S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విశ్వాసం

1862లో అమెరికాలో సివిల్ వార్ జరిగే రోజుల్లో ఓ అడవిలో ఓ సార్జెంట్ వండిన మాంసాన్ని ఓ గినె్నలో ఉంచి, నిద్రని నటించాడు. తన పెంపుడు కుక్కతో అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఆ గినె్నని ఎత్తుకుపోతూండగా సార్జెంట్ తుపాకీ గురి పెట్టి అరిచాడు.
‘కదలక’
కుక్క అతన్ని చూసి అరవసాగింది.
‘అది మొరిగితే దాన్ని కాల్చేస్తాను’ సార్జెంట్ ఆ యువకుడితో కోపంగా చెప్పాడు.
‘అది మిమ్మల్నేం చేయదు’ చెప్పి అతను దాన్ని అదిలించి ఊరుకోబెట్టాడు.
‘నీ కోసమే చూస్తున్నాను. నిన్న రాత్రి కూడా నువ్వు నా భోజనాన్ని దొంగిలిస్తే ఆకలితో మాడాను. మళ్లీ ఈ రాత్రికీ వస్తావని ఎదురుచూశాను. అలాగే వచ్చావు. మా కెప్టెన్ దగ్గరకి వెళ్దాం పద. ముందు నువ్వు నడు. వెనక నేను వస్తాను. పారిపోయే ప్రయత్నం చేస్తే కాల్చేస్తాను’ సార్జెంట్ హెచ్చరించాడు.
అతన్ని సమీపంలోని ఓ మిలటరీ కేంప్‌లోకి తీసుకెళ్లిన సార్జెంట్ కెప్టెన్‌తో చెప్పాడు.
‘పట్టుకున్నాను’
‘నీ పేరేమిటి?’ కెప్టెన్ ఆ యువకుడ్ని ప్రశ్నించాడు.
‘బ్రాడ్లీ’
‘ఎక్కడ నించి వచ్చావు?’
‘మిస్సోరీ’
మొరుగుతున్న కుక్కని సార్జెంట్ తీసుకెళ్లి ఓ చోట కట్టేశాడు. గదిలోంచి బయటకి వచ్చిన మేజర్ని చూసి సార్జెంట్ సెల్యూట్ చేసి చెప్పాడు.
‘ఇతనే సార్ దొంగ’
‘ఎప్పటి నించి నువ్వు ఈ చుట్టుపక్కల ఉన్నావు?’ మేజర్ అడిగాడు.
‘నిన్న రాత్రి నించి’
‘నువ్వు కన్ఫిడరేట్ ఆర్మీలో పని చేస్తున్నావా? నీ రేంక్ ఏమిటి?’
‘అవును. కాని వాళ్లు నాకు రేంక్ ఏమీ ఇవ్వలేదు. నేను ఓత్ కూడా తీసుకోలేదు. డబ్బవసరం ఉండి వాళ్లు చెప్పిన పనులు చేస్తున్నాను’ బ్రాడ్లీ జవాబు చెప్పాడు.
‘మీ సైన్యం పది రోజుల క్రితమే ఇక్కడ నించి వెళ్లిపోయిందిగా? ఐనా నీకు ఇక్కడేం పని?’
‘నన్ను పెట్రోల్ డ్యూటీ మీద పంపారు. నేను తిరిగి వచ్చాక చూస్తే సైన్యం లేదు’
‘అబద్ధం చెప్పకు. ఇది యూనియన్ సైన్యం కేంప్ అని నీకు తెలుసు. ఇక్కడ ఎందుకు తారట్లాడుతున్నావు?’
‘నేను, నా కుక్క ఆకలితో ఉన్నాం. చుట్టుపక్కల ఇంకెక్కడా ఆహారం దొంగిలించలేను’
మేజర్ కెప్టెన్‌తో చెప్పాడు.
‘మన తర్వాతి కేంప్‌కి రాత్రి ఎనిమిదిన్నరకి ప్రత్యేకంగా ఓ సైనికుడ్ని గుర్రం మీద పంపు’
కొద్ది క్షణాలు ఆలోచించి బ్రాడ్లీని తనతో రమ్మని తన గదిలోకి తీసుకెళ్లిన మేజర్ మళ్లీ అడిగాడు.
‘మేము ఇక్కడ నించి మా తర్వాతి కేంప్‌కి పంపే సరుకుని దారిలో ఎవరు దాడిచేసి దొంగిలిస్తున్నారో తెలుసా?’
‘తెలీదు’
‘ఆ కేంప్ జనరల్ కర్టిస్ ఇక్కడ నుంచి వేగన్స్ వెళ్లడాన్ని ఓ గూఢచారి శత్రు సైన్యానికి చేరవేస్తున్నాడని చెప్పాడు.’
‘నేను గూఢచారిని కాదు. ఇక్కడ నించి బయల్దేరిన సరుకు ఏ దారిలో వెళ్తుందో కూడా నాకు తెలీదు.’
మేజర్ కాగితం మీద ఏదో రాసి, దాన్ని నలిపి బ్రాడ్లీ చొక్కా జేబులో ఉంచాడు. తర్వాత సార్జెంట్‌ని పిలిచి అడిగాడు.
‘ఇతని జేబులు వెదికారా?’
‘లేదు సర్’
‘ఐతే వెతుకు’
అతని జేబుల్లోంచి తీసిన నలిగిన కాగితంలో మర్నాడు సరుకు రవాణాకి చెందిన వివరాలు సార్జెంట్ చదివాడు.
