S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పంచుతుంటే పెరిగేది ప్రాణ ప్రజ్ఞ

హ్మయ్య చాలకాలం తర్వాత మరోమారు దర్శనమిచ్చాడు. అతడి రాక అంతరార్థం ఏవో కొన్ని భావాలను వెదజల్లటానికే.. మరికొన్ని ఆలోచనలను రేకెత్తించటానికే. ఇంకొన్ని రహస్యాలను రాబట్టడానికే.
‘ఈ మధ్య మీరు ప్రేమ విస్తరించాలి. భౌతికం కరగాలి అన్నారు. పర అపర ప్రవృత్తుల సంయోగం అన్నారు. ఇహ పర సమన్వయ సంయోగ సిద్ధి అన్నారు. ఈ మూడు వ్యాసాలు మా యోగ సాధనను మలుపు తిప్పేవిగా ఉన్నాయి. మాకు తెలీని ఎన్నో గిక రహస్యాలన తెలియజేస్తున్నాయి. ఇంకా ఏయే కోణాలను మీ కలం ఆవిష్కరిస్తుందా అని ఎదురుచూస్తున్నాం...’
‘బ్రహ్మయ్యగారూ! వాటిని అటుంచండి. ఇంతకీ మీ కృష్ణుడు మనల్ని ‘మూఢా మానుషీం’ అని అన్నాడు తెలుసా?! మనం కృష్ణుడ్ని అవమానపరుస్తున్నామట’
బ్రహ్మయ్యనే నిశితంగా చూస్తున్నాను.
‘నేను నమ్మను గురూజీ! కృష్ణుడు మనల్ని ఎందుకు అలా అంటాడు..’ బ్రహ్మయ్య.
‘గీత తొమ్మిదో అధ్యాయం పదకొండో శ్లోకం చూడండి. మీకే అర్థం అవుతుంది. తన సర్వాతీత తత్వాన్ని అర్థం చేసుకోలేక మనమందరం మానవ రూపంలో కృష్ణుడ్ని ఆరాధిస్తూ అవమానిస్తున్నామనటం స్పష్టంగా కనిపిస్తుంది.’
బ్రహ్మయ్య ఆలోచనలో పడ్డాడు. ఒకింత విచారగ్రస్తుడయ్యాడు.
* * *
భగవద్గీతకు నేపథ్యమైన కురుక్షేత్ర సంగ్రామం ఒక ప్రపంచ యుద్ధమే.. అది జరిగింది ద్వాపర యుగంలోనే. ఈ యుగంలో సైతం గత శతాబ్దంలో కురుక్షేత్ర సంగ్రామానికి తీసిపోని విధంగా ప్రపంచ యుద్ధాలు జరిగాయి.
* * *
యుద్ధం అంటే మృత్యువు వాకిట నిలబడటం.
మరి, కురుక్షేత్ర మహాసంగ్రామం అంటే మృత్యువును మరింతగా కళ్లింతలు చేసుకుని చూడటమే! మృత్యువు విరాడ్రూపాన్ని చూడటమే!
మృత్యువు విరాట్ తత్వాన్ని వొడిసిపట్టుకున్నాడు కాబట్టే అర్జునుడి వివేక ప్రజ్ఞకు విషాదయోగం బీజమైంది.
అసలు, భౌతిక సంపదను అశుభ సంపదగా పరిగణించటం తెలీనంత కాలం మనం దోషారోపణ మనస్కతలో ఉన్నట్లే. ఇక్కడ దోషారోపణం అంటే గుణగణాలను లెక్కించటం. ఈ గుణగణ లెక్కలన్నీ ‘అసూయ’ను మన వెంటే తిప్పుతుంటాయి. క్రింది అంచున అసూయ వేలాడుతుంటే పై అంచున అహం విర్రవీగుతుంటుంది. ఈ రెండంచుల జీవితం నుండి మనం విడివడాలంటే ‘విజ్ఞాన సహిత జ్ఞానం’ మన స్వంతం కావాలి.. ‘రాజగుహ్య నిరూపణ యోగ’ సాధనలో తలమున్కలవ్వాలి.
నాడు ‘రాజగుహ్య నిరూపణ యోగం’గా బీజప్రాయమైన యోగమే నేడు ‘్భృక్తరహిత తారక రాజయోగం’గా మహావృక్షమైంది. ప్రవర్థమానమై ప్రవర్తిల్లుతోంది. నాటి రాజగుహ్య యోగం ఉపదేశమృతమైతే, అదే ఉపదేశ గీతం ‘్భృక్తరహిత తారక రాజయోగం’లో ప్రయోగ క్షేత్రమైంది.
