S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మట్టి జైత్రయాత్ర

యుగయుగాలుగా ప్రజల
కన్నీరు యింకిన మట్టి
తరతరాలుగా
రక్తంలో తడిసి
శాంతిని శ్వాసించి
హింసను రుచి చూసిన మట్టి
మృదువైనది
మనసైనది!
బంగారు వెండి ఇత్తడి
లోహాల్లా కఠినం కాదు
శిల్పి చేతిలో చిత్రాతిచిత్రంగా వొదిగి
విగ్రహవౌతుంది
ఆకృతి సరిదిద్దే ప్రక్రియలో
సుతిమెత్తని పదార్థవౌతుంది
ఒకచోట ప్రహరీగా
ఒకచోట గుడిసెగా
ఒకచోట మిద్దెగా
ప్రాణం పోసుకుంటుంది!
సారె శిల్పించిన కడవ
యువతి భుజంపైకెక్కి
వ్వనం ప్రదర్శిస్తంది
పొంతగా పొయ్యికి మూడో కాలై
కన్నీటిని నిలవచేస్తుంది
దీపమై వెలుగును మోస్తుంది
ప్రతిమై యింటిని అలంకరిస్తుంది!
మట్టి బాటసారి
సారవంతం నుండి నిస్సారానికి
మెట్ట నుండి పల్లానికి
గట్టు నుండి నిర్మాణానికి ప్రయాణిస్తుంది!
మట్టిది క్షమాగుణం
దురుసుగా కాలు జాడించినా
చీత్కరించి మలినం చేసినా
తవ్వి గాయపరచినా
ఓర్చుకుంటుంది
ఓర్పు నేర్పిస్తుంది!
మట్టిలో పుట్టిన మనిషి
మట్టిని జయిస్తాడు
మనిషికి బలవౌతాడు
మట్టిని జయించిన మనిషి
మట్టిలో కలుస్తాడు
మట్టికి బలవౌతాడు!
నోట్లో మట్టిగొట్టే
వ్యాపారుల్ని
రాజకీయ నాయకుల్ని
మట్టి ముమ్మాటికీ మట్టి కరిపిస్తుంది!

-అడిగోపుల వెంకటరత్నమ్ 9848252946