‘ఇతను గూఢచారి అని ఈ కాగితం రుజువు చేస్తోంది. రేపు సూర్యోదయం అవగానే ఇతన్ని కాల్చి చంపండి’ మేజర్ ఆజ్ఞాపించాడు.
‘నేను అమాయకుడ్ని. మీరే ఆ కాగితాన్ని నా జేబులో ఉంచారు. నేను చేసిన నేరం ఆహారాన్ని దొంగిలించడం మాత్రమే’ బ్రాడ్లీ ఆవేదనగా చెప్పాడు.
ఆ రాత్రంతా కుక్క ఏడుపు కేంప్‌లో వినిపిస్తూనే ఉంది. కెప్టెన్ మేజర్ని ఒంటరిగా కలిసి చెప్పాడు.
‘అతను అమాయకుడు అనుకుంటున్నాను. మీరు ఎన్నడూ ఇలా కాగితంలో ఆ వివరాలని రాయలేదు. ఇతను శత్రు గూఢచారి కాదు. అతన్ని చంపద్దు. మన సమాచారం ప్రకారం మన వేగన్లని దోచుకునేవారు స్థానికులే.’
‘ఇతన్ని చంపితే శత్రు గూఢచారుల్ని పట్టుకోలేక పోతున్నాననే నింద నా మీద నించి తొలగిపోతుంది. దీని గురించి ఎవరితో మాట్లాడకు. రేపు ఉదయం అతనికి మరణశిక్ష విధించే బాధ్యత నీదే.’
కుక్క ఏడుస్తూనే ఉండటంతో మర్నాడు ఎవరో మరణిస్తారని ఆ రాత్రి సైనికులంతా అనుకున్నారు. కుక్క ఏడుపుతో నిద్ర పట్టని మేజర్ ఆ రాత్రి కట్టేసి ఉన్న ఆ కుక్కని రివాల్వర్‌తో కాల్చి చంపేసాడు.
* * *
మర్నాడు ఉదయం బ్రాడ్లీ తన చేతి వాచీని ఓ కార్పోరల్‌కి ఇచ్చి కోరాడు.
‘నేను మరణించాక నా కుక్క సరైన ఇంటికి చేరేలా చూడటానికి దీన్ని ఇస్తున్నాను. దాన్ని ఓసారి చూడాలి’
నిజం చెప్పడం ఇష్టంలేని కార్పొరల్ చెప్పాడు.
‘దాన్ని వాకింగ్‌కి తీసుకెళ్లారు’
బ్రాడ్లీని మరణశిక్ష అమలుచేసే ప్రదేశానికి తీసుకెళ్లారు. తన చేతుల్ని చెట్టుకు కట్టి, కళ్లకి గంతలని కడుతూంటే చెప్పాడు.
‘ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేను గూఢచారిని కాదు’
‘టామీ. దూరంగా వెళ్లు. నీకు గుండు తగుల్తుంది. కుక్కని పక్కకి తీయండి’ బ్రాడ్లీ ఆదుర్దాగా చెప్పాడు.
అతనికి తప్ప కుక్క ఏడుపు ఎవరికీ వినపడలేదు. మేజర్ అక్కడికి రాగానే కెప్టెన్ చెప్పాడు.
‘సర్. ఇతను మతిస్థిమితం కోల్పోయాడు. చంపడానికి అనర్హుడు’
ఐనా చంపమని మేజర్ చెప్పగానే, ఆశ్చర్యంగా ఆయనకి తను క్రితం రాత్రి చంపిన టామీ కనిపించింది. అది తన వైపు గుర్రుపెడుతూ రావడంతో మేజర్ ఆ కుక్కని రివాల్వర్‌తో కాల్చాడు. అది ఎగిరి అతని గొంతు పట్టుకుంది. తన గొంతు పట్టుకుని మేజర్ ‘సహాయం చేయండి. ఈ కుక్క నన్ను మెడ కొరికి చంపేస్తోంది’ అని అరిచాడు కాని వారికి ఎవరికీ కుక్క కనిపించలేదు. కొద్దిసేపట్లో కెప్టెన్ నేల మీద పడి గిలగిల కొట్టుకునే మేజర్ దగ్గరికి వెళ్లి చూస్తే అతని గొంతు చీల్చబడి, నెత్తురు కారుతూ కనపడింది. అధికారిక రిపోర్ట్‌లో అతని మరణానికి బ్రెయిన్ హెమరేజ్ కారణం అని నమోదైంది. కాని అతని మరణాన్ని చూసిన ఆరుగురికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒకరికి మాత్రం తెలుసు. సివిల్ వార్ అయ్యేదాకా సైనిక జైల్లో ఉన్న బ్రాడ్లీకి అది తెలుసు. ఓ కుక్కకి తన యజమాన మీద ఉండే విధేయత మృత్యువుకన్నా బలమైనది.
తనని కాల్చి చంపబోయే ముందు అప్పటికే చంపబడ్డ కుక్క ఏడుపు బ్రాడ్లీకి ఎందుకు వినపడింది? మేజర్‌కి ఆ కుక్క ఎలా కనపడింది? అంతా చూస్తూండగా అతని మెడ ఎలా అదృశ్యంగా చీల్చబడింది? అది డాక్టర్ పేర్కొన్నట్లు బ్రెయిన్ హెమరేజా? బ్రెయిన్ హెమరేజ్‌కి మెడ చీలదుగా? మరి? ఈ ప్రశ్నలకి జవాబులు దేవుడికే తెలియాలి.