S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాలుష్యం

చిన్న తేడాతో ప్రభంజనం, గాలి ప్రాణుల సర్వస్వం, మనిషిగా ఆలోచించవలసిన తీరు, మరణ శాసనంగా రూపొందుతున్న పారిశ్రామిక కాలుష్యం.. మొదలైన పదునైన అంశాలతో చురకత్తిలాంటి కవితలు అక్షరాలోచనలను కవితా రమ్యం చేశాయి. సంగీతం, స్నేహం రెండూ అద్భుత శక్తులు. వాటి గురించి గోపాలంగారి ‘మ్యూజింగ్స్’ ఆసక్తికరంగా ఉన్నాయి. ఆనందసాగర మీదని దేహము భూమి భారము అలాగే చదివితే విపరీతంగా అనిపించినా భక్తినీ, సంగీత పదాలను కలిపేసి సామాన్య పాఠకునికి సులువుగా అర్థమయ్యే రీతిలో ‘అమృతవర్షిణి’ సాగుతోంది. సేంద్రియ సేద్యంపై రైతులు దృష్టి సారించటం అవసరం, ఆవశ్యకత రోజురోజుకీ అధికమవుతోంది. ఆ విధానాన్ని ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా చేసే బాధ్యత ప్రభుత్వానిది. గురక గురించి పూర్ణచంద్‌గారి సలహాలూ సూచనలు ఉపయుక్తంగా ఉన్నాయి.
-డా.శివభూషణం (కర్నూలు)
ఇష్టపడరు
విద్యావంతుల్లో కొందరు బాగానే చదవగలరు. బాగా మాట్లాడగలరు. కాని కొత్త విషయాలు నేర్చుకోడానికి ఇష్టపడరు. మార్పుని త్వరగా ఆమోదించరు అంటూ ఓ చిన్న మాటగా గొప్పగా చెప్పారు. అలాంటి వారిని చదువుకున్న నిరక్షరాస్యులు అనొచ్చు. నిజమే. వాస్తవమో కాదో తెలియని వాస్తే నీకు శాపమైంది అంటూ సచివాలయంపై వెయ్యి కోట్ల వెర్రిని వర్ణించిన కవిత బాగుంది. సిద్ధ విద్యాధరి వీణ ధనమ్మాళ్ అంటూ అమృతవర్షిణిలో ధనమ్మాళ్ గురించి తెలుసుకొని ఆనందించాము. శ్రీపాద పినాకపాం గారిని మెప్పించిన ఆమె వైదుష్యం ప్రశంసార్హం.
-పి.శుభ (కాకినాడ)
నిర్వచనం
ఉద్యోగానికి నిర్వచనం ఏమిటి? ఒకరి దగ్గరో, మరో ఆఫీసులోనో పని చేసేదే ఉద్యోగమా? లేక తానే ఓ సంస్థలోనో, మరొక వ్యాపారం చేస్తుంటేనో, ఓ సంస్థను స్థాపిస్తేనో ఉద్యోగమంటారా? రోడ్డు మీద కూరలమ్ముకునే వాడిది, చెప్పులు కుట్టేవాడిదీ ఉద్యోగమే కదా. తన కుటుంబ సభ్యులను ధర్మ సంపాదనతో పోషించగలిగే కూలి పని కూడా ఉద్యోగమే. ‘ఇచ్చునదే విద్య’ అంటే చదువు కాదు. చదువురాని వాడు కూడా ఏ పని చేసో సంపాదించగలిగేదానే్న ‘విద్య’ అన్నాడు సుమతీ శతకకారుడు. ఇది సండే గీతాసారం. ఇక ఓ చిన్న మాటకొస్తే ఇంట్లో పనిచేసే గృహిణి రోజు మొత్తంలో నడిచే దూరం తనకు తెలియకుండా పనె్నండు కిలోమీటర్లు తిరుగుతుందట. ఈమె జీతం లేని ఉద్యోగి. అంటే ‘అన్‌పెయిడ్ లేబర్’ అని అంటారు. అమృతవర్షిణిలో అనేక సంగీత సరస్వతుల సంగతులను సంగీతాభిమానులకు ప్రతీ ఆదివారం తెలియపరుస్తున్నందుకు మల్లాది వారికి ధన్యవాదాలు.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
తేనె పూసిన కత్తి
ఆదివారం అనుబంధంలో ‘కవర్‌స్టోరీ’ శీర్షికన అందించిన ‘తేనె పూసిన కత్తి’ వ్యాసం ఆలోచింపజేసేదిగా ఉంది. మధుమేహం గురించి చక్కగా వివరించారు. షుగర్ వ్యాధి వచ్చిన తరువాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే రాకుండా చూసుకోవడం మంచిది. నమ్మండి.. ఇది నిజంగా నమ్మొచ్చా అన్నట్టు ఉంటుంది. పజిల్ నింపడం వల్ల కాలక్షేపమే కాక తెలియని తెలుగు పదాలు చాలా తెలుస్తున్నాయి. ఓ చిన్న మాటలో రాక్షసుడు మనలోనే ఉంటాడన్న నిజాన్ని తెలుసుకొని మట్టుపెట్టగలిగితే జీవితం చాలా అందంగా ఉంటుంది. థాయ్‌లాండ్‌లో వెలుగుల వేడుక చాలా బాగుంది. ‘అక్షరాలోచన’లో అంతర్మథనం బాగుంది. ప్రతీ ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అమృతవర్షిణిలో సూరిబాబు గారు ఆసక్తికరమైన ఎన్నో విషయాలను తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు.
