S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సపోటా ఆరోగ్యానికి సపోర్టే!

ఫ్రశ్న: మా పెరట్లో సపోటా చెట్టుంది. సపోటా పండ్లు ఆరోగ్యానికి మంచివేనా? అన్ని వ్యాధుల్లోనూ తినవచ్చా..? దాని ఆరోగ్య ప్రభావం గురించి సవివరంగా తెలుపగలరు.
-రాఘవరావు జింకా
(సికిందరాబాద్)
జ: సపోటా పండ్లను ప్రపంచానికి అందించింది అమెరికాయే! మెక్సికో దీని ప్రధాన స్థావరం. ఇండియాకి దీన్ని పోర్చుగీసులు తెచ్చి పరిచయం చేశారు. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వీటిని చీకు పండ్లని పిలుస్తారు. ‘మనిల్కర జపోటా’ దీని వృక్ష నామం. సపోడిల్లా అని పిలుస్తారు.
గోధుమ రంగులో ఉండే సపోటా గుజ్జుని చికిల్ అంటారు. పచ్చిగా ఉన్నప్పుడు గట్టిగానూ, వగరుగానూ ఉండి పాలు కారుతూంటుంది. పండిన తరువాత చాలా తియ్యం మారుతుంది. సహజంగా పండిన సపోటా ఆరోగ్యదాయకం. కార్బన్ వేసి పండించి, పండ్ల వ్యాపారులు మన జీవితాలతో ఆడుకుంటున్నారు. సక్రమంగా పండకపోతే దీని పాలలో ఉండే జిగురుదనం వలన పెదిమలు అంటుకుంటాయి. బాగా పండి, మిగలముగ్గిన వాసన వచ్చే పండు ఆరోగ్యదాయకం.
100 గ్రాముల సపోటా గుజ్జులో 83 కేలరీలుంటాయి. 12 మి.గ్రా. ఉప్పు, 193 మి.గ్రా. పొటాషియం ఉన్నాయి. అత్యధికంగా 20% ఫైబరు, 24% సి విటమిను, ఇంకా ఇతర విటమిన్లూ ఉన్నాయి.
సపోటాలో అత్యధికంగా ఫ్రక్టోజు అనే పంచదార పదార్థం ఉంటుంది. నీరసం వచ్చినప్పుడు గ్లూకోజు నీళ్లు రక్తంలోకి ఎక్కించేది ఈ ఫ్రక్టోజునే. శరీర కణాలకు ప్రధానంగా శక్తిని అందించేది ఈ ఫ్రక్టోజే!
సపోటాలో తీపి ఎక్కువగా ఉంటుంది. దాంతో సమానంగా పీచు పదార్థం కూడా ఉంటుంది. కాబట్టి షుగరు రోగులు సపోటాని తినటానికి మరీ భయపడవలసిన పని లేదు. ఎందుకంటే విష దోషాలను నివారించటానికి, వైరస్ - బాక్టీరియాల నుండీ శరీరాన్ని రక్షించటానికి అప్పుడప్పుడూ సపోటాని కడుపులోకి పంపుతూ ఉండటం అందరికీ అవసరమే!
సపోటా పండు వేడిని తగ్గిస్తుంది. అమితంగా చలవనిస్తుంది. వేడి వలన కలిగే దోషాలను ఆపుతుంది. బీపీని తగ్గిస్తుంది. పొడి దగ్గును తగ్గిస్తుంది.
పీచు పదార్థం ఎక్కువ కాబట్టి పేగులు బలసంపన్నం అవుతాయి. మలబద్ధత తగ్గుతుంది. కొవ్వు, షుగరు వగైరా రక్తంలో చేరకుండా ఈ పీచు నివారిస్తుంది. సపోటా పండు తింటే కడుపు నిండుతుంది. తేలికగా అరుగుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. రోజూ సపోటా జ్యూస్‌లో కొద్దిగా ఉప్పు కలుపుకుని తాగుతుంటే మలబద్ధత పోయి, కాలవిరేచనం అయ్యేలా చేస్తుంది. పేగుల్ని మృదువు పరుస్తుంది.
విష దోషాల్ని తగ్గించే పాలిఫినోలిక్ అనే శక్తివంతమైన రసాయనం కారణంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచటంలో సపోటా ఎక్కువ గుణవత్తరంగా ఉంటుంది. తరచూ జ్వరాలొచ్చేవారికి సపోటా తరచూ పెడ్తుంటే రోగి త్వరగా పుంజుకొంటారు.
సపోటా పండ్లకి వాపుని తగ్గించే గుణం ఉంది. పుండును మానే్ప గుణం కూడా ఉంది. అందుకనే పేగుపూత లాంటి వ్యాధుల్లో సపోటాలు ఉత్తమ ఫలితాన్నిస్తాయి. బొప్పాయి, సపోటాలు తింటూ ఉంటే పేగుపూత చాలా త్వరగా తగ్గుతుంది. పొట్టని శుభ్రం చేయటం ద్వారా వాతాది దోషాలను తగ్గిస్తుంది. వాతాది దోషాల వలన కలిగే అనేక జబ్బులు కూడా నెమ్మదిస్తాయి. దీనిలో ఉన్న అధిక డైటరీ ఫైబర్ (ఆహారపరమైన పీచు పదార్థం) వలన ఇది పెద్ద పేగుల్లో వచ్చే కేన్సర్‌ను నివారిస్తుంది. మొలలు, ఫిస్ట్యులా లాంటి వ్యాధుల్లో ఔషధంగా పని చేస్తుంది. మొలల్లో రక్తస్రావాన్ని ఆపుతుంది.
సపోటా పండ్లకు నరాల్లో ఉద్రేకాన్ని తగ్గించే శక్తి ఉంది. నరాల మీద వత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇందులో పుష్కలంగా ఉన్న బి విటమిన్ ఈ కార్యాన్ని బాగా నెరవేరుస్తుంది.
మొక్కగట్టిన రాగుల్ని ఎండించి మరాడించిన పిండిని రాగి మాల్ట్ అంటారు. రాగిమాల్టులో సపోటా గుజ్జు కలిపి రోజూ సాయంకాలం అల్పాహారంగా తీసుకుంటూ ఉంటే కాల్షియం లోపం సరి అవుతుంది. ఎండలో కూర్చోవటం అనే ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకండి. ఎముక పుష్టికి ఇది మంచి ఉపాయం.
సి విటమిన్ అధికంగా లభ్యం కావటాన ఇది వ్యాధి నిరోధక వ్యవస్థను శక్తిమంతం చేస్తుంది. అపకారం చేసే స్వేచ్ఛా విషాలను అరికడ్తుంది. టైఫాయిడ్ లాంటి జ్వరాల్లో సపోటా మేలు చేస్తుంది. ఎ విటమిన్ లోపాన్ని సరి చేసుకోవటానికి సపోటా ఉత్తమ సాధనం. గర్భాశయ కేన్సర్ నివారించటానికి ఇది ఉష్జ్ధంలా పని చేస్తుంది.
గర్భవతులకు సపోటా పండు చాలా మేలు చేస్తుంది. శరీరానికి శక్తినీ, మృదుత్వాన్నీ, తనకూ తన కడుపులో పెరిగే బిడ్డకు కావలసిన కనీస పోషకాల్నీ అందించటమే కాకుండా సౌకుమార్యాన్ని కూడా కలిగిస్తుంది. బిడ్డకు 6వ నెల వచ్చిన దగ్గర్నుంచీ కొద్దికొద్దిగా సపోటా పండు తినిపించటం మంచిది.
*
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట
పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com