్లు ముందుకు వెళతాయి. ప్రోత్సాహాలు అందుకుంటారు. సాలోచనలు యోగిస్తాయి. వాహన మార్పులకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన కార్యాలు అనుకూలిస్తాయి. శుభ వర్తమానాలు అందుకుంటారు. కష్టనష్టాలకు గురి కాకండి. హితుల సలహాలు విన్నా స్వీయ నిర్ణయాలు మేలు. స్పెక్యులేషన్ ఫలప్రదం.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

లక్ష్యసాధనలకు అనుగుణంగా మెలగండి. విద్యార్థులకు మంచి అవకాశాలు. ఉద్యోగ వ్యాపార రంగాలు అనుకూలిస్తాయి. వృత్తులందు అనుకోని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తలవని తలంపుగా పనులు పూర్తవుతాయి. స్పెక్యులేషన్ మిశ్రమం. వాయిదాల చెల్లింపులకు అనుకూలం. ఆరోగ్యం జాగ్రత్త. సమాచారం ఉపయోగిస్తుంది. నిరుద్యోగులకు, స్ర్తిలకు చక్కని అవకాశాలు ఎదురుచూస్తున్నాయి.
తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. తరచు వాయిదా పడుతున్నవి చర్చలలో పరిష్కారమవుతాయి. బదిలీలు, సానుకూల మార్పులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు మెరుగవుతాయి. ముఖ్యమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది. స్థల సేకరణ ఫలప్రదం. గృహ రుణాలు మంజూరవుతాయి. ఇబ్బందులు సర్దుబాటు చేసుకోండి. ఎంచుకున్న రంగాలపై దృష్టి పెట్టండి. కుటుంబంలో శాంతి వికసిస్తుంది. ఆందోళన పడకండి. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది. అన్నింటా జయం.
వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. అగ్రిమెంట్లు, కాంట్రాక్టులకు సరైన సమయం. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. ప్రయాణాలు, సోదర విషయాలు చర్చకు వస్తాయి. వృత్తులందు అనుకోని ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉత్సాహంతో గడుపుతారు. మిత్రులను కూడా కనిపెట్టి ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగాలందు మార్పులకు అనుకూలం. శుభ వర్తమానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక ప్రగతి. పెట్టుబడులలో స్వల్ప లాభం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

విదేశీ వ్యవహారాలు, ఉన్నత విద్య అనుకూలిస్తుంది. విత్తప్రాప్తి. జయాలు విస్తరిస్తాయి. విద్య, వాణిజ్య, ఉద్యోగ రంగాలు అనుకున్న విధంగా ఉంటాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. గతంలో చేసిన కృషి ఫలిస్తుంది. సాంకేతిక రంగంలో విస్తరణ. అన్ని పనులలోనూ గుర్తింపు లభిస్తుంది. ఇతరులకై మీ విషయాలు వక్రీకరించబడతాయి. ఎంచుకున్న రంగాలు గతంకంటె అనుకూలంగా ఉంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ఆర్థిక రంగం అనుకూలిస్తుంది. బంధుమిత్రుల సహాయం క్రమానుకూలంగా అందుతాయి. అన్ని రంగాలు గతం కంటె మెరుగ్గా ఉంటాయి. కొన్ని పనులు నత్తనడకన నడుస్తూంటాయి. బ్యాంకులు, ఆర్థికపరమైన విషయాలలో స్పష్టత వస్తుంది. పెద్దల ఆశీస్సులలు అందుకుంటాయి. సమాజ సహకార సంఘాలలో మీ పలుకుబడి పెరుగుతుంది.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. లక్ష్యాలు నెరవేర్చుకుంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. చర్చలు అన్నింటా అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్ర్తిల సాయం అందుకుంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నించండి. బంధుమిత్రులతో ఓ వేడుకలో పాల్గొంటారు. ఆర్థిక వెసులుబాటు ఉంది. స్పెక్యులేషన్ ఫలదాయకం. విద్య, సాంకేతిక రంగాలు విస్తరిస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

బంధుమిత్రుల సహకారంతో ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకుంటారు. స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. దూరం నుంచి మంచి సమాచారం అందుతుంది. ఆర్థిక సంస్థల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆ సమాచారం మీకు యోగిస్తుంది. అనుకున్నవి ఆలస్యంగానైనా పూర్తి చేస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. అన్నింటా జయం.

నవంబర్ 12 నుండి 18 వరకు ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855