S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మృత్యు భయం

మరణం తర్వాత సరాసరి స్వర్గానికే చేరతామన్న విశ్వాసాన్ని ఎవరు ఎంతలా మనలో పాదుకొల్పినా ఆ స్వర్గ సుఖం అనుభవించిన తర్వాతనైనా మరణం ఉండదన్న గ్యారంటీ ఇస్తారా? అని అడుగుతాం. ఇదీ మన సైకాలజీ... మృత్యువును గురించిన భయం. ఈ దేహ స్థితిపైన ప్రేమ.. మమకారం.. ప్రాపంచికతపై మోజు - తీరనంత కాలం, వియోగం పుట్టనంత వరకు - మృత్యువు ‘్భయం’కరంగానే కనిపిస్తుంటుంది. మృత్యు రాహిత్య స్థితిని గురించిన తపన పెరుగుతూనే ఉంటుంది. భయంతో నరకాన్ని సృష్టించుకుంటాం. ఇలా మృత్యుభయంతో మనం ప్రకృతికి, సృష్టి ధర్మానికి విరుద్ధంగా వర్తిస్తుంటాం. కారణం మన మృత్యువును సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటమే! అందుకే కృష్ణుడు యోగ మార్గం ద్వారా మృత్యు స్థితిని దాటటమూ, అతీత మృత్యు స్థితిని ఆత్మ స్థితితో సంయోగింప చేయటం ఎలానో మన ముందుంచాడు.’
నా వాగ్ధాటికి అడ్డుపడుతూ చైతన్య -
‘అంటే ‘పోగొట్టుకోవటం’ అన్న ఆలోచనే వియోగానికి, విషాదానికి పోషకాహారం అంటారా?’
‘అంతేకదా చైతన్యా! ఇష్టమైన డ్రస్ చిరిగినా బాధ పడిపోతాం. రంగు వెలసినా ఏదో పోగొట్టుకున్న భావన. అటువంటిది కనిపించే మనం రేపు కనిపించకపోతామంటే బాధ ఉండదా? ఉండమన్న ఆలోచన భయం గొల్పదా? అందుకే భగవద్గీత అశాశ్వతత్వాన్ని వెంట తెచ్చుకున్న దేహాన్ని గురించి కాక శాశ్వతత్వాన్ని పొదువుకున్న ఆత్మని గురించే చెప్తుంది. కారణం, ఆత్మ కాలాతీతమైందే కాదు.. జననానికి, మరణానికి సైతం అతీతమైంది కావటం.
మనం మనసుతో చూసి ఆత్మది దేహ స్థితి అంటుంటాం. నిజానికి మనసును ఆవరించిన దేహాన్ని సైతం ఆవల పెడితే ఆత్మ స్థితి ఏమిటి? దాని స్థితికి నిన్న, నేడు, రేపు అన్నది లేదు. అంటే కాలానికి కట్టుబడని స్థితి ఆత్మది అని. కాబట్టి, మనకు కనిపించే జనన మరణాలకు సైతం అతీతమైందే. అంటే వాటికి వశం కానిదే! ఈ ఆత్మ ప్రస్తావనతో కృష్ణుడు అర్జున విషాద యోగానికి వీడ్కోలు పలికేందుకు సన్నద్ధం అవుతాడు. ఇలా ఆత్మయోగానికి తెర తీసిందే రెండవ అధ్యాయం.’
* * *
దేహ స్థితిలో కూరుకుపోయి ఈ దేహమే శాశ్వతం కావాలన్న అపోహలో ఉన్న మనల్ని దేహాతీతుల్ని, మానసాతీతుల్ని చేయటమే కృష్ణగీత మూల అంశం. ఇహంలో దేహంతో తప్పిపోతున్న మనల్ని పరంలో ఆత్మతో ప్రస్థానింప చేయటమే గీతోపదేశ సారాంశం.
* * *
కురుక్షేత్రంకి అడుగుపెట్టిన అర్జునుడే యుద్ధం చేసేది.. కానీ చేయించేది కృష్ణుడే. అలాగే రథమూ, రథాశ్వాలూ అర్జునుడివే.. కాని రథ సారథి కృష్ణుడు. ఈ సృష్టిలో మనమూ అర్జునులమే!
మన దేహం ఈ జీవన క్షేత్రానికే పరిమితం. దేహం మనదే.. అయితే ఈ దేహ సారథి మాత్రం ఆత్మనే.. కాబట్టి జీవన పోరాటం మన దేహానిదే అనిపించినప్పటికీ ఆ పోరాట సారథ్యం మాత్రం ఆత్మదే.
చక్రాలు ఉన్నంత మాత్రాన, గుర్రాలు ఉన్నంత మాత్రాన రథం పరుగులు తీయదు కదా! రథం పరుగులు పెట్టాలంటే రథసారథి కావాలి. అలాగే దేహానికి అవయవాలు ఉన్నంత మాత్రానే సరిపోదు.. ఆ దేహానికి సారథ్యం వహించటానికి ఆత్మ ఉండి తీరవలసిందే!
ఆ ఆత్మ సారథ్యాన్ని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే!
కాబట్టి, దేహమే వ్యక్తి కాదు, దేహ వర్తనంలా కనిపించే వ్యక్తిత్వమూ వ్యక్తిది కాదు. దేహ చోదక శక్తి అంతా ఆత్మదే. వ్యక్తిత్వం వ్యక్తిమత్వంగా పరిణమించాలంటే దేహ తత్వంతో మురిసిపోక ఆత్మ తత్వాన్ని అందిపుచ్చుకోవాలి. అదే ఆత్మయోగం.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946