S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కల

హసన్ సూఫీ మార్మికుడు. ఆయనకు ఒక కొడుకు వుండేవాడు. యిరవయ్యేళ్లవాడు. అందరికీ ఆ కుర్రవాడంటే ఎంతో ఇష్టం. అతను అందగాడు. ఆహ్లాదంగా చిరునవ్వు నవ్వేవాడు. అతన్తో మాట్లాడడమన్నా అందరికీ ఇష్టం. అతని ఆకర్షణీయమైన రూపం ముచ్చటగొలిపేది. అతని సమవయస్కులతో ఆటలతో పాటలతో ఆనందంగా గడిపేవాడు. అతను తిరిగే వీధులు, అతని కుటుంబం అతని వునికిలో ఉల్లాసంగా వుండేవి.
హసన్‌కు అతని కొడుకంటే ఎంతో ఇష్టం. అతని దర్శనంతోనే తండ్రి పులకించేవాడు.
అట్లాంటి కొడుకు, యిరవయ్యేళ్ల వాడు హఠాత్తుగా ఒక రోజు చనిపోయాడు. ఊరంతా కన్నీరుమున్నీరయింది. కుటుంబం దుఃఖం కట్టలు తెంచుకుంది. శవాన్ని తీసుకపోవడానికి సిద్ధం చేశారు. అందరూ రోదిస్తున్నారు. కానీ హసన్ ఒక్కడే నిశ్శబ్దంగా వున్నాడు. అతని కంట్లో ఒక కన్నీటి బొట్టు కూడా కదలడం లేదు.
అంతలో హసన్ హఠాత్తుగా నవ్వడం మొదలు పెట్టాడు. జనం నమ్మలేక పోయారు. పైగా కొడుకు పోవడంతో పిచ్చెక్కిందనుకున్నారు.
‘హసన్! ఏమైంది? పిచ్చెక్కిందా? ఈ సంఘటనతో షాక్ తిన్నావా? ఎందుకలా నవ్వుతున్నావు?’ అని అడిగారు.
హసన్ ‘నేను షాక్ తినలేదు. నాకు పిచ్చెక్కలేదు. ఈ సంఘటన జరిగిన క్షణం తలకిందులయ్యాను. దుఃఖం కట్టలు తెంచుకుంది. కానీ వెంటనే ఆలోచనలో పడ్డాను. ఒకప్పుడు నేను సంతోషంగా ఉండేవాణ్ణి. నేను ఒక్కణ్ణే వున్నప్పుడు సమస్యే లేదు. నా కొడుకు పుట్టినపుడు అతను ఎప్పుడూ నాతోనే, నాలోనే వుండేవాడు. అతన్తో ఎడబాటు వుండేది కాదు. అతను పుట్టాడు, మళ్లీ వెళ్లిపోయాడు. నేను ఎప్పట్లా యథాస్థితికి చేరాను. కల ముగిసింది. ఎవరయితే నాకు కొడుకును యిచ్చాడో అతను తిరిగి తీసుకున్నాడు. యిదంతా మంచిది కాదని చెప్పడానికి నేనెవర్ని?’ అన్నాడు.
ఆ మార్మికుని ఆథ్యాత్మిక దృష్టికి అందరూ ఆశ్చర్యపోయారు.

- సౌభాగ్య, 9848157909