S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేలతల్లి నివేదన

విష ఔషధాల వినియోగంతో
విరక్తి చెందిన నేలతల్లి
విముక్తి కోసం చేతులెత్తి మొక్కుతోంది
నా హృదయ క్షేత్రంలో
నాటిన విత్తనాల పిల్లల్ని-
పదిలంగా కాపాడమని-
ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేయమని!
విష రసాయనాల కృత్రిమ సేద్యంతో
విసుగెత్తిన పుడమి తల్లి-
విశాల హృదయంతో వేడుకుంటోంది-
ఎక్కువ దిగుబడి కోసం
ఎగబడి - తనలో శక్తిని హరించవద్దని
సహజసిద్ధమైన సేంద్రీయాల్ని
కాలం సాక్షిగా ప్రోత్సహించమని!
వాణిజ్య పంటల వ్యాపారంతో
వాస్తవాన్ని వౌనంగా భరిస్తున్న
బంగరు భూమి-
బెంగతో కుంగి దిగులు పడుతోంది
డబ్బుకోసం గడ్డి తినే మనుషులు
సత్తువలేని విత్తనాల్ని నాటి-
తనలో సారాన్ని నిస్సారం చేయవద్దని-
తన ఉనికిని కోల్పోయేలా ప్రవర్తించవద్దని
వింటున్నావా రైతన్నా - ఓ నేలతల్లి ప్రార్థన-
విధివంచితగా మారిన - నీ కన్నతల్లి అభ్యర్థన!

-మరువాడ భానుమూర్తి 8008567895