S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తల్లిదండ్రులు మారాలి

‘చదువా చంపకే’ శీర్షికన అందించిన వ్యాసం ఆలోచింపజేసేదిగా ఉంది. ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా తల్లిదండ్రులు ఇంకా తమ పిల్లలను కార్పొరేట్ కాలేజీల్లోనే చదివిస్తున్నారు. లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయిపోవాలి. అదే వాళ్ల కోరిక. ముందు తల్లిదండ్రులు మారాలి. పిల్లల మనసులను అర్థం చేసుకోవాలి. అప్పటివరకు ఈ ఆత్మహత్యలు ఆగవు. పూర్ణచంద్‌గారి ‘ఆరోగ్య సూత్రాలు’ ఉపయుక్తంగా ఉంటున్నాయి. అవీ ఇవీ బాగుంటున్నాయి. అక్షరాలోచన లో వెయ్యి కోట్ల వెర్రి చాలా కరెక్ట్ రాశారు. సౌభాగ్యగారు మనిషికి గర్వం పనికిరాదని చక్కని కథారూపంలో చెప్పారు. లోకాభిరామమ్‌లో ఆయన చెబుతున్న సంగతులు చదువుతూంటే.. ఆ కాలేజీ రోజులు ఆయా ప్రాంతాలు మళ్లీమళ్లీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నట్టు అనిపిస్తోంది.
-డి.వి.తులసి (విజయవాడ)
కథ కాని కథ
ఆదివారం అనుబంధంలో ప్రచురించిన ‘గంసీ’ కథ కాని కథ. యధార్థ సంఘటనలు, కరుణరస ప్రధానమైన కథనం చాలా బాగుంది. స్ర్తి సాహసం, కష్టాల నెదుర్కొనే చేవ, విధివంచితులైన గంసీ లాంటి మహిళలు, ఈ కథ చదివి ఎంతో నేర్చుకోవచ్చు. నేను స్ర్తిని, నేనేం చేయగలననుకొనే మహిళలకు ఒక మంచి సందేశం. ఒక వనజీవిలో ఎంతో పరిణతి కనిపించింది. అత్త తల్లి పాత్ర పోషించడం, కోడలును కూతురుగా చూడడం, భర్త (తన కొడుకు) మరణించిన తర్వాత దిక్కులేని కోడలికి మారుమనువు చేయడం, ఆమె ఆలనా పాలనా తను తీసుకోవడం, అనూహ్యమైన విషయం. గంసీ ఒక ఆదర్శ మహిళ, తల్లి మరియు తల్లిలాంటి అత్త. రచయిత్రికి అభినందనలు.
-పంజాల నరసయ్య (హైదరాబాద్)
ఆత్మీయ కథ
సమ్మెట ఉమాదేవిగారి ‘గంసీ’ కథ మనసుకు ఎంతగానో హత్తుకుంది. పల్లెలో ఉండే మానవ సంబంధాల గురించి, వాళ్ల ఆత్మీయత, అనురాగం, ప్రేమాభిమానాలు ఎంత గొప్పగా ఉంటాయో చాలా వివరంగా తెలియజేశారు కథారూపంలో. కోడలిని కూడా కన్నబిడ్డలా ఇంత అపురూపంగా చూసుకోవటం మానవ సంబంధాలకు మచ్చుతునక. దీనికి భిన్నంగా పట్టణాలలో నివసించే చదువుకున్న వారికి మానవ సంబంధాలు, వాటి విలువలు తెలియవని కండక్టర్ శేఖర్ చెల్లెలు అత్తగారి పాత్ర ద్వారా వివరించరా. మానవ సంబంధాల గురించీ, వాటి విలువల గురించీ నేటి తరానికి విలువైన సందేశాన్ని అందించిందీ కథ.
-బంగారి తాల్క (హైదరాబాద్)
చాలా బాగుంది..
