S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మినీ కవిత

ఆల్చిప్పల వంటి కళ్లలోంచి
జాలువారుతున్నాయి కన్నీళ్లు
కన్నీళ్లు చెపుతాయి కన్నీటి కథలు
కథలలో దాగున్నాయి వ్యథలు

అంతరిక్షానికి రాకెట్లు పంపగల మనిషి
అంతరాత్మలో గూడుకట్టుకున్న
చింతలను తెలుసుకోలేడు
శాంతిని పొందలేడు

చిన్న విత్తనం
వటవృక్షానికి మూలం
చిన్న ఆలోచన
మార్చు సమాజ స్వరూపం

నల్లబల్ల మీద తెల్లగీత
మన బతుకుల
తలరాతలు మార్చే భాగ్యరేఖ

మద్యం మత్తులో
కూలీ జనం
కూలీల నట్టింట్లో
ఆకలి రాజ్యం
పేరుకు సంక్షేమ రాజ్యం
ఆచరణలో పూజ్యం

క్లబ్బులు, పబ్బులు
విష సంస్కృతికి బీజాలు
యువతను పెడత్రోవ పట్టించే
మత్తుమందుల ఖజానాలు

చెమట ముత్యాలు
కష్టానికి ఆనవాలు
మెతుకు కోసం మన వ్రాలు

చూడు చూడు
సర్కారు ఆసుపత్రులు
వైద్యం శూన్యం
ప్రాణం నైవేద్యం

అగ్రవాదం
ఉగ్రవాదం
క్షుద్రవాదం
ప్రపంచ శాంతికి ప్రమాదం

ఆకలి తీర్చుకోవడానికి
అడుక్కునేవాడు ‘బిచ్చగాడు’
పేదల కడుపు కొట్టేవాడు
ఆధునిక ‘బిచ్చగాడు’ *

-గజవెళ్లి శ్రీనివాసాచారి 9059438068