S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీవిత చరమాంకం (సండేగీత)

జీ వితం చాలా చిన్నది.
అది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు.
అందరికీ ఈ విషయం తెలుసు. కానీ తమ విషయంలో అలా కాదని అనుకోని అహంకారపూరితంగా ఉంటారు. ఎవరినీ లక్ష్యపెట్టరు.
మా మిత్రుడు ఒకడు ఇలాగే వుండేవాడు. ఓసారి ఓ భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి బతికి బయటపడ్డాడు. అప్పటి నుంచి అతని జీవిత సరళి మారిపోయింది.
అందరితో మంచిగా ఉండటం మొదలుపెట్టాడు.
ప్రేమపూర్వకంగా వుండటం ప్రారంభించాడు.
భార్యాపిల్లలకి ఎక్కువ సమయం కేటాయించడం మొదలుపెట్టాడు.
స్నేహితులతో సరదాగా ఉండటం ప్రారంభించాడు.
మంచి పనులని ప్రారంభించాడు.
చిన్నచిన్న విషయాలకే ఎక్కువ సంతోషపడటం మొదలుపెట్టాడు.
ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవడం, అందరిపట్ల సరిగ్గా ఉండటం మొదలుపెట్టాడు.
ఎవరైనా ఆశీర్వదిస్తే ఒదిగి స్వీకరించడం కూడా మొదలుపెట్టాడు.
జీవిత చరమాంకంలో చాలా మందికి ఇలాంటి జ్ఞానోదయమే కలుగుతుంది. కానీ అప్పటికే చాలా సమయం కరిగిపోయి ఉంటుంది.
ఇదే విధంగా అధికారుల వ్యవహార సరళి కూడా ఉంటుంది. కొత్త ప్రాంతానికి బదిలీ అయిన తరువాత అందరితో కఠినంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. రెండున్నర సంవత్సరాల తరువాత మెత్తబడతారు. అందరితో మంచిగా ఉండటం మొదలుపెడతారు. ఇంకా కొంతమంది వ్యక్తులు పదవీ విరమణ సమయం ఆసన్నం అయిన తరువాత మరీ మెత్తబడతారు. అందరితో ప్రేమపూర్వకంగా ఉండటం మొదలుపెడతారు.
మా మిత్రుడు చేసే పనులని ఏదో జరిగిన తరువాత కాకుండా ఇప్పుడే మొదలుపెట్టవచ్చు.
జీవిత చరమాంకంలో చేసే పనులు ఇప్పుడు చేస్తేనే మంచిది.
ఏమంటారు..?

జింబో 94404 83001