S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గుండెల సవ్వడి

సృష్టిలో వైవిధ్యం
జీవితంలో వైరుధ్యం
మనస్సుకు మనిషికి మధ్య ఆరాటం
మనిషికి మనుగడకు నడుమ పోరాటం
ఉనికి కోసం ఉబలాటం
కాలంతో నిత్యం పరుగు పందెం
క్షణ క్షణం మారే ఆకాశంలోని
మబ్బుల ఆకృతి లాంటి మనస్సు
అరక్షణంలో ఉరుములు మెరుపులు
గుండెల్లో భోరున వర్షం..
జీవన సంగీతాల గుండెల సవ్వడి
ఆశ నిరాశలు.. ఉచ్ఛ్వాస నిశ్వాసలు
హృదయంలో రెండు అరలు
కవల పిల్లల్లా రాగద్వేషాలు
మనస్సు చుట్టూ మనిషి
మనిషి చుట్టూరా మానవ సంబంధాలు
గుండె ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటుంది
స్మృతుల ముసుగులో
మనస్సు దోబూచులాడుతూ ఉంటుంది
దుఃఖం ఆనందం సమతుల్యం
ఆనందంలో తెలుసుకోలేని జీవితం
బాధలో అనుభవంలోకి వస్తోంది
అతిగా ఆనందించినా.. దుఃఖించినా..
తర్వాత శూన్యంతో నిండిపోతోంది
వెక్కివెక్కి ఏడ్చి నిద్రించిన శిశువులా
నిశ్చలమై.. నిశ్శబ్దమే...

-ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు 99511 28566