S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాకు నచ్చిన పుస్తకం మహాప్రస్థానం

మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి
ఈ పదాలు చాలు సమాజాన్ని జాగృతం చేయడానికి. ఈ పదాలు చాలు పీడిత వర్గాలను శాసించే భూస్వాముల గుండెల్లో గునపాలు దింపడానికి. ఇంగ్లీషు తెల్లదొరల పాలనలో భారతీయ సమాజంలో పట్టెడన్నం కూడా ఎరుగని శ్రమజీవులు ఎందరో ఉండేవారు. వారిని దగ్గరుండి పరిశీలించిన శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) 1934లో తన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చాడు. అదే కమ్మరి కొలిమిలో కాలిన నిప్పుకణికలా సమాజానికి ఒక ఎర్రటి సూరీడిని కళ్లముందు నిలిపింది. అదే మహాకావ్యంగా ఆవిర్భవించింది. ఆ కవిని మహా కవిని చేసింది. ఇప్పటికీ ఈ పుస్తకం దాదాపుగా రికార్డు స్థాయిలో 25 సార్లు పునర్ముద్రణకు నోచుకుంది. పుస్తకం చిన్నదైనా అక్షర లక్షలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి.
****
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లో సమాజంలో అణగారిపోతున్న బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలిచి పీడిత జనాల్ని బానిస బతుకుల నుంచి విముక్తి కల్పించడానికి ఎన్నుకున్న ప్రక్రియ కవిత్వం. తన ఆలోచలనకు అక్షర రూపం ఇస్తే వెలువడిన మహాకావ్యం మహా ప్రస్థానం. ఈ సంకలనంలో ఉన్న 21 కవితల్లో దేనికదే ఆణిముత్యం. ప్రజల్ని తట్టిలేపేవే. ముఖ్యంగా అందరి హృదయాలను కదిలించే మహాప్రస్థానం, జయభేరి, గంటలు, అవతార, జగన్నాథ రథచక్రాలు వంటిని కొన్ని ఉన్నాయి. మహాకవి కలం నుంచి 1934 సంవత్సరం ప్రాంతంలో జాలువారిన ఈపదాలు నా హృదయాన్ని తట్టిలేపాయి. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో కళాశాలలో ఆచార్యుల సూచన మేరకు పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకున్నాను. అందులో భాగంగా ముఖ్యమైన పుస్తకాల్ని చదవడం ప్రారంభించాను. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం కూడా చదివాను. అందులో శ్రీశ్రీవాడిన పదాలు శరాల వలే పీడిత వర్గాన్ని హింసించే బ్యూరోక్రాట్లకు తగిలేలా వాడిన తీరు నాకు నచ్చింది. నాలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. అంతవరకు సమాజంలో ఒకడిలా బతికే నాకు సమాజాన్ని చదివే అవకాశం కలిగించింది. సమాజాన్ని దగ్గరుండి చదివే అవసరాన్ని విప్పిచెప్పింది. తక్కువ తక్కువ పదాలు, అంత్యప్రాసలు కవిత్వానికి నిండుదనం చేకూర్చి చదవడానికి హాయి కలిగించేలా ఉన్నాయి. చదువుతున్న కొద్దీ చదవాలనిపించేలా చదువుతున్న కొద్దీ స్వరం పెంచి చదవాలనిపించేలా ఉన్న మహాప్రస్థానం కవితకు జోహార్లు. ఈ కవిత రాసి సమాజంలో అణగారిన వర్గాల్లో చైతన్యం నింపిన కవి శ్రీశ్రీ మహాశయునికి జోహార్లు.

-పీసపాటి సంపత్‌కుమార్