S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తత్వవేత్త

సూఫీ మార్మికుడు హసన్‌కి కొడుకు పుట్టాడు. హసన్ సంతోషించాడు. కొడుకు తోడిదే లోకం అయింది. హఠాత్తుగా కొడుకు చనిపోగా అందరూ విచారించినా హసన్ విచారించలేదు. ఇచ్చిన వాడే తీసుకుపోయాడని హసన్ మామూలుగానే మిగిలిపోయాడు ఆ తత్త్వవేత్త. క్రైం కథ చిక్కని చక్కని సస్పెన్స్‌తో ముగిసింది. కోరా తన భర్తని కెమెరా ట్రైపాడ్‌తో కొట్టి చంపి, ఆ నేరం ఫొటోగ్రాఫర్ మీదకు నెట్టేయడం, గోడ మీద వేలాడుతున్న డబ్బా కెమెరా కింద పడుతూ కోరా భర్తని ట్రై పాడ్‌తో మోది చంపడాన్ని ఫొటో తీయడం.. ఆ విధంగా ఫొటోగ్రాఫర్ శిక్ష నుంచి బయటపడటం ఊహాతీతం!
-కె.వింధ్యరాణి (శ్రీనగర్)
పండుగ
సంచిక ఆద్యంతమూ సంక్రాంతి పండుగ గురించి తెలిసిన, తెలియని, తెలుసుకోవలసిన విషయాలతో సమగ్రంగా, సమనస్కంగా రూపొందించినందుకు ధన్యవాదాలు. ముఖచిత్రం అపురూపంగానే కాక ఆలోచనాత్మకంగానూ ఉంది. సంక్రాంతి నవ్య, దివ్య, భవ్య క్రాంతులను చక్కగా వివరించారు. సాహితీ సంక్రాంతికి పల్లె కాంతి సమకూర్చే వెలుగు వైభవం అంతా ఇంతా కాదు. సంక్రాంతి పాటల గురించి విలువైన వివరాలను అందించారు. ముగ్గు ముచ్చటలు మగువల మనస్సుల మనోహరుణులే అయ్యాయి.
-డా.శివభూషణం (కర్నూలు)
విధి వైపరీత్యం
మనిషి దురాశతో అధిక పాల ఉత్పత్తి కోసం ఆవులకు హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వడం, ఆ విధంగా లభించిన పాలు తాగి బిడ్డలు అనారోగ్యం పాలవడం తెలిసిందే. పాలే కాదు, మనిషి దురాశకు అనేక ఆహార పదార్థాలు కల్తీకి గురై, మనుషుల ఆరోగ్యాలు దెబ్బ తీస్తున్నాయి. దురాశతో మనిషి మానవ జాతికే ముప్పుగా మారడం విధి వైపరీత్యమే. పదండి ముందుకు అనే వారున్నట్టే పదండి వెనక్కి అనేవారూ ఉన్నారు. వారు సృష్టించిన వెనక్కి పరిగెత్తే కారు ఆసక్తికరంగా ఉంది. రామాయణంలో కొన్ని తప్పులు చొప్పించి వాటిని కనుక్కునే శీర్షిక పిల్లల జ్ఞాపకశక్తికి ఎంతో దోహదం చేస్తోంది. బాగుంది.
-కె.సుధీర్ (తూర్పు గోదావరి)
అదో తుత్తి
క్యాలెండర్ మారినా పాపం అది తెలియక సూర్యుడు ఎప్పటిలానే ఉన్నాడు. నిజానికి అతడు వెనక్కి తిరిగి చూసుకోనక్కరలేదు. కాని మానవమాత్రులం మనం వెనక్కి చూసుకొని జరిగిన తప్పుల్ని గుర్తించి సరి చేసుకోవడం అవసరమే. గోపాలంగారిలానే ‘నాతోబాటు’ ఎందరో పుస్తకాలు కొంటారు. చదవరు! ఉద్గ్రంథాలు బీరువాల్లో పెట్టి ప్రదర్శించుకోడానికే తప్ప చదవడానికి కాదని అదో రకమైన తుత్తి! ప్రాపంచిక ప్రలోభాలకు లోబడకుండుటయే యోగం అంటూ పర అపర ప్రవృత్తుల సంయోగం గురించి వివరించిన వసంత్ కుమార్ గారి వ్యాసం వినదగినది చదవదగినది.
