S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇహిమ్న్

ఒక వ్యక్తి సత్యానే్వషణలో పడి జీవిత రహస్యం గ్రహించడానికి ఒక సూఫీ గురువు దగ్గరకు వచ్చాడు. జీవిత రహస్యం తనకు తెలిసే మార్గం చూపమని అభ్యర్థించాడు.
సూఫీ గురువు అతన్ని పరిశీలించి నేను కొన్ని అక్షరాలు చెబుతాను. వాటిలో జీవన రహస్యముంది. వాటిని అనునిత్యం స్మరించు. నీకు జీవన తత్వం బోధపడుతుంది’ అన్నాడు. ఆ మాటల్తో అతను సంతోష పడిపోయాడు. సూఫీ గురువు ‘ఇహిమ్న్’ అన్న మాటని నిత్యం, నిరంతరం జపించు’ అన్నాడు. ఆ వ్యక్తి ఆ మాటని జపిస్తూ వెళ్లిపోయాడు.
సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ వ్యక్తి మాటల్ని నిత్యం జపిస్తూ గడిపాడు. ఎన్ని ఏళ్లయినా సత్యం బోధపడలేదు. జీవన రహస్యం అవగతం కాలేదు. అందుకని ఆ విషయం గురువుగార్నే అడిగి తెలుసుకుందామని ఆశ్రమానికి వచ్చాడు. కాని అప్పటికే ఆ సూఫీ గురువు చనిపోయి చాలా రోజులయింది. ఆ వ్యక్తి నిరాశపడి తనకు జీవిత సత్యం బోధపడకుండా తన బతుకు ముగిసిపోతుందేమో అని దిగాలు పడి వెళ్లబోతున్నాడు.
అంతలో ఆశ్రమంలోని ప్రధాన శిష్యుడు వచ్చి విషయమడిగాడు. ఇతను ‘గురువుగారు నాకు ఒక పదం చెప్పి దాన్ని జపిస్తే సత్యం బోధపడుతుందన్నారు. సంవత్సరాలు గడిచినా బోధపడలేదు. తిరిగి అడుగుదామని వస్తే గురువుగారే లేరు. అదీ నా పరిస్థితి’ అన్నాడు.
ప్రధాన శిష్యుడు ‘ఇహిమ్న్’ అంటే ‘ఇన్‌హురూఫ్ మానీ నదారంద్’ అన్న వాక్యానికి అది సంక్షిప్త రూపం. దాని అర్థమేమిటంటే ‘ఈ అక్షరాలకు ఏమీ అర్థం లేదు’ అని.
అతను ‘మరి గురువుగారు ఎందుకని వాటిని నిత్యం జపించమన్నారు’ అన్నాడు.
ప్రధాన శిష్యుడు ‘ఎందుకంటే వివరిస్తాను. ఒకవేళ గాడిద నీ దగ్గరకు వచ్చిందనుకో. దానికి తినడానికి క్యాబేజీ ఇస్తావు. అది దానికి బలాన్నిస్తుంది. దాన్ని ఆ గాడిద ఏ పేరుతోనన్నా పిలిచినా అది దానికి ఉపయోగం. అది క్యాబేజీని తింటూ దాన్ని మించింది ఏదో దాంట్లో వుందని వూహించుకుంటుంది. అది క్యాబేజీ ఇచ్చిన వాళ్ల తప్పుకాదు, అది గాడిద వూహల్లోని తప్పు’ అన్నాడు.
ఆ వ్యక్తికి ఆ మాటల్తో సత్యం బోధపడింది.

- సౌభాగ్య, 9848157909