వ్యాస మహర్షి యోగ ప్రభల్ని ‘రాజగుహ్యం’ ‘రాజవిద్యా’ అని కృష్ణుని నోట పలికించాడు.. అంటే భృక్తరహిత తారక రాజయోగం అనేగా! పైగా ‘ప్రత్యక్షావగమం’ అనీ అన్నాడంటే ‘ప్రత్యక్షంగా అనుభవ సిద్ధి’ని పొందమనే. అంటే, గిక ప్రయోగం సాధనా సిద్ధిగా ఫలితమివ్వాల్సిందే. పరిణమించాల్సిందే.
మొత్తానికి యోగ విద్యలలోకెల్లా తలమాణికం కాబట్టి రాజయోగం అయింది.. రహస్యాల నన్నిటిని పొదువుకున్నది కాబట్టి రాజగుహ్యమైంది. ‘పవిత్రం’ ‘ఉత్తమం’ ‘సుసుఖం’ ‘్ధర్మ్యం’ కలిసిన ‘ప్రత్యక్షావగమం’ కాబట్టి ‘తారక రాజయోగం’గా భాసిల్లింది.. భృక్తరహిత తారక రాజయోగంగా ఈనాడు మన మానవ గిక పరిణావానికి మార్గదర్శి అయింది. ఈ గిక జ్ఞానం అవినాశి!
గీతాచార్యడు ‘అశ్రద్ధ ధానాః పురుషా’ అని తొమ్మిదవ అధ్యాయంలోని మూడవ శ్లోకంలో అంటాడు. శ్రద్ధ కొరవడిన పురుషులు అంటే శ్రద్ధలేని మానవులు ‘మృత్య సంసార వర్త్మని’ - మృత్యు కుహరమైన సంసార మార్గాన్ని విడనాడకుంటారని అంటాడు. అంటే సంసార మార్గంలో డిటాచ్‌మెంట్ సాధ్యమైతే కనక మృత్యువు నుండి సైతం డిటాచ్‌మెంట్ సంప్త్రవౌతుందనేగా!
ఇక్కడ డిటాచ్‌మెంట్ అంటే అటాచ్‌మెంచ్ పరంగా ఉదాసీన వైఖరి అలవడటమే కానీ సంసార బంధవిముక్తం కావటం కాదు. సంసార యానంలో ఉదాసీనత సాధ్యమైననాడు మృత్యువు విషయంలోను, మృత్యువు వాకిటను ఉదాసీనంగా ఉండటం సాధ్యవౌతుంది.
ఇదే అధ్యాయంలోని తొమ్మిదవ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడితో ‘ఉదాసీన వదాసీనం’ అని తన తత్వాన్ని తెలియజేస్తాడు. అంటే ఉదాసీనతతో ఆసీనుడునై ఉన్నాను అని. ఇక్కడ ఆసీనం అంటే తత్వం అని.. యోగీశ్వరుడైన కృష్ణుని అస్తిత్వానికి మూలమైన రహస్యం అది. ‘కర్మాణి నిబధ్నంతి’ అనీ అంటాడు. మనం మానవ కర్మలనుకున్నవేవీ యోగిని బంధించవు, బాధించవు -అని.
* * *
గీతలోని కృష్ణుడు యోగీశ్వరుడు.. యోగి. అంతేకానీ మానవ ఆకారంలో దర్శనమిచ్చే రూపం కాదు అతడిది.. మానవ ఇంద్రియాలకు గోచరం కాని స్వరూపం యోగిది. సకల ప్రాణులు యోగీశ్వరుని యోగ భూమికలలో అధివసించి ఉంటాయి. అంటే ఈ చరాచర సృష్టిని యోగి ఆక్రమించి ఉంటాడే తప్ప అవి యోగిని ఆక్రమించి ఉండవు. సకల చరాచర ప్రాణికోటికి, సృష్టి వైచిత్రికి అతీతంగా పరిణమించగల ప్రజ్ఞ యోగిది.
‘న చ మత్‌స్థాని భూతాని పశ్య మే యోగ మైశ్వరమ్’
అన్నది నవమ అధ్యాయంలోని పంచమ శ్లోకం. గిక ప్రజ్ఞ అంటేనే ‘ప్లెంటీ ఆఫ్ ప్రాణా లెవల్స్’ అందకోవటం. యోగి ప్రాణ ప్రజ్ఞతో అలరారుతూ ఆ ప్రజ్ఞను కేవలం తన కొరకే నిల్వ చేసుకోడు కదా! పంచుతుంటే పెరిగేది ప్రాణ ప్రజ్ఞ. అందుకే యోగీశ్వరుడైన కృష్ణుడు తన స్వరూపమే ప్రాణుల్ని ఉత్పన్నం చేసి వర్థిల్ల చేస్తోందంటాడు.