-డి.వి.తులసి (విజయవాడ)
తర్కం
ఏ రోజు కారోజు మనం చేయాల్సిన పనులు కాగితం మీద రాసుకొని రాత్రి నిద్రించే ముందు ఎన్ని పనులు చేశాం అని తర్కించుకోవడం చాలా అవసరం అని చెప్పిన సండే గీత భళా!! చలి నుంచి చెట్లను రక్షించడానికి వాటికి స్వెట్టర్లు, ఊలు దారాలు చుట్టడం, రోడ్డుకి ఇరువైపుల రంగురంగుల స్వెట్టర్లు తొడుక్కున్న చెట్ల అందం దాన్నొక పర్యాటక కేంద్రంగా మార్చడం భలే బాగుంది. దేశ స్వాతంత్య్రం కోరుతూ ఒకరిపై ఒకరు నిలబడి మానవ స్థూపంగా ఏర్పడి ఉద్యమించడం ఆసక్తికరంగా ఉంది. నిజానికి ప్రజలు ప్రకటించుకున్న స్వాతంత్య్రాన్ని అణచివేసింది స్పెయిన్.
-బి.ప్రభాస్ (గాంధీనగర్)
విశేషాలు మస్త్
గోపాలంగారు దిల్లీ వెళ్లినరు. వచ్చినరు. విశేషాలు మస్త్‌గా చెప్పినరు. నిజమే. ఏదో పని మీద కొత్త ప్రదేశానికి వెళ్తే పని తప్ప షికార్లు కుదరవు కదా! చాలా క్రూరంగా దాడిచేసే అల్లిగేటర్ గార్ చేపల విశేషాలు తెలిసి ఆశ్చర్యపోయాం. అదృష్ట దేవతగా భావించబడే లేడీ బగ్, బట్టర్‌ఫ్లై ఫిష్‌లకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలిసి ఆనందించాం. 11 టన్నుల కారును 27 కి.మీ. దూరం లాగి అందరి చేతా శెహభాష్ అనిపించుకున్న అభిషేక్ కథ ఆకట్టుకుంది. స్ఫూర్తిదాయకంగా ఉంది.
-సదాప్రసాద్ (గొడారిగుంట)
సంస్కరణ
నోట్ల రద్దుపై కవర్ స్టోరీలో బాగా వివరించారు. ఏ సంస్కరణ ప్రారంభించినా మొదట గగ్గోలు సహజమే. ప్రభుత్వానికి వ్యతిరేక మీడియా ప్రతిపక్షాలూ అగ్ని రాజేయడమూ సహజమే. వందల కొద్ది డొల్ల కంపెనీలు బయటపడటం, సామాన్యుల ఖాతాల్లో నల్ల కుబేరులు భారీ మొత్తాలు బదిలీ చేయడం, అందుకు సహకరించిన బ్యాంకర్లను సస్పెండ్ చేయడం జరిగింది. దురదృష్టం కొద్దీ మన న్యాయవ్యవస్థ నత్తలతో పోటీ పడటం వల్ల ఫలితాలు బాగా ఆలస్యమవుతున్నాయి. కాస్త ఓపిక పడితే అంతా సర్దుకుంటుంది. మన ఆర్థికవేత్తలు గగ్గోలు చేసినా విదేశీ ఆర్థికవేత్తలు మన పరిస్థితి చాలా యూరోపియన్ దేశాల కంటే మెరుగే అంటున్నారు.
-కె.ప్రవీణ్ (కాకినాడ)