S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆగ్రహ సాగరం

ఏమిటో రంధీగా ఉంది
సమస్తం గందరగోళంగా వుంది
ఆకాశం మేఘావృతమయ్యింది
వర్షం పడవచ్చు పడకపోవచ్చు
ఉరుములు మెరుపులు
అగుపిస్తున్న దృశ్యాలు
సూర్యుడు వెలుగుతాడా లేదా తెలియదు
తెల్లారినట్టే కోడి కూసింది
ఎర్రబారినట్టే సూర్యుడు కనిపించాడు
తూర్పు అదృశ్యం సూర్యుడు మాయం
మనసు నల్లటి కొండతో నిండిపోయింది
సాగరం ప్రశాంతంగా వుంది కాని
కెరటం కాళ్లకు బలంగానే తాకుతుంది
గలా ఎటు నుండి ఎటు వస్తుందో తెలియదు
ఆకాశం ఊపిరాడటం లేదు
సాగరం ఆగ్రహం కావచ్చు
నిగ్రహించుకోవచ్చు
ఏదీ అర్థంకాని మనసు
అమావాస్యలా మారింది.

-సిహెచ్.మధు 9949486122