S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీవించడం

జీవితంలో చాలామంది సంతోషంగా ఉండకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైంది వాళ్లు జీవించకపోవడం.
జీవించడం అంటే యాంత్రికంగా జీవించడం కాదు. మనసు పెట్టి జీవించడం. ఈ పనిని చాలా మంది చేయరు. ఈ పనిని ప్రయత్నపూర్వకంగా చేయాలి. అప్పుడే సంతోషంగా ఉండటం మొదలవుతుంది.
ఆఫీసు విషయాలని ఆఫీసులోనే వదిలిపెట్టక ఇంటికి మోసుకొని వెళ్తారు. ఆఫీసు విషయాలను ఇంటిలో చర్చిస్తూ ఉంటారు. ఫోన్లలో కూడా అవే సంభాషణలు.
అదే విధంగా ఇంటి విషయాలని, సమస్యలని ఇంటి దగ్గరే వదిలిపెట్టి పోకుండా ఆఫీసుకి తీసుకొని వెళ్తారు. అక్కడ తోటి ఉద్యోగులతో తన సమస్యలని చర్చిస్తారు. టెలిఫోన్లో అవే సంభాషణలు.
ఇట్లా ఎన్నో విషయాలని చెప్పవచ్చు.
ఎంతోమంది ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు. వాటిని వింటూనే ఉంటారు. కానీ అందులోని సందేశాలని పట్టించుకోరు. అర్థం చేసుకోరు.
గతంలో జరిగిన సంఘటనల గురించి, రాబోయే విషయాల గురించి ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచనల్లో పడి వర్తమానంలో నివసించడం మానేస్తారు. జీవితంలో సంతోషంగా వుండాలంటే వర్తమానంలో బతకాలి. వర్తమానంలో నివసించాలి. గతం భవిష్యత్తూ ముఖ్యమైనవే. అయితే వర్తమానం అత్యంత ప్రాముఖ్యత కలది.
వ్యక్తి జీవన సరళి అతని దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వున్న పరిస్థితి మీద దృష్టి కేంద్రీకరిస్తే కొన్ని సమస్యలు తగ్గుతాయి.
నిశ్శబ్దాన్ని వినగలగాలి.
సూర్యోదయాన్ని ప్రేమించగలగాలి.
సూర్యాస్తమయాన్ని ఆస్వాదించగలగాలి.
అన్నింటికన్నా ముఖ్యమైంది -
ఈ క్షణాన్ని జారిపోకుండా చూసుకోగలగాలి.
ఇవి నేర్చుకునే వరకు సంతోషం అంటే ఏమిటో తెలియడానికి చాలా కాలం పడుతుంది.
జీవించడం తెలియకుండా పోతుంది.

- జింబో 94404 83001