‘యథాకాశ స్థితో నిత్యం వాయుస్సర్వత్రగో మహాన్’
ఈ శ్లోక పాద అర్థం సర్వత్రా సంచరించే వాయువు సర్వదా ఆకాశంలోనే ఉంటుందని. ఇక్కడ వాయువు అంటే ఈథర్.. వాయు స్థితి ఆకాశ స్థితి... ఆకాశం వూన్యం అనే అరూప స్థితికి నెలవు. ఇదంతా ఈథరిక్ ప్రాంగణం... యోగి పరిణామమంతా ఈథరిక్ పరిణామమే... శూన్య ప్రాంగణ ఆవాసమే.
మొత్తానికి ఈ సర్వాతీత భావాన్ని అందుకుని, ఆచరణ మార్గం పట్టిన వాడు యోగ సాధకుడు... గ్రహించలేని వాడు సామాన్య మానవుడు. యోగీశ్వరుని మానవ రూపంలో పూజిస్తే కలిగే ప్రయోజనమేమిటో గీతాచార్యుడు కృష్ణుని ద్వారా ఇలా బోధిస్తున్నాడు.
‘అవజానంతి మాం మూఢా మానుషీం తను మాశ్రీతమ్/ పరం భావమజానంతో మమ భూత మహేశ్వరమ్’
అవును యోగి సర్వాతీతుడు. ఈ గ్రహింపు లేని జనులు వివేకహీనులు, మూఢులు. అంటే మానవ రూపంలో యోగీశ్వరుని చూసుకుంటూ ఆ యోగీశ్వరుని అవమానించటం జరుగుతోంది - అని నాడే కృష్ణుడు స్వయంగా చెప్పాడు. అయినా కృష్ణుడు ఇంకా పూజాగదికే పరిమితమై పోతూ, భగవద్గీత నిత్య పారాయణ గ్రంథంగానే పరిణమిస్తోంది తప్ప నిత్య ఆచరణీయ పొత్తంగా అందరికీ ఆదరణీయం కాలేకపోతోంది.
యోగి నిర్దయుడే.. కృష్ణుడు యోగీశ్వరుడు కాబట్టి మరింతగా నిర్దయుడు. అందుకే-
‘మోఘాశా మోఘ కర్మాణో మోఘ జ్ఞానో విచేతనః/ రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రీతాః’
ఈ శ్లోకంలో మూడు మార్లు ‘మోఘం’ పునరావృతమైంది. ఇక్కడ మోఘం అంటే ‘వ్యర్థమైన’ ‘అనవసరమైన’ ‘నిష్ఫలమైన’ అని అర్థాలు.
‘మోఘాశా’ అంటే ‘మోఘాశులు’ అని అర్థం. పనికిమాలిన వ్యర్థ కామనలు కలవారు మోఘాశులు. ఈ కామనలు యోగులకు ఏ మాత్రం అక్కరకు రావు. ఈ కామనల నడుమ కూరుకుపోయిన వారు సామాన్యులు... రాక్షస ప్రవృత్తి కలవారు.
‘మోఘ కర్మాణో’ అంటే ‘మోఘకర్ములు’.. శాశ్వతత్వానికి ఉపకరించని కర్మలు చేసేవారు మోఘకర్ములు.. ఈ కర్మలు నిష్ఫలాలు.. పైగా అసుర ప్రవృత్తి ప్రతిబింబకాలు.
ఇక ‘మోఘ జ్ఞానం’ అంటే ‘మోఘ జ్ఞానులు’... అవివేకులు.. జ్ఞానశూన్యులు. అర్థవంతం కాని జ్ఞాన సమృద్ధులు... ఒక విధంగా వీరు మోహావేశులు. వీరి జ్ఞాన ప్రకర్ష, పాండిత్య ప్రకర్ష దేనికీ అక్కరకు రాదు.
మొత్తానికి ఈ ‘మోఘ’ జనులు యోగ తత్వాన్ని అర్థం చేసుకోలేక పోతున్నారన్నది కృష్ణ ఉవాచలోని పరితాపం.. కాబట్టి యోగిది అద్వయ రూపం... వివేక జ్ఞానం.. విశ్వముఖం.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946