యువ పండితుడు!
Published Saturday, 23 December 2017ఈ పెద్దాయన పేరు అనిరుథ్ తాంత్రిక్. ఆయన శిష్టుడు యదుకృష్ణ. ఈ యువ అర్చకుడి వయసు 21. కేరళలోని మనప్పురమ్ మహాదేవాలయంలో పెరుమాళ్ సేవలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇందులో విశేషం ఏముందంటే.. ఉందనే చెప్పాలి. ట్రావెన్కోర్ దేవస్థానం పరిధిలోని 1248 ఆలయాలున్నాయి. అందులో శబరిమల అయ్యప్ప ఆలయం కూడా ఒకటి. ఇప్పుడు తన పరిధిలోని ఆలయాల్లో 36మంది దళితులకు అర్చకులుగా అవకాశం ఇచ్చారు. వారిలో యదుకృష్ణ ఒకరు. ప్రస్తుతం సంస్కృతంలో ఎమ్ఎ చేస్తున్న యదు సంస్కృతంలో పీహెచ్డీ చేస్తానంటున్నారు. స్పష్టంగా, సూటిగా, శ్రావ్యంగా వేదాలు వల్లిస్తున్న యదుకృష్ణను చూసి గురువు అనిరుథ్ ఉప్పొంగిపోతుంటారు. ఇంతకీ యదుకృష్ణ తల్లిదండ్రులు రోజువారీ పనులకు వెళ్లి పొట్టపోసుకుంటూంటారు. ఇన్నాళ్లకు దేవుడు వారి ఘోష విని తన సేవకు పిలిపించుకున్నాడల్లే ఉంది కదూ!