S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నల్లముత్యాలూ ఉంటాయి!

ముత్యం అనగానే నిగనిగ తెల్లగా మెరిసిపోయే గుండ్రటి, బియ్యపు గింజల్లాంటివి గుర్తొస్తాయి. కానీ వీటిలో గుండ్రంగా ఊదారంగు, నలుపు, కాస్తంత పసుపు ఛాయతో కూడిన ముత్యాలూ ఉంటాయి. ఉప్పునీటిలోను, మంచినీటిలోనూ ముత్యపుచిప్పల్లో లభించే సహజసిద్ధమైన ముత్యాలకు గిరాకీ ఎక్కువ. భూమిపై దాదాపు కోటీ 60 లక్షల సంవత్సరాల నుంచి ముత్యాల వాడకం ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. బతికి ఉన్న జీవి నుంచి వాడుకునే ఆభరణం ముత్యం. ప్రతి పది లక్షల ముత్యపు చిప్పల్లో దాదాపు ఒక ముత్యం లభిస్తుంది. ఆల్చిప్పల్లోపల సన్నని ఇసుక లేదా ఇతర రేణువుల చుట్టూ కాల్షియంతో కూడిన పదార్ధాన్ని పొరలుపొరలుగా పేర్చుకుంటూ వస్తుంది ఆ చిప్పలోని జీవి. దాదాపు ఏడేళ్లు అలా చేసిన తరువాత అది ముత్యంగా మారుతుంది. కృత్రిమంగా ముత్యపు చిప్పల్ని పెంచి ముత్యాల తయారీకి వినియోగించడంలో చైనా మొదటి స్థానంలో ఉంది. ఉప్పునీటి ముత్యాలకన్నా మంచినీటి ముత్యాలకు విలువ ఎక్కువ. ఆస్ట్రేలియా తీరంలో ఈ మధ్య 2వేల ఏళ్లనాటి ముత్యాన్ని కనుగొన్నారు. ఇప్పటివరకూ లభించిన ముత్యాలలో పావురం గుడ్డు సైజులో ఉన్న ముత్యం అతిపెద్దది. అది ఆస్ట్రేలియాలో లభ్యమైంది. ప్రతి ఆల్చిప్ప (ముత్యపుచిప్ప-జలచరం)లో జీవి పుట్టినప్పుడు మగదిగా ఉంటుంది. మూడేళ్లు వచ్చేసరికి అది ఆడదిగా మారిపోతుంది. ఆ తరువాత ముత్యపు తయారీలో మునిగిపోతుంది.