S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వరుసగా మూడో రోజూ మార్కెట్లలో బడ్జెట్ జోష్

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లలో బడ్జెట్ సానుకూల పవనాలు వరసగా మూడో రోజు కూడా బలంగా వీచడంతో గురువారం సెనె్సక్స్ మరో 364 పాయింట్లు పెరిగి దాదాపు నెల రోజుల గరిష్ఠస్థాయి అయిన 24,607 పాయింట్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణుల కారణంగా మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగడం కూడా మార్కెట్ ర్యాలీకి దోహదపడింది. బుధవారం వెల్లడించిన అమెరికా ఉద్యోగ డేటా అద్భుతంగా ఉండడంతో గురువారం ప్రధాన ఆసియా మార్కెట్లు చాలావరకు లాభాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సైతం ప్రారంభంనుంచే లాభాల్లో కదలాడాయి. కాగా, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం తిరిగి 7400 పాయింట్ల స్థాయికి చేరుకుంది. కొత్త ఆర్డర్లు తగ్గిన కారణంగా సేవా రంగం కార్యకలాపాలు మూడు నెలల కనిష్టస్థాయికి పడిపోయినట్లు ఓ ప్రైవేటు సర్వే వెల్లడించిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ అతి త్వరలోనే వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాల కారణంగా కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రధానంగా అమ్మకాలు జరుపుతున్న విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు ఒక్క బుధవారం రోజే రూ. 1437.50 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేసినట్లు గణాంకాలు వెల్లడించడం కూడా ర్యాలీకి దోహదపడింది. ఫలితంగా సెనె్సక్స్ 364 పాయింట్లు పెరిగి 24,606.99 పాయింట్ల వద్ద ముగిసింది. గత ఫిబ్రవరి 8 తర్వాత సెనె్సక్స్ ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. గత నెల 29న 2016-17 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత గత రెండు రోజుల్లోనే సెనె్సక్స్ 1241 పాయింట్లు లాభపడ్డం తెలిసిందే. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 106.75 పాయింట్లు లాభపడి 7475.60 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో నాలుగు తప్ప మిగతా అన్ని షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్ షేరు అత్యధికంగా 7.17 శాతం లాభపడగా, టాటా మోటార్స్ షేరు 6.1 శాతం లాభపడింది. ఎల్‌అండ్‌టి, బిహెచ్‌ఇఎల్, డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్స్, టిసిఎస్, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా లాంటి ప్రధాన కంపెనీల షేర్లు సైతం మంచి లాభాలనే ఆర్జించాయి. అయితే ఐసిఐసిఐ బ్యాంక్, ఐటిసి, ఎన్‌టిపిసి, మారుతి సుజుకి షేర్లు నష్టపోయాయి.