-బి.స్నేహమాధురి (పెద్దాపురం)
శూన్యం
ఈ రోజు, రేపు, వచ్చే రోజు కూడా శూన్యం లాంటివే. శూన్యాన్ని భర్తీ చేయవలసింది మనమే. మనం చేయాల్సింది. దాన్ని ఉపయోగించుకోవడమే. అది మన చేతిలోనే ఉందని చెప్పిన నూతన సంవత్సర ‘సండే గీత’ భావగర్భితంగా బాగుంది. కేదార్‌నాథ్, గంగోత్రి ప్రాంతాల్లో పుడమిపై మంచు దుప్పటి పరచిన ప్రకృతి దృశ్యాలు మనోహరంగా ఉన్నాయి. శ్రమ గీతం కవిత బాగుంది. శిల్ప కళ అంటే అడ్డదారులు వెతికే సోమరి కూడా నివ్వెరపోయే శ్రమ గీతం అనడం మరీమరీ బాగుంది. నాదయిన ఒక గొంతు కావలా. నాదయిన పాట పాడాలి అంటూ సాగిన ప్రపంచ వేదిక కవిత కూడా భేష్.
-పి.శుభ (కాకినాడ)
ప్రవాసి భారత్ దివస్
దూర తీరాలకు వెళ్లిపోయిన ప్రవాసులకు సొంతగడ్డపై మమకారం పెంచి జన్మభూమికి ఏదో ఒక ఉపకారం చేయాలనిపించేందుకు సింగపూర్‌లో ప్రవాసి భారత్ దివస్ జరిపించడం ప్రవాసుల్ని కార్యోన్ముఖుల్ని చేయడం ‘కవర్‌స్టోరీ’లో చక్కగా వివరించారు. ‘కుంచెం తేడాగా’ కార్టూన్లు బాగున్నాయి. రొయ్యల్లా కనిపించే అతి చిన్న జీవులు క్రిల్ గురించి మంచి విషయాలు చెప్పారు. పర్యావరణానికి ఇవి అవసరం అని అర్థం అయింది. అలాగే భూగోళం మీద అతి పెద్ద జాతి బ్లూవేల్ విషయాలు ఆకట్టుకొన్నాయి.
-వి.లంబకర్ణ (నాగవనం)
మాతృభూమి మమకారం
జాతిపిత మహాత్మాగాంధీ చాలాకాలం దక్షిణాఫ్రికాలో ఉండి, ప్రవాస భారతీయుడై 1915లో భారత్‌లో అడుగు పెట్టిన సందర్భంగా జనవరి 9న ఆయన రాకకు గుర్తుగా ప్రవాస భారత్ దివస్‌ను నిర్వహించాలని 2002లో నిర్ణయించారని తెలుసుకున్నాం. ఈసారి సింగపూర్‌లో నిర్వహించనున్నారని తెలుసుకున్నాం. ప్రభుత్వం పిలుపు మేరకు ప్రవాస భారతీయులు మాతృభూమిపై మమకారంతో మాతృభూమి అభివృద్ధిలో పాలుపంచుకోవాలి. ఈసారి సింగపూర్‌లో నిర్వహించడానికి కారణాలు వివరించారు. అవకాశాల కోసం, ఆదాయం కోసం దూర తీరాలకు వెళ్లిన వాళ్లు జన్మభూమి రుణం తీర్చుకోవాలి. వారిలో ఆ మార్పు వస్తున్నందుకు హర్షణీయం. విదేశాల్లో నేర్చుకున్న నైపుణ్యాన్ని, మేధోశక్తిని, సాంకేతిక ప్రజ్ఞను మాతృదేశ అభివృద్ధిలో ఉపయోగించాలి.
-సరికొండ శ్రీనివాసరాజు (వనస్థలిపురం)
కథ
ఎవరో ముక్కూ మొహం తెలీని వాళ్లతో జీవితం పంచుకొనే బదులు శరీరాలు కలిసిన మనం ఒక్కటైతే కనీసం మిగతా జీవితం అపరాధ భావం నుంచి తప్పించుకున్న వాళ్లమవుతాం అన్న రోషన్ మాటకు సుమ కట్టుబడి ఉండి పెద్దవాళ్ల అనుమతి సంపాదించి, రోషన్‌ని పెళ్లి చేసుకొన్న సుమ నిర్ణయం బాగుంది. తప్పు చేశానన్న భావం నుండి బయటపడ్డారు. కథ బాగుంది.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)