ఆదివారం అనుబంధంలో కవర్‌స్టోరీ శీర్షికన అందించిన ‘చదువా చంపకే’ వ్యాసం చాలా బాగుంది. సమస్య పూర్వాపరాలను చక్కగా విశే్లషించారు. ప్రభుత్వ విద్య నానాటికీ దిగజారుతుంటే కార్పొరేట్ విద్య విద్యార్థులను ఏకంగా కాటికి పంపుతోంది. ‘అక్షరాలోచన’లో కవితలు చాలా బాగున్నాయి. సండే గీత, ఓ చిన్న మాట శీర్షికలు మాలో కొత్త స్ఫూర్తిని నింపుతున్నాయి. ‘దిగంబర దేవత’ కథ చాలా బాగుంది. ‘అమృతవర్షిణి’లో మల్లాది సూరిబాబుగారు చెబుతున్న విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘లోకడ పోకడ’ శీర్షికన అందిస్తున్న వ్యాసాలు, విశేషాలు ఆకట్టుకొంటున్నాయి. కార్టూన్లు కడుపుబ్బ నవ్విస్తున్నాయి. కార్టూన్ల సంఖ్య పెంచితే బాగుంటుందేమో?! గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సూర్యాపేట గ్రంథాలయం గురించి చక్కని వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు.
-మార్టూరు అజయ్‌కుమార్ (మురికిపూడి)
రుచిస్తాయా?
‘వైష్ణవుడు’ అంటే అదో కులం కాదు - మతం కాదు. యితరుల కష్టాలను ఎవ్వడెరుగునో, వాటిని సమర్థవంతంగా ఎవరు నివారించగల ప్రయత్నం చేస్తారో వారినే వైష్ణవుడు అనే అర్థవంతమైన వాక్యాన్ని విశదంగా చెప్పకనే అనేక ఉదాహరణలతో చెప్పిన మల్లాది వారి అమృతవర్షిణి చదువరులను ధన్యులను చేసింది. ఇది వరలో అన్ని పాఠశాలలలో దేశభక్తి గీతాలను ఉదయం ప్రార్థన సమయంలో పిల్లల చేత పాడించిన తరువాతే తరగతి గదులకు పంపేవారు. ఈ రోజుల్లో జుగుప్సాకర సాహిత్యాన్ని పాడిస్తూ వికృతానందాన్ని పొందే వారికి దేశభక్తి గీతాలు రుచిస్తాయా అన్న అనుమానం పోవాలంటే ఇంకా మరక అంటని తెల్లకాగితం లాంటి స్కూలు విద్యార్థుల చేత పూర్వ పద్ధతులను అవలంబింపజేస్తే వారికి అదే అలవాటవుతుంది. నేటి ఉపాధ్యాయులకే దేశభక్తి గీతాలు నోటికి రావు. ఇంటర్ చదువు వరకు తెలుగును పాఠ్యాంశంగా చేయాలనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం బహుదా ప్రశంసనీయం.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
సాకీ కథలు
కథల సాకీని గోపాలంగారు రుచి చూపించారు. బాగుంది. సాకీ కథలు ముఖం మీద గుద్దినట్లు ఉంటాయన్నారు. ఆ గుద్దుడు స్థాయి మితిమీరితే మర్డరైపోయే ప్రమాదం ఉంది. సాకి మరణించి బతికిపొయ్యాడు.
-పి.చంపక్ (మాధవనగర్)
మళ్లీ మొదలుపెట్టండి
‘సండే గీత’లో మొదలు పెట్టండి - అంటూ ఏ పనులు చేద్దామనుకున్నా వెంటనే మొదలుపెట్టండి, పరిస్థితులు అనుకూలించక పోయినా మళ్లీ మొదలుపెట్టండి అంటూ చక్కగా తెలిపారు. ఓ చిన్న మాటలో ‘దృష్టి’ ప్రతి పనిపైనా చక్కటి దృష్టి పెడితే, అన్నీ వున్న మనం ఎంతో అదృష్టవంతులం. ఇలా వున్నందుకు ఆ దేవునికి కృతజ్ఞులమై ఉండాలన్నది సత్యం.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)