S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కానుకలు

ఆమధ్య అమెరికా వెళ్లినప్పుడు చాలా షాపింగ్ మాల్స్‌కి తిప్పాడు మా అబ్బాయి అనురాగ్. వాల్‌మార్ట్ లాంటి వాటిని ఎన్నో చూశాను. అక్కడ ఓ విషయం గమనించాను. మనం కొన్న వస్తువులని తిరిగి ఇచ్చి మళ్లీ కొత్తవి తీసుకునే అవకాశం అక్కడ ఉంది. దానికి వాళ్లు ఇచ్చిన సమయం కూడా మరీ ఎక్కువ. షాపుల్లోకి వెళ్లినప్పుడు ఉత్సాహంగా కొనేస్తాం. ఇంటికి వచ్చిన తరువాత మన అభిప్రాయం మారిపోతుంది. అలాంటప్పుడు ఈ ఎక్స్చేంజ్ చేసుకునే విధానం చాలా సౌకర్యంగా అన్పిస్తుంది.
మన దేశంలో కూడా ఇలాంటి పద్ధతులు దాదాపుగా వచ్చేశాయి. చాలామంది ఈ సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. ఇది చాలా ఉపయుక్తంగా ఉంది. మరీ ముఖ్యంగా కానుకల విషయంలో మరీ ఉపయోగంగా ఉంటుంది.
కానుకలు అందరినీ ఆనందింపజేస్తాయి. చాలామంది వద్దని చెబుతారు. కానీ కానుకలని ఇష్టపడతారు. శుభకార్యాలప్పుడు చాలామంది కానుకలని ఇస్తూ ఉంటారు. కొంతమంది డబ్బు రూపంలో ఇస్తూ వుంటారు. వాళ్ల ఖర్చులకి కొంత ఉపయోగకరంగా ఉంటుందని అలా ఇస్తూ ఉంటారు.
కానుకలని వస్తు రూపేణా ఇచ్చిన వ్యక్తులు కానుకల మీద ధరని చెరిపేస్తూ వుంటారు. తాము ఇచ్చిన వస్తువు విలువ తెలియకుండా వుండటం కోసం అలా చేస్తూ వుంటారు.
ఈ అలవాటుని మానేస్తే మంచిదని అన్పిస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చిన బహుమతి వాళ్లకి నచ్చకపోవచ్చు.
నచ్చినా రంగు నచ్చకపోవచ్చు.
ఆ బహుమతి బదులు వేరే వస్తువు వాళ్లకు అవసరమైనది తీసుకుందామని వాళ్లకి అన్పించవచ్చు.
ఏమైనా ఆ ధరల చీటిని, ట్యాగ్‌లని చింపకుండా బహుమతులని ఇవ్వాలి.
అంతేకాదు.
మనం కొన్న రసీదుని కూడా అందులో అడుగున పెట్టాలి.
దీనివల్ల వాళ్లకి ఎక్స్చేంజి చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
మనం ఇచ్చిన బహుమతి మన స్తోమత ప్రకారం ఇస్తాం. వాళ్ల స్తోమతని బట్టి కాదు.
అందుకని ధరని తొలగించకుండా ఇస్తే మంచిది.
డబ్బు రూపేణా ఇవ్వడంలో ఒక రకమైన వెసులుబాటు ఉంది. ఉపయోగం ఉంది.

- జింబో 94404 83001