S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బుల్లితెరపై మోజు!

అందాల భామ, గోవా బ్యూటీ ఇలియానా తాజాగా బుల్లితెరపై మోజు పెంచుకుంటోందిట! టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో అగ్ర హీరోలు, క్రేజీ స్టార్స్‌తో పాటు యువతరం కథానాయకులతో ఆడిపాడిన ఈ భామ ఉన్నదాన్ని వదిలేసి బాలీవుడ్‌కు వెళ్లి బాక్సాఫీస్ వద్ద బొక్కాబోర్లా పడింది. ఇక అక్కడ ఆశలు నీరుగారిపోయాక, మళ్లీ తిరిగొచ్చి దక్షిణాదిలో ‘కోటి’కి పడగలెత్తాలని తెగ ప్రయత్నాలు చేసింది. అలాంటివన్నీ కూడా బెడిసికొట్టాయి. క్రేజ్ కోసం ఓ మెట్టుదిగి హాటెస్ట్ ఫోజులతో ఫొటోల్లో వీరవిహారం చేసి సోషల్ మీడియా గుప్పించినా ఫలితం లేకుండా పోయింది. కొన్నాళ్లు ప్రేమాయణంతో బిజీ. కానీ, ఎన్నాళ్ళిలా? అనుకుందేమో.. సీరియస్‌గా సినీ ప్రయత్నాలు ఆరంభించింది. ఇంకో ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చేసింది. మంచి అవకాశాలు, క్యారెక్టర్లు లభిస్తే వెండితెరపైనే కాదు, బుల్లితెరపైనా కూడా నటిస్తానంటోంది. తనకు బుల్లితెరపై గుర్తుండిపోయే పాత్ర లభిస్తే తప్పకుండా చేస్తానంటూ సంకేతాలిస్తున్న ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌లో అజయ్‌దేవగణ్‌తో ఓ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో తొలి ‘కోటి’తారకు ఎన్ని కష్టాలొచ్చాయిరా బాబోయ్..! అంటూ ఆమె సన్నిహితులు వాపోతున్నారు. ప్చ్.. ఇలియానా!

సమీర్