S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మెదడుకు మేత

లోకంలో ఆధునిక పోకడలు పొడసూపుతున్నాయి. పూర్వకాలంలో అప్పటి అవసరార్థం కనుగొన్న పరిశోధనలన్నీ పాతవవుతున్నాయి. వాటి స్థానంలో కొత్త పరిశోధనలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ పరిశోధనలే మానవుని దిశ దశ మారుస్తున్నాయి. ఎన్ని పరిశోధనలు వచ్చినా అప్పటికీ ఎప్పటికీ మారనిది పుస్తకం మాత్రమే. పుస్తకం అంటే కాయితాల గుత్తి కాదు. విజ్ఞాన భాండాగారం. అందులో ఎన్నో విజ్ఞాన విశేషాలు నిక్షిప్తం అయి ఉంటాయి. అందుకే పుస్తకం హస్త్భూషణం అనేది ఆర్యోక్తిగా నిలిచింది. అయితే ఆధునిక కాలంలో పుస్తకం స్థానంలో చరవాణి హస్త్భూషణంగా మారింది. వేల రూపాయల విలువైన చరవాణిలు చేతిలోకి వచ్చినా, గోడలకు తగిలించుకునే టీవీలు వచ్చినా పుస్తకానికి ఉన్న విలువ క్రేజ్ ఇంకా తగ్గలేదు. పుస్తకమనేది నిత్యనూతనం.
పుస్తకంలో ఉన్న విజ్ఞానాన్ని మస్తిష్కంలోకి ఎక్కిస్తే అది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఉపయోగపడుతుందనేది పెద్దల మాట. పుస్తక పఠనం అనేది ఒక వ్యాపకంగా మారే రోజు మన కళ్లముందే ఉందనిపిస్తోంది. ఎందుకంటే చరిత్ర పునరావృతం అవుతుందని నమ్మేవారికి ఈ వాక్యం నిత్య సత్యంగా ఉంటుంది.
పురాతన కాలంనుంచి వారి వారి ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చి ఒకచోట చేర్చిన ప్రక్రియ కొనసాగింది. అప్పట్లో అందుబాటులో ఉన్న వనరులతో తాళపత్రాలు సిద్ధం చేసి భద్రపరిచి ఆ విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు సిద్ధం చేసేవారు. రాను రాను మరిన్ని పరిశోధనల ఫలితంగా సిరాలు, కాయితాలు అందుబాటులోకి రావడంతో వాటిని ఉపయోగించుకుని కొంతమంది తమ విజ్ఞానాన్ని పుస్తక రూపంలో నిక్షిప్తం చేసేవారు రాను రాను అచ్చుయంత్రంతో పుస్తక రంగంలో విప్లవం వచ్చింది. ఎక్కడెక్కడి విషయాలను పుస్తక రూపంలో ముద్రించి భద్రపరిచే వ్యవస్థ వచ్చింది. ఇది మంచి పరిణామం.
తరగతి గదిలోనే సమాజం రూపొందుతుందని సూత్రీకరించిన మహానుభావుల మాటలననుసరించి విద్యార్థులకు ప్రథమ ఉపయుక్త వస్తువు పుస్తకమే. చక్కగా చదవడం వస్తే చక్కగా రాయగలరని, చక్కగా రాయగలిగితే చక్కగా మాట్లాడగలరనే భావ వ్యక్తికరణ సూత్రాల్లో చదవడానికే ప్రాధాన్యత ఇచ్చి చదువుకు మన పెద్దలు అగ్రతాంబూలం ఇచ్చారు.
వాఙ్మయంలో భావ వ్యక్తీకరణకు అవసరమైన భాష, దాని పుట్టుక, సమాజ అవసరాలకు అనుగుణంగా మార్పులు, వాటిపై పరిశోధనలతో కలిపితే పుస్తకానిది రెండో పాత్ర. భావ వ్యక్తీకరణకు లిపి, లిపిని లిఖించే ప్రక్రియలో ఏర్పడిన రూపం పుస్తకం. అచ్చుయంత్రం అందుబాటులోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ముద్రితమైన పుస్తకాల సంఖ్య కోట్లలోనే ఉంటుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
వైద్యనిపుణులు చెప్పిన విషయాలను బట్టి మన శరీరంలో అవయవాలు పనిచేయకపోతే కొన్ని తరాల తర్వాత క్రమేపీ వాటి ప్రాధాన్యతను తగ్గించుకుని కనుమరుగవుతాయి. పుస్తకాలు తరచు చదవడంవల్ల మెదడు ప్రేరేపితం అవుతుందని పరిశోధనలు తేల్చిచెప్పాయి. దాంతో మెదడు చురుగ్గా పనిచేయడం ప్రారంభించి కొత్త ఆలోచలనతో మానవ మనుగడ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో వివేచన కూడా మనిషిలో పెరుగుతుంది. పుస్తక పఠనంతో క్రమంగా మనలో కొత్త ఆలోచనలు రేకెత్తుతాయి. తద్వారా వాటిని లోకానికి అందించాలన్న ఉత్సుకత కలుగుతుంది.
ఆధునిక కాలంలో పరుగుతో ప్రారంభమైన జీవితానికి పుస్తక పఠనం మానసిక వత్తిడిని తగ్గించి ఎంతో విశ్రాంతి కలిగిస్తుందని వైద్యనిపుణులే అంగీకరిస్తున్నారు. పుస్తకాన్ని వెలువరించాలంటే అంతో ఇంతో విజ్ఞానం, పరిజ్ఞానం అవసరం. అలా మనకు లభ్యమైన పుస్తకాలను చదవగలిగితే పుస్తక రచయిత ఆలోచనలు మనకు తెలుస్తాయి. దీంతో మన ఆలోచనలు పదునుపెట్టి మరింత కొత్త సమాచారాన్ని సమాజానికి ఇచ్చి మేలుచేయగలిగిన వారమవుతాము. పుస్తకాలను పదే పదే చదవడం వల్ల మన పద సంపద వృద్ధి చెంది, సభలు సమావేశాల్లో అనర్గళంగా మాట్లాడేందుకు దోహదపడుతుంది.

* పుస్తకాలు చదవడం ఓ అలవాటు. ఓ ఇష్టం. ప్రపంచంలో అమెరికన్లు ఎక్కువగా పుస్తకాలు చదువుతారు. అక్కడి ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ అలవాటు ఉందట. అలా పుస్తకాలు చదివేవారిలో 25 శాతం మంది స్కీన్‌పై పుస్తకాలు చదవడానికి అలవాటుపడ్డారు. 13 శాతం మంది మొబైల్ స్కీన్లపై కూడా చదివేస్తారుట. 2016నాటి సర్వే ప్రకారం అమెరికన్లలో 75 శాతం మంది పుస్తకాలు ప్రింట్ అయిన పుస్తకాలను చదువుతారు. 65 శాతం మంది ప్రింట్‌లోనైనా, స్క్రీన్‌పైనైనా చదవడానికి సిద్ధమే.

* ప్రఖ్యాత ఆన్‌లైన్ రిటెయిల్ షాపింగ్ సంస్థ అమెజాన్ ఆవిర్భావం పుస్తక విక్రయాల కోసమే. 2017లో ఈ సంస్థ ద్వారా ఆన్‌లైన్‌లో 1984నాటి పుస్తకాల విక్రయం మహాజోరుగా సాగింది. దాదాపు ఆ సంవత్సరానికి సం బంధించిన పుస్తకాలన్నీ అమ్ముడుపోయాయి.

-గౌతమి