S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రెండింతల జరిమానా, ఏడేళ్ల జైలు శిక్ష

న్యూఢిల్లీ: దేశంలో నల్లధనాన్ని కూడబెట్టిన వారికి కేంద్ర ప్రభుత్వం మరోసారి తీవ్రమైన హెచ్చరిక చేసింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన నాలుగు నెలల ‘కాంప్లియన్స్ విండో’ ముగిసేలోగా నల్లధన వివరాలను ప్రకటించకుండా ఆ తర్వాత అక్రమ సంపదతో పట్టుబడిన వారు 30 శాతం పన్నుపై రెండింతల జరిమానా చెల్లించడంతో పాటు ఏడేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. పార్లమెంట్‌లో సోమవారం 2016-17 సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ అరుణ్ జైట్లీ ప్రకటించిన ఈ కాంప్లియన్స్ విండో జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దేశంలో నల్లధానాన్ని కూడబెట్టిన వారు ఆ మొత్తంపై 30 శాతం పన్నును, మరో 15 శాతం జరిమానాను చెల్లించడం ద్వారా ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకునేందుకు వీలుకల్పిస్తూ నాలుగు నెలల వ్యవధితో జైట్లీ ఈ కాంప్లియన్స్ విండోను ప్రకటించిన విషయం తెలిసిందే. దీని గడువు ముగిసిన తర్వాత అక్రమ సంపదతో పట్టుబడిన వారి నుంచి 30 శాతం పన్నును వసూలు చేయడంతో పాటు పెనాల్టీని 60 శాతానికి పెంచుతారు. దీంతో వారు చెల్లించాల్సిన 45 శాతం మొత్తం రెట్టింపు అవుతుంది.
దేశంలో నల్లధనాన్ని కూడబెట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం గత రెండేళ్లలో రూ.20 వేలకోట్లకు పైగా అక్రమ సంపదను వెలికితీయగలిగిందని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్వి హస్ముఖ్ అధియా పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దేశంలో ఎవరైనా నల్లధనాన్ని కూడబెట్టినట్లు పన్ను వసూలు విభాగం వద్ద సమాచారం ఉంటే కాంప్లియన్స్ విండోను ఉపయోగించుకోకుండా వారిని డిబార్ చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ‘కాంప్లియన్స్ విండోను సద్వినియోగం చేసుకుని నల్లధన వివరాలను ప్రకటించకుండా ఆ తర్వాత అక్రమ సంపదతో పట్టుబడిన వారికి 30 శాతం మూల పన్ను రేటుపై 200 శాతం పెనాల్టీ విధించడంతో పాటు ఆదాయ పన్ను చట్టం ప్రకారం వారిని ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుందని అధియా వివరించారు.