S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిలుక

ఒక గృహస్థుని ఇంట్లో ఒక రామచిలుక ఉండేది. పంజరంలో నించి ముద్దుముద్దుగా మాట్లాడేది. దాని యజమాని, భార్యా పిల్లలు దాన్ని ప్రేమగా చూసుకునే వాళ్లు. దానితో మాట్లాడి కాలక్షేపం చేసేవాళ్లు. ఆ గృహస్థు వ్యాపారస్థుడు. పొరుగు వూళ్లకు వెళ్లి వ్యాపారం చేసేవాడు. వస్తూ ఇంట్లో వాళ్లకు, రామ చిలుకకు కావలసినవి తీసుకొచ్చేవాడు.
ఎప్పట్లా అతను వ్యాపార నిమిత్తం పొరుగూరు వెళుతూ భార్యాపిల్లల్ని ‘మీకు ఏం కావాలి?’ అని అడిగాడు. వాళ్లు వాళ్ల కిష్టమయిన వస్తువులు చెప్పారు. ఎప్పట్లాగే రామచిలుకను ‘నీకు ఏం కావాలి? నీకు ఇష్టమయిన బాదం పప్పులు, జీడిపప్పులు, జామకాయలు తీసుకు రమ్మంటావా?’ అని అడిగాడు.
చిలుక ‘నాకు అవేవీ వద్దు. నాకొక చిన్న సాయం చేసి పెట్టు’ అంది. అతను ‘తప్పకుండా’ అన్నాడు. ‘నా తోబుట్టువయిన రామచిలుక గుర్తుకొస్తోంది. నువ్వు ఎక్కడైనా బస చేసినపుడు అక్కడ చిలుకలు కనిపిస్తే వాటిని వాకబు చెయ్యి’ అంది.
అతను ‘అదెంత పని. తప్పకుండా’ అన్నాడు.
అతను పొరుగూరు వెళ్లి వ్యాపార కార్యకలాపాలు ముగించుకొని భార్యాపిల్లలకు కావల్సినవి కొని బయల్దేరి మధ్యలో ఒక తోటలో ఆగి విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు చెట్టు మీద రామచిలుకలు కనిపిస్తే తన పెంపుడు చిలుక చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ‘మా చిలుక తోబుట్టువు గురించి తెలుసా?’ అన్నాడు. వెంటనే ఒక చిలుక కొమ్మపై నించి దబీమని కింద పడి చనిపోయింది.
అతను ఆశ్చర్యపడి ఇంటికి వచ్చి చిలుకతో ఆ సంగతి చెప్పాడు. ఆ మాట వింటూనే చిలుక కాళ్లు తన్నుకొని చనిపోయింది.
ఇంటిల్లిపా ది ఏడ్చారు. అంత ప్రేమతో పెంచుకున్న చిలుక హఠాత్తుగా చనిపోయినందుకు బాధపడి దాన్ని తీసుకుని ఇంటి వెనక్కి వెళ్లి చిన్న గుంత తవ్వారు. చనిపోయిన చిలుకను పక్కన పెట్టారు. వాళ్లు గుంత తవ్వుతూ వుంటే చిలుక హఠాత్తుగా ఎగిరి కొమ్మ మీద వాలింది.
అందరూ ఆశ్చర్యపోయారు. యజమాని ‘ఎందుకిలా చేశావ్’ అని అడిగాడు. చిలుక ‘నువ్వు నా తోబుట్టువును చూశావు. అది కిందపడి చనిపోలేదు. అట్లా నటించి నాకు దారి చూపింది. మీరు ప్రేమగా చూసుకున్నారు. కానీ స్వేచ్ఛలేని జీవితంలో ప్రేమకు అర్థం ఉండదు’ అని ఎగిరిపోయింది.

- సౌభాగ్య, 98481 57909