S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చెరువు

జీ వితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఎన్నో కథలు కన్పిస్తూంటాయి. చాలా రోజుల క్రితం అలాంటిదే ఓ కథని చదివాను. ఆ కథను మళ్లీ ఈ మధ్య కాలంలో చదివాను. ఒక గొప్ప ఉత్సాహం కలిగే విధంగా ఆ కథ ఉంది. ఆ కథ నాకు బాగా నచ్చింది. అందుకని మీకు కూడా చెబుదాం అన్పించింది. ఆ కథ మీ కోసం.
తన దగ్గర వున్న శిష్యులు ఎప్పుడూ తన బాధలని గురువుకు వివరించేవారు. అందరికి బాధలు ఉంటాయని గురువుగారు ఎన్నిసార్లు చెప్పినా శిష్యులు సరిగ్గా విన్పించుకోలేదు. వారి బాధలు వినివిని చివరికి వారితో ఒక పని చేయించాడు.
ఒకరోజు ఉదయం అందరు శిష్యులను పిలిచి ఒక గ్లాసు నిండా నీళ్లు తెచ్చుకోమన్నాడు. అందులో ఓ పిడికెడు ఉప్పుని కలపమన్నాడు. ఆ తర్వాత తాగమని చెప్పాడు. కొంత తాగి మిగతాదంతా వదిలిపెట్టారు.
‘రుచి ఎలా ఉంది’ అడిగారు గురువు.
‘చేదుగా ఉంది’ అన్నారు శిష్యులు.
చిన్నగా నవ్వి ఒక దోసెడు ఉప్పు తీసుకొని పక్కనే ఉన్న చెరువులో కలపమన్నాడు. శిష్యులు ఆ విధంగా చేశారు.
ఓ గ్లాసెడు నీళ్లు తీసుకుని తాగమని చెప్పాడు. అందరూ ఆయన చెప్పిన విధంగా తాగారు.
‘రుచి ఎలా ఉంది’ అని అడిగారు గురువుగారు.
తియ్యగా వున్నాయని అన్నారు.
‘ఇప్పుడు చేదుగా లేవా?’ అని అడిగారు గురువుగారు.
‘లేవు’ అన్నారు.
అప్పుడు గురువుగారు ఇలా చెప్పారు. ‘జీవితంలో బాధ అనేది ఉప్పు లాంటిది. అది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. మనం స్వీకరించే దాన్నిబట్టి దాని రుచి మారుతుంది. మనం గ్లాసులో వేసి స్వీకరిస్తే చేదుగా ఉంటుంది. అలా కాకుండా చెరువులో వేసి స్వీకరిస్తే తియ్యగానే ఉంటుంది. అందుకని మనం గ్లాసులా మారకూడదు. చెరువులా మారాలి.
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి బాధలను తట్టుకోవడానికి ఈ కథ ఉపయోగపడుతుందని నాకనిపించింది. అందుకని ఈ వారం మీ కోసం ఈ కథ చెప్పాను.
గ్లాసు మాదిరిగా ఉండాలా? చెరువు మాదిరిగా ఉండాలి? నిర్ణయం తీసుకోవాల్సింది మనమే.
ఏమంటారు?