S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పని (సండేగీత )

చాలా రోజుల క్రితం ఒక కథ విన్నాను. ఆ కథలోని ఒక యువకుడు అందమైన జీవితాన్ని సౌకర్యాలని పొందాలని ఆకాంక్షిస్తూంటాడు. అలాగే కలలు కంటూ ఉంటాడు. ఏ పనీ చేయకుండా ఉంటాడు. ఏదైనా పని చేసినా చాలా కష్టంగా భావిస్తుంటాడు.
చివరికి అతను ఒకరోజు చనిపోతాడు. ఆ తర్వాత ఒక అందమైన ప్రదేశంలో అతనికి మెలకువ వస్తుంది. చుట్టూ సుందర వనాలు, మంచి సువాసన వెదజల్లే పుష్పాలు అతని హృదయాన్ని పరవశింప జేస్తాయి. ఓ అందమైన యువతి అతని దగ్గరకు వస్తుంది. ఆ యువతి కూడా అతను కలలో ఊహించినట్టుగానే ఉంటుంది.
ఆమె అతని దగ్గరికి వచ్చి ‘మీకు ఏం కావాలంటే అది లభిస్తుంద’ని చెబుతుంది. అతను ఆనందంతో ఊగిపోతాడు.
అతను కలలో ఊహించనివి అన్ని, అతను కోరుకున్నవి అన్నీ అతడు అక్కడ అనుభవిస్తాడు. కొద్ది సంవత్సరాల తర్వాత అతనికి విసుగు వస్తుంది. ఏ పనీ లేకపోవడం అతని జీవితం నిరర్థకంగా అన్పిస్తుంది.
అలాంటి భావనలో వున్న అతని దగ్గరికి ఒక రోజు ఆ యువతి వస్తుంది. ఆమె రాగానే ఆ యువకుడు ఆమెను పలకరిస్తాడు. జీవితంలో అతను కోరుకున్న సుఖాలన్నీ అనుభవించానని ఆమెకు చెప్తాడు.
ఆ తర్వాత ఇలా అంటాడు ‘ఏదైన ఉపయోగకరమైన పని చేయాల’ని ఉందన్న కాంక్షని ఆమెతో వెలిబుచ్చుతాడు. ఏదైనా పని చెప్పమని ఆమెను కోరుతాడు.
మీకు అన్ని సౌకర్యాలను ఇవ్వగలను కానీ పనిని మాత్రం ఇవ్వలేనని ఆమె చెబుతుంది. పని ఇక్కడ దొరకదని కూడా చెబుతుంది.
‘అలా అయితే జీవితాంతం వృధాగా గడపాల్సి వస్తుంది. ఈ నిర్వ్యాపకత్వాన్ని నేను భరించలేను. నరకంలో వున్నట్టుగా ఉంది’ అని అన్నాడు.
‘ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని అనుకుంటున్నారు?’ అంది ఆ యువతి. ఆ యువకుడు బిత్తరపోయాడు.
చాలా మంది ఏ పనీ లేకుండా నిర్వ్యాపకంగా ఉండాలని కాంక్షిస్తారు. అలాంటి వాళ్లకి కాస్త అయినా కనువిప్పు కలుగుతుందని అన్పించింది.
మనం పుట్టింది పని చేయడానికి మనల్ని ఈ భూమి మీదకి తీసుకురావడంలో ఒక ఉద్దేశం ఉంది. ఆ దిశగా మనం పని చేయాలి. అంతే కాని నిర్వ్యాపకంగా కాదు.

- జింబో 